- Telugu News Photo Gallery Cricket photos IND Vs ENG Virat Kohli Eyes on Equals to Sachin Tendulkar 49th Odi Century in ICC World Cup 2023
IND vs ENG: ఇంగ్లండ్‌పై క్రికెట్ దేవుడి రికార్డుకు బ్రేకులు.. సరికొత్త చరిత్ర దిశగా కింగ్ కోహ్లీ..!
IND vs ENG, ICC World Cup 2023: న్యూజిలాండ్‌తో జరిగిన చివరి మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ 95 పరుగులతో పవర్ ఫుల్ ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో 20 ఏళ్ల తర్వాత ఐసీసీ ఈవెంట్‌లో న్యూజిలాండ్‌పై భారత్‌కు తొలి విజయం లభించింది. ఆ మ్యాచ్‌లో కేవలం 5 పరుగుల తేడాతో సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న 49 వన్డే సెంచరీల ప్రపంచ రికార్డును బద్దలు కొట్టడాన్ని కోహ్లీ కోల్పోయాడు.
Updated on: Oct 27, 2023 | 9:07 PM

ఈ ప్రపంచకప్‌లో అజేయంగా కొనసాగుతున్న రోహిత్ సేన.. ఈ ఆదివారం (అక్టోబర్ 29) తన ఆరో మ్యాచ్‌లో ఇంగ్లండ్‌తో తలపడనుంది. అద్భుతమైన ఫామ్‌లో ఉన్న విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్‌లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచాడు. ఈ ప్రపంచకప్‌లో కోహ్లీ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. 5 ఇన్నింగ్స్‌లలో 354 పరుగులు చేశాడు. దీంతో ఈ ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌ల జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు.

ఇంగ్లండ్‌పై అద్భుత ప్రదర్శన చేసిన విరాట్.. తాను ఆడిన 35 వన్డేల్లో 3 సెంచరీలు, 9 హాఫ్ సెంచరీల సాయంతో 43.22 సగటుతో 1340 పరుగులు చేశాడు. ఇంగ్లండ్‌తో వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాట్స్‌మెన్‌ల జాబితాలో కోహ్లీ రెండో స్థానంలో ఉన్నాడు. ఇంగ్లండ్‌పై కోహ్లీ కంటే సచిన్ టెండూల్కర్ మాత్రమే ఎక్కువ పరుగులు చేశాడు.

సచిన్ ఇంగ్లండ్‌పై 37 వన్డేల్లో 2 సెంచరీలు, 10 అర్ధసెంచరీలతో 44.09 సగటుతో 1455 పరుగులు చేశాడు. వన్డే ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన 2 వన్డేల్లో కోహ్లీ తన అత్యధిక స్కోరు 37తో సహా 74 పరుగులు చేశాడు.

న్యూజిలాండ్‌తో జరిగిన చివరి మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ 95 పరుగులతో పవర్ ఫుల్ ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో 20 ఏళ్ల తర్వాత ఐసీసీ ఈవెంట్‌లో న్యూజిలాండ్‌పై భారత్‌కు తొలి విజయం లభించింది. ఆ మ్యాచ్‌లో కేవలం 5 పరుగుల తేడాతో సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న 49 వన్డే సెంచరీల ప్రపంచ రికార్డును బద్దలు కొట్టడాన్ని కోహ్లీ కోల్పోయాడు.

ఈ ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ తన 48వ సెంచరీని నమోదు చేశాడు. అంతకు ముందు ఆస్ట్రేలియాపై 85 పరుగులతో చెలరేగిన విరాట్.. ఆఫ్ఘనిస్థాన్‌పై భారత్ విజయంలో హాఫ్ సెంచరీ ఇన్నింగ్స్ ఆడాడు.




