- Telugu News Photo Gallery Vastu Tips: To get blessings of Goddess Lakshmi devi do these things at home
Vastu Tips: లక్ష్మీ దేవి అనుగ్రహం పొందాలంటే.. ఇంట్లో ఈ పనులు చేయండి!
ఎంత కష్ట పడినా.. డబ్బు కోసమే. ఇప్పుడు అన్నీ డబ్బుతోనే ముడి పడి ఉన్నాయి. అయితే కొంత మందికి ఎంత కష్ట పడినా ఫలితం ఉండదు. వచ్చిన డబ్బులు వచ్చినట్టే ఖర్చు అయిపోతూ ఉంటాయి. దీని మూల కారణం ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ. ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంటే.. డబ్బుపై ప్రతికూల ప్రభావం పడుతుంది. ఇంట్లో లక్ష్మీ దేవి అనుగ్రహం ఉండాలంటే.. వాస్తు పరంగా కొన్ని మార్పులు చేర్పులు చేయాలి. అప్పుడే లక్ష్మీ దేవి అనుగ్రహం..
Chinni Enni | Edited By: Ravi Kiran
Updated on: Oct 28, 2023 | 10:15 PM

ఎంత కష్ట పడినా.. డబ్బు కోసమే. ఇప్పుడు అన్నీ డబ్బుతోనే ముడి పడి ఉన్నాయి. అయితే కొంత మందికి ఎంత కష్ట పడినా ఫలితం ఉండదు. వచ్చిన డబ్బులు వచ్చినట్టే ఖర్చు అయిపోతూ ఉంటాయి. దీని మూల కారణం ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ. ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంటే.. డబ్బుపై ప్రతికూల ప్రభావం పడుతుంది. ఇంట్లో లక్ష్మీ దేవి అనుగ్రహం ఉండాలంటే.. వాస్తు పరంగా కొన్ని మార్పులు చేర్పులు చేయాలి. అప్పుడే లక్ష్మీ దేవి అనుగ్రహం పొందుతారు.

ఆవుకి - పక్షులకు ఆహారం ఇవ్వాలి: ఆవులో సకల దేవతలందరూ కొలువుండే జంతువుగా కొలుస్తారు. కాబట్టి ఆవుకి రోజూ ఆహారం అందించడం మంచిది. సకల దేవతల ఆశీర్వాదాలు లభిస్తాయి. అలాగే ప్రతిరోజూ పక్షులకు కూడా ఆహారం ఇవ్వాలి. పక్షులకు గింజలు తినిపిస్తే.. జీవితంలో ఎదురయ్యే సమస్యలు తొలగి పోతాయి.

ఆవ నూనె దీపం వెలిగించాలి: ఇంట్లో లక్ష్మీ కటాక్షం పొందాలంటే ప్రతి రోజూ సాయంత్రం ఆవ నూనె దీపం వెలిగించి అందులో రెండు లవంగాలు వేయాలి. ఈ దీపాన్ని తలుపుకు రెండు వైపులా ఉంచాలి. ఇలా చేస్తే లక్ష్మీ దేవి అనుగ్రహం లభిస్తుంది.

ఇంట్లో కర్పూరం రాయండి: వాస్తు శాస్త్రంలో కర్పూరాన్ని ముఖ్యమైన పదార్థంగా పరిగణిస్తారు. ఇంట్లో ప్రతికూల శక్తిని తొలగించి.. వాస్తు దోషాన్ని తొలగిస్తుంది. ప్రతి రోజూ కర్పూరాన్ని ఇంట్లో రాస్తే ఆ ఇల్లు సువాసనలతో నిండుతుంది. ఈ విధంగా కూడా లక్ష్మీ దేవి అనుగ్రహం లభిస్తుంది.

సాయంత్రం ఇంట్లో పడుకోకూడదు: సాయంత్రం లక్ష్మీ దేవి ఇంటికి వచ్చే సమయం. కాబట్టి సూర్యాస్తమయం సమయంలో ఇంట్లో పడుకోవడం మానుకోవాలి. లేదంటే లక్ష్మీ దేవిని అవమానించినట్టు ఉంటుంది. దీంతో లక్ష్మీ దేవి ఆగ్రహానికి గురి అవుతుంది. ఫలితంగా ఇంట్లో పేదరికం పెరుగుతుంది.





























