Winter Season Tips: చలికాలంలో ఎలాంటి రోగాలు రాకుండా హెల్దీ గా ఉండాలంటే వీటిని తీసుకోండి!
చలి కాలం మొదలైంది. వాతావరణం ఇలా మారిందో లేదో.. అప్పుడే జ్వరాలు, జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటివి స్టార్ట్ అవుతాయి. అయితే మారుతున్న వాతావరణానికి అనుగుణంగా జీవన శైలి, ఆహారపు అలవాట్లు కూడా మార్చోవాలని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. లేదంటే అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడాల్సి వస్తుంది. చలి కాలంలో ముఖ్యంగా సూర్య రశ్మి చాలా తక్కువగా వస్తుంది. కాబట్టి ఆహారం చాలా త్వరగా తీసుకోవాలి. లేదంటే జీర్ణ సమస్యలు వస్తాయి. అలాగే ఇమ్యూనిటి పవర్ అనేది తగ్గుతూ ఉంటుంది. కాబట్టి ఆరోగ్యంగా, బలంగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవాలి. మరి రోగాల..
చలి కాలం మొదలైంది. వాతావరణం ఇలా మారిందో లేదో.. అప్పుడే జ్వరాలు, జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటివి స్టార్ట్ అవుతాయి. అయితే మారుతున్న వాతావరణానికి అనుగుణంగా జీవన శైలి, ఆహారపు అలవాట్లు కూడా మార్చోవాలని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. లేదంటే అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడాల్సి వస్తుంది. చలి కాలంలో ముఖ్యంగా సూర్య రశ్మి చాలా తక్కువగా వస్తుంది. కాబట్టి ఆహారం చాలా త్వరగా తీసుకోవాలి. లేదంటే జీర్ణ సమస్యలు వస్తాయి. అలాగే ఇమ్యూనిటి పవర్ అనేది తగ్గుతూ ఉంటుంది. కాబట్టి ఆరోగ్యంగా, బలంగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవాలి. మరి రోగాల బారిన పడకుండా ఉండేందుకు ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
మసాలా దినుసులు:
చలి కాలంలో చలి అనేది ఎక్కువగా ఉంటుంది. దీంతో శరీరంలో ఉష్ణోగ్రత పడిపోతూ ఉంటుంది. దీంతో రోగ నిరోధక శక్తి తగ్గి.. వివిధ అనారోగ్య సమస్యల్ని ఎదుర్కొనాల్సి ఉంటుంది. ఇలా కాకుండా శరీరంలో ఉష్ణోగ్రత లెవల్స్ పడిపోకుండా ఉండాలంటే.. మసాలా దినుసులతో తయారు చేసిన ఆహార పదార్థాలను తీసుకోవాలి.
డ్రైఫ్రైట్స్:
డ్రైఫ్రైట్స్ లో ఎన్నో రకాల పోషకాలు, విటమిన్లు, మినరల్స్ ఉంటాయి. చలి కాలంలో ఆరోగ్యంగా ఉండేందుకు ఇవి బాగా హెల్ప్ చేస్తాయి. ఇమ్యూనిటీ పవర్ ను పెంచుతాయి.
ఆకు కూరలు:
ఆకు కూరల్లో విటమిన్లు, మినరల్స్, ఖనిజాలు ఇలా అనేక పోషకాలు ఉంటాయి. కాబట్టి చలి కాలంలో ఆకు కూరలు తినడం వల్ల బాడీ స్ట్రాంగ్ గా తయారువుతుంది. ఇన్ ఫెక్షన్లు బారిన పడే అవకాశం తగ్గుతుంది.
సూప్ లు:
సూప్స్ గురించి అందరికీ తెలుసు. సాధారణంగా రెస్టారెంట్స్, హోటల్స్ కు వెళ్లినప్పుడు ఆహారం తినకు ముందు వీటిని తీసుకుంటూరు. సూప్స్ లో ఎన్నో రకాలు ఉంటాయి. వీటిల్లో మీ టేస్ట్ కి తగిన విధంగా ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకుని ఆస్వాదించండి. సూప్స్.. శరీరంలోని ఉష్ణోగ్రత లెవల్స్ ను పెంచుతాయి.
వ్యాయామాలు:
చలి కాలం వచ్చేసరికి బద్ధకంగా, చల్లగా ఉంటుంది. ఎలాంటి పనులు చేయాలనిపించదు. దీంతో ఈజీగా బరువు పెరిగే ఛాన్స్ కూడా ఉంది. కాబట్టి చలి కాలంలో ఎక్సర్ సైజ్ లు, వాకింగ్ వంటివి చేస్తే చాలా మంచిది. ఇమ్యూనిటీ లెవల్స్ కూడా పెరుగుతాయి.
గమనిక: ఇది ఇంటర్నెట్ నుంచి సేకరించిన సమాచారం. వీటిని ఫాలో అయ్యే ముందు ఒకసారి నిపుణులను సంప్రదించడం మేలు.