- Telugu News Photo Gallery Are you suffering from PCOD problem? follow these diet, Check here is details in Telugu
PCOD Problem: పీసీఓడీ సమస్య వేధిస్తోందా.. ఈ ఆహారాలతో చెక్ పెట్టండి!
ప్రస్తుతం ఇప్పుడు చాలా మంది పీసీఓడీ సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు. పీసీఓడీ అంటే ఏంటన్న విషయం చాలా మందికి ఇప్పటికీ తెలీదు. పీసీఓడీ అంటే(నీటి బుడగలు). అండాశయంలో నీటి బుడగలు ఏర్పడటం వల్ల చాలా మంది మాతృత్వానికి దూరం అవుతున్నారు. ఈ పీసీఓడీ ప్రాబ్లమ్స్ వల్ల పీరియడ్స్ కూడా సక్రమంగా రావు. ఈ సమస్యల వల్ల విపరీతంగా బరువు పెరగడం, జుట్టు రాలడం సమస్యలు ఉంటాయి. ఒత్తిడి, జీవన శైలిలో మార్పులు, హార్మోన్ల ఇన్ బ్యాలెన్స్ వంటి కారణాల వల్ల..
Chinni Enni | Edited By: Ravi Kiran
Updated on: Oct 28, 2023 | 9:20 PM

ప్రస్తుతం ఇప్పుడు చాలా మంది పీసీఓడీ సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు. పీసీఓడీ అంటే ఏంటన్న విషయం చాలా మందికి ఇప్పటికీ తెలీదు. పీసీఓడీ అంటే(నీటి బుడగలు). అండాశయంలో నీటి బుడగలు ఏర్పడటం వల్ల చాలా మంది మాతృత్వానికి దూరం అవుతున్నారు. ఈ పీసీఓడీ ప్రాబ్లమ్స్ వల్ల పీరియడ్స్ కూడా సక్రమంగా రావు. ఈ సమస్యల వల్ల విపరీతంగా బరువు పెరగడం, జుట్టు రాలడం సమస్యలు ఉంటాయి.

ఒత్తిడి, జీవన శైలిలో మార్పులు, హార్మోన్ల ఇన్ బ్యాలెన్స్ వంటి కారణాల వల్ల పీసీఓడీ వచ్చే అవకాశం ఉంది. ఎన్ని ఆస్పత్రులు, ఎన్ని మందులు వాడినా ఈ సమస్య నుంచి దూరం కాలేకపోతున్నారు. లక్షలకు లక్షలు.. నెలల తరబడి చికిత్సలు చేయించుకుంటున్నా.. ఎలాంటి ఫలితం ఉండటం లేదు. అయితే సమస్యలు ఎలాంటివైనా.. మన జీవన శైలి, ఆహారంలో కొద్దిగా మార్పులు చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చు.

బాదం: ఇందులో మోనోసాచ్యురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మహిళల్లో హార్మోన్ల అసమతుల్యతను పూర్తిగా తొలగించడంలో హెల్ప్ అవుతుంది. ఇంకా బాదంలో ఉండే పోషకాలు బలంగా, దృఢంగా ఉండేందుకు హెల్ప్ చేస్తుంది.

వాల్ నట్స్: వీటి గురించి కూడా అందరికీ తెలుసు. ఇప్పుడు వీటిని కూడా చాలా మంది నట్స్ లో ఒక భాగం చేసుకుని తింటున్నారు. అయితే వాల్ నట్స్ ని నేరుగా తినడం కంటే రాత్రి నాన బెట్టి ఉదయం తినడం చాలా మంచిది. వాల్ నట్స్ పీరియడ్స్ లో వచ్చే సమస్యలను పరిష్కరిస్తుంది.

అవిసె గింజలు - గుమ్మడి విత్తనాలు: వీటిని మహిళలు నిత్యం ఆహారంలో ఒక భాగం చేసుకోవడం వల్ల పీసీఓడీ సమస్యల నుంచి బయట పడొచ్చు. అలాగే గుమ్మడి విత్తనాల్లో ఉండే ఫ్యాటీ యాడిసట్స్ టెస్టో స్టెరాన్ అనే పురుష హార్మోన్ ని డీహెచ్ డీగా మార్చడాన్ని అడ్డుకుంటుంది.





























