Eggs For Weight Loss: వేగంగా బరువు తగ్గాలా.. అయితే గుడ్లను ఇలా తీసుకోండి!

ప్రస్తుతం మారిన లైఫ్ స్టైల్, తీసుకునే ఆహారంలో మార్పులు, బీజీ లైఫ్ కారణంగా ఎన్నో సమస్యలను ఎదుర్కొనాల్సి ఉంటుంది. వాటిల్లో అధిక బరువు కూడా ఒకటి. తినడానికి సరైన సయమం లేకపోవడం, అలాగే తీసుకునే ఆహారంలో నాణ్యత లేకపోవడం వల్ల బరువు అనేది పెరిగి పోతున్నారు. దానికి తోడు కదలకుండా ఒకే చోట కూర్చిన పని చేయడం వల్ల కూడా కొవ్వు అనేది పేరుకుపోతుంది. ఉదయాన్నే వాకింగ్, వ్యాయామాలు, యోగా వంటివి చేస్తే బరువును కాస్త తగ్గించుకోవచ్చు. బరువు తగ్గాలంటే చాలా మంది తీసుకునే ఆహారాన్ని..

Eggs For Weight Loss: వేగంగా బరువు తగ్గాలా.. అయితే గుడ్లను ఇలా తీసుకోండి!
Eggs Benefits
Follow us
Chinni Enni

| Edited By: Ravi Kiran

Updated on: Oct 27, 2023 | 9:50 PM

ప్రస్తుతం మారిన లైఫ్ స్టైల్, తీసుకునే ఆహారంలో మార్పులు, బీజీ లైఫ్ కారణంగా ఎన్నో సమస్యలను ఎదుర్కొనాల్సి ఉంటుంది. వాటిల్లో అధిక బరువు కూడా ఒకటి. తినడానికి సరైన సయమం లేకపోవడం, అలాగే తీసుకునే ఆహారంలో నాణ్యత లేకపోవడం వల్ల బరువు అనేది పెరిగి పోతున్నారు. దానికి తోడు కదలకుండా ఒకే చోట కూర్చిన పని చేయడం వల్ల కూడా కొవ్వు అనేది పేరుకుపోతుంది. ఉదయాన్నే వాకింగ్, వ్యాయామాలు, యోగా వంటివి చేస్తే బరువును కాస్త తగ్గించుకోవచ్చు. బరువు తగ్గాలంటే చాలా మంది తీసుకునే ఆహారాన్ని తగ్గించేస్తారు. అలాగే ఫైబర్ రిచ్ ఫుడ్స్ ని తీసుకుంటారు. దీని కారణంగా ఇతర శరీర భాగాలకు అందాల్సిన పోషకాలు అందడం లేదు. దీంతో ఇతర సమస్యలు వస్తున్నాయి.

గుడ్డుతో అధిక బరువుకి చెక్:

అయితే మనం తీసుకున్న ఆహారాల్లో కోడి గుడ్లు కూడా ఒకటి. వీటిని తింటే బరువు పెరుగుతారని పక్కకు పెట్టేస్తారు. కానీ గుడ్లు బరువు తగ్గేందుకు ఇవి బాగా హెల్ప్ చేస్తాయి. గుడ్లలో పోషక విలువలు ఎక్కువగా ఉంటాయి. శరీరానికి గుడ్లు చేసే మేలు అంతా ఇంతా కాదు. అందుకే రోజూ ఒక కోడి గుడ్డు తింటే.. డాక్టర్ కి దూరంగా ఉండొచ్చని చెబుతారు. గుడ్లు అధిక ప్రోటీన్, క్యాల్షియం, తక్కువ కేలరీలు ఉంటాయి. వీటిని తినడం వల్ల బరువును కంట్రోల్ చేసుకోవచ్చు. బరువు తగ్గాలనుకునే వారు ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో వీటిని యాడ్ చేసుకోవచ్చు. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారు ఎలాంటి సంకోచం లేకుండా గుడ్లను తినవచ్చు. కోడి గుడ్లను ఎలా తిన్నా పర్వా లేదు కానీ.. గుడ్లను మాత్రం నూనెలో వేయించి తీసుకోకూడదు.

