- Telugu News Photo Gallery Home Remedies: Is there a lot of ants in the house? follow these tips at home
Home Remedies: ఇంటి నిండా చీమలతో చిరాకు వస్తుందా.. ఈ చిట్కాలతో చెక్ పెట్టండి!
సాధారణంగా ఇంట్లో చీమలు ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి. అయితే కొందరి ఇళ్లలో మాత్రం ఈ సమస్య బాగా ఎక్కువగా ఉంటుంది. ఏ పదార్థాన్ని వండినా.. కాసేపట్లో అక్కడికి చేరిపోతాయి. అన్నం, కూరలు, ముఖ్యంగా స్వీట్ ఐటెమ్స్, బెల్లం, పంచదార, పెరుగు వంటివి కనిపిస్తే చీమలన్నీ వాటిల్లోనే ఉంటాయి. చీమలే కదా అని వాటిని మనం దులిపి పక్కకు తుడిచేస్తాం. కానీ అవి బ్యాక్టీరియాల్ని మోసుకొస్తాయని చాలా తక్కువ మందికి తెలుసు. ఇటీవల జరిగిన అధ్యయనంలో చీమల వల్ల శ్వాస కోశ సమస్యలు, అలర్జీలు, ఆస్తమా వంటి సమస్యలు..
Updated on: Oct 27, 2023 | 9:45 PM


ఇటీవల జరిగిన అధ్యయనంలో చీమల వల్ల శ్వాస కోశ సమస్యలు, అలర్జీలు, ఆస్తమా వంటి సమస్యలు వస్తాయని తేలింది. అయితే చీమల బెడద వదిలించుకోవడానికి చీమల మందును వాడుతూంటారు. అలా కాకుండా ఇంట్లోని కొన్ని రకాల టిప్స్ ని ఉపయోగించి వీటి బెడదను వదిలించుకోవచ్చు. మరి ఆ చిట్కాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

వేప నూనె: వేప నూనెతో కేవలం చీమలనే కాకుండా.. ఇతర పురుగులకు కూడా చెక్ పెట్టవచ్చు. చీమలు ఎక్కువగా ఉన్న ప్రదేశంలో వేప నూనెను స్ప్రే చేయడం వల్ల.. ఆ ఘాటు వాసనకు అటు వైపు రావడం మానేస్తాయి.

కారం - మిరియాల పొడి: ఎర్ర కారం, మిరియాల పొడి ఘాటైన వాసనను కలిగి ఉంటాయి. చీమలు ఎక్కువగా చోట.. తీపి పదార్థాలపై కొద్దిగా కారం లేదా మిరియాల పొడిని చల్లి వాటిపై చల్లితే.. ఆ వాసనకు చీమలు అటు వైపు రావడం మానేస్తాయి. అలాగే వంట గది మూలల్లో వీటిని చల్లవచ్చు.

లెమన్ యూకలిప్టస్ ఆయిల్: ఈ ఆయిల్ ను లెమన్ యూకలిప్టస్ అనే చెట్టు నుంచి తీస్తారు. ఈ ఆయిల్ తో చీమల బెడదకు చెక్ పెట్టవచ్చు. అలాగే ఈ చెట్టు నుంచి దూది పింజల్ని తీసి చిన్న చిన్న ఉండల్లా చేసుకోవాలి. వీటిని.. ఈ ఆయిల్ వేసి పిండి.. వంట గది మూలల్లో లేదా చీమలు ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో పెడితే చీమలే కాకుండా, దోమలు, ఇతర పురుగులు కూడా రాకుండా ఉంటాయి.




