Samosa Making: చలిలో వేడివేడి సమోసాలు తింటే ఉంటుందీ.. ఇంట్లోనే ఇలా తయారు చేసుకోండి..
బయట చేసే సమోసాల్లో నూనె, పిండి నాణ్యత పెద్దగా బాగోదు, దీంతో అనారోగ్యం బారిన పడే అవకాశాలు ఉంటాయి. అలా కాకుండా సమోసలను ఇంట్లోనే తయారు చేసుకొని తింటే అటు ఆరోగ్యానికి ఆరోగ్యంతో పాటు, చలిలో వేడి వేడిగా సమోసాలు లాగించేయొచ్చు. ఇంతకీ ఇంట్లో సమోసాలు ఎలా తయారు చేసుకోవాలి.? ఇందుకోసం కావాల్సిన పదార్థాలు ఏంటి.? ఇప్పుడు తెలుసుకుందాం.
చలి ప్రభావం ఇప్పుడిప్పుడే మొదలవుతోంది. సాయంత్రం 6 అయ్యిందంటే చాలు చలి తీవ్రత పెరుగుతోంది. అయితే చలి కాలంలో వేడి వేడిగా స్నాక్స్ తినాలని నాలుక లాగేస్తుంటుంది. దీంతో వెంటనే రోడ్లపై అమ్మే సమోసాలు కొనుక్కొని తినేస్తుంటారు. అయితే బయట చేసే సమోసాలు ఆరోగ్యానికి అంత మేలు కాదని తెలిసిందే.
బయట చేసే సమోసాల్లో నూనె, పిండి నాణ్యత పెద్దగా బాగోదు, దీంతో అనారోగ్యం బారిన పడే అవకాశాలు ఉంటాయి. అలా కాకుండా సమోసలను ఇంట్లోనే తయారు చేసుకొని తింటే అటు ఆరోగ్యానికి ఆరోగ్యంతో పాటు, చలిలో వేడి వేడిగా సమోసాలు లాగించేయొచ్చు. ఇంతకీ ఇంట్లో సమోసాలు ఎలా తయారు చేసుకోవాలి.? ఇందుకోసం కావాల్సిన పదార్థాలు ఏంటి.? ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా మార్కెట్లో