ఇవి కూడా చదవండి

గుడ్డుతో ఎలా బరువు తగ్గుతారు:

ఒక గుడ్డులో సుమారు 6 గ్రాముల ప్రోటీన్లు ఉంటాయి. అలాగే తక్కువ మోతాదులో కేలరీలు ఉంటాయి. కాబట్టి గుడ్డు తింటే కడుపు నిండిన ఫీలింగ్ వస్తుంది. దీంతో ఇతర ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకోలేం. ప్రోటీన్లు ఉన్న ఆహారం తీసుకుంటే.. ఆహారంలోని థర్మిక్ ప్రభావాన్ని పెంచవచ్చు. ఇది జీవ క్రియను వేగవంతం చేస్తుంది. ఆహారం జీర్ణం కావాలంటే కేలరీలు అనేవి ఎక్కువగా అవసరం ఉంటుంది. కాబట్టి శరీరంలో కొవ్వు ఫాస్ట్ గా కరుగుతుంది. ఈ విధంగా వెయిట్ లాస్ అవ్వొచ్చు.

బరువు తగ్గాలంటే వీటిని తగ్గించండి:

వెయిట్ లాస్ అవ్వాలంటే ముందుగా డీప్ ఫ్రైడ్ ఆహారాలను తగ్గించాలి. అలాగే చీజ్, వెన్న వంటి ఫుడ్స్ కి దూరంగా ఉండాలి. బరువు తగ్గాలని ప్లాన్ చేస్తుంటే మాత్రం.. ప్రాసెస్డ్ ఫుడ్, జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్స్ ని తీసుకోకపోవడమే బెటర్. అలాగే క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ ఉండాలి. ఇలా కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడం వల్ల బరువును తగ్గించుకోవచ్చు.

గమనిక: ఇది ఇంటర్నెట్ నుంచి సేకరించిన సమాచారం. వీటిని ఫాలో అయ్యే ముందు ఒకసారి నిపుణులను సంప్రదించడం మేలు.

గుమ్మడి గింజలు మహిళలకు చేసే మేలు అంతా ఇంతా కాదు..
గుమ్మడి గింజలు మహిళలకు చేసే మేలు అంతా ఇంతా కాదు..
యూట్యూబ్‌ను వీడు ఎందుకు వాడుకున్నాడో తెలిస్తే బిత్తరపోతారు..
యూట్యూబ్‌ను వీడు ఎందుకు వాడుకున్నాడో తెలిస్తే బిత్తరపోతారు..
ఈజీగా హిందీ నేర్చుకోవాలనుకునేవారికి సూపర్ ఆప్షన్
ఈజీగా హిందీ నేర్చుకోవాలనుకునేవారికి సూపర్ ఆప్షన్
ఎవరూ ఊహించని ప్లేస్‌లో ప్రభాస్ ది రాజా సాబ్ సినిమా ఆడియో లాంచ్
ఎవరూ ఊహించని ప్లేస్‌లో ప్రభాస్ ది రాజా సాబ్ సినిమా ఆడియో లాంచ్
పార్వతీదేవిని అలా చూపిస్తారా ?? కన్నప్ప టీమ్‌పై హిందువుల ఆగ్రహం
పార్వతీదేవిని అలా చూపిస్తారా ?? కన్నప్ప టీమ్‌పై హిందువుల ఆగ్రహం
శ్రీతేజ ఆరోగ్యంపై కిమ్స్‌ డాక్టర్స్ కీలక ప్రకటన
శ్రీతేజ ఆరోగ్యంపై కిమ్స్‌ డాక్టర్స్ కీలక ప్రకటన
హైబీపీ మందులు ఆరోగ్యానికి హాని కలిగిస్తాయంట.. జాగ్రత్త మరి..
హైబీపీ మందులు ఆరోగ్యానికి హాని కలిగిస్తాయంట.. జాగ్రత్త మరి..
ఆసుపత్రిలో చేరిన విశాల్ ?? హెల్త్ బులిటెన్ రిలీజ్ చేసిన డాక్టర్స్
ఆసుపత్రిలో చేరిన విశాల్ ?? హెల్త్ బులిటెన్ రిలీజ్ చేసిన డాక్టర్స్
పిల్లల్లో గుండె పోటు లక్షణాలు.. వెంటనే అలెర్ట్ అవ్వండి..
పిల్లల్లో గుండె పోటు లక్షణాలు.. వెంటనే అలెర్ట్ అవ్వండి..
గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్‌ నిర్మాతలకు బిగ్ షాక్
గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్‌ నిర్మాతలకు బిగ్ షాక్