Rohit Sharma: ఇంగ్లండ్‌పై రోహిత్ ‘సెంచరీ’.. హిట్‌మ్యాన్ ఖాతాలో స్పెషల్ రికార్డ్.. అదేంటంటే?

Rohit Sharma, ICC World Cup 2023: వన్డే ప్రపంచకప్‌లో భారత్ ఇప్పటి వరకు ఆడిన ఐదు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించింది. పాయింట్ల పట్టికలో నంబర్ 2 స్థానంలో నిలిచింది. ఇక భారత జట్టు ఆరో మ్యాచ్‌ని ఇంగ్లాండ్‌తో ఆడనుంది. అక్టోబర్ 29న జరగనున్న ఈ మ్యాచ్ కెప్టెన్‌గా రోహిత్ శర్మకు స్పెషల్ మ్యాచ్ కానుంది. దీంతో ఈ మ్యాచ్‌ను కూడా గెలిచి, తన ఖాతాలో మరో రికార్డ్‌ను లిఖించుకునే అవకాశం ఉంది.

Venkata Chari

|

Updated on: Oct 28, 2023 | 8:05 PM

Rohit Sharma, ICC World Cup 2023: వన్డే ప్రపంచకప్‌లో భారత్ తన ఆరో మ్యాచ్‌ని ఇంగ్లండ్‌తో ఆడనుంది. అక్టోబర్ 29న జరగనున్న ఈ మ్యాచ్ కెప్టెన్‌గా రోహిత్ శర్మకు 100వ మ్యాచ్ కావడం విశేషం.

1 / 6
రోహిత్ శర్మ క్రికెట్‌లోని మూడు ఫార్మాట్లలో మొత్తం 99 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. అతని నాయకత్వంలో భారత్ 73 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా, 23 మ్యాచ్‌ల్లో ఓడింది. రెండు మ్యాచ్‌లు డ్రా అయ్యాయి.

2 / 6
కెప్టెన్‌గా రోహిత్ శర్మ రెండు ఆసియా కప్‌లు, నిదాహస్ ట్రోఫీ, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలను గెలుచుకున్నాడు.

3 / 6
దీంతో పాటు అంతర్జాతీయ క్రికెట్‌లో 18 వేల పరుగులు పూర్తి చేసేందుకు రోహిత్ శర్మ ఇంగ్లండ్‌పై 47 పరుగులు చేయాల్సి ఉంటుంది.

4 / 6
రోహిత్ శర్మ 476 ఇన్నింగ్స్‌ల్లో 456 మ్యాచ్‌లు ఆడి 17,953 పరుగులు చేశాడు. ఇందులో 45 సెంచరీలు, 98 అర్ధసెంచరీలు ఉన్నాయి. అతని అత్యుత్తమ స్కోరు 264 పరుగులు.

5 / 6
రోహిత్ శర్మ ఇప్పటివరకు ఆడిన 5 వన్డేల్లో 62.20 సగటుతో 311 పరుగులు చేశాడు. అత్యధిక పరుగులు చేసినవారి జాబితాలో టాప్ 5లో ఉన్నాడు.

6 / 6
Follow us