- Telugu News Photo Gallery Cricket photos Travis Head 3rd Fastest odis Century for Australia in nz vs aus world cup 2023 27th match
AUS vs NZ: 10 ఫోర్లు.. 7 సిక్స్‌లు.. కేవలం 59 బంతుల్లోనే రికార్డ్ సెంచరీ.. ఊచకోతకు కేరాఫ్ అడ్రస్ ఈ ఓపెనర్..
AUS vs NZ, World Cup 2023, Travis Head: ఈ రోజు ఆస్ట్రేలియా వర్సెస్ న్యూజిలాండ్ ప్రపంచ కప్ 2023లో ముఖాముఖిగా తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ ధర్మశాలలో జరుగుతోంది. ఆస్ట్రేలియా ఓపెనర్ ట్రావిస్ హెడ్ 59 బంతుల్లో సెంచరీ సాధించి, ప్రత్యేక జాబితాలో చేరాడు. దీంతో టాస్ ఓడిన ఆస్ట్రేలియా 49.2 ఓవర్లలో 388 పరుగులకు ఆలౌటైంది. న్యూజిలాండ్ ముందు భారీ టార్గెట్ ఉంచింది.
Updated on: Oct 28, 2023 | 3:23 PM

Fastest Hundreds For Australia: ఆస్ట్రేలియా ఓపెనర్ ట్రావిస్ హెడ్ 2023 ప్రపంచ కప్‌లోకి ఎంట్రీ ఇచ్చిన తొలి మ్యాచ్‌లోనే బీభత్సం సృష్టించాడు. ఈ టోర్నీలో తొలి మ్యాచ్‌లోనే అద్భుత సెంచరీ సాధించాడు. దీంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 49.2 ఓవర్లలో 388 పరుగులకు ఆలౌటైంది.

ధర్మశాలలో న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ట్రావిస్ కేవలం 59 బంతుల్లో 100 పరుగులు పూర్తి చేశాడు. అతని తుఫాన్ ఇన్నింగ్స్ కారణంగా తన పేరును ప్రత్యేక జాబితాలో నమోదు చేసుకున్నాడు. ఇప్పుడు వన్డే క్రికెట్‌లో ఆస్ట్రేలియా తరపున ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన నాలుగో బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు.

ఈ జాబితాలో గ్లెన్ మాక్స్‌వెల్ మొదటి స్థానంలో ఉన్నాడు. ఇదే ప్రపంచకప్‌లో నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మ్యాక్స్‌వెల్ 40 బంతుల్లో సెంచరీ చేసి తన పాత రికార్డును తానే బద్దలు కొట్టాడు. అంతకుముందు ఆస్ట్రేలియా తరపున వన్డేల్లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన రికార్డు మ్యాక్స్‌వెల్‌పై ఉంది. 2015 ప్రపంచకప్‌లో శ్రీలంకపై మ్యాక్స్‌వెల్ 51 బంతుల్లో 100 పరుగులు పూర్తి చేశాడు.

మ్యాక్స్‌వెల్ తర్వాత ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ జేమ్స్ ఫాల్క్‌నర్ ఉన్నాడు. 2013లో బెంగళూరు వన్డేలో టీమిండియాపై ఫాల్క్‌నర్ 57 బంతుల్లో సెంచరీ సాధించాడు. ఇప్పుడు ట్రావిస్ హెడ్ (59) తన పేరును నాలుగో స్థానంలో నమోదు చేసుకున్నాడు.

ఆస్ట్రేలియా ట్రావిస్ హెడ్ సేవలను గత కొద్ది రోజులుగా కోల్పోయింది. సెప్టెంబర్‌లో ట్రావిస్ హెడ్ గాయపడ్డాడు. దీంతో గత నెల రోజులుగా ఆస్ట్రేలియా జట్టుకు దూరమయ్యాడు. ఇటీవలే భారత్‌కు తిరిగొచ్చాడు. ప్రపంచ కప్‌లో ఆస్ట్రేలియా తన మొదటి ఐదు మ్యాచ్‌లలో కోల్పోయింది. ఓపెనింగ్ జోడీ వైఫల్యంతో కంగారూ జట్టు తన తొలి రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోవడానికి ఇదే కారణం. ట్రావిస్ రాక తర్వాత ఆస్ట్రేలియాకు ఓపెనింగ్ జోడీ సమస్య పరిష్కారమైంది.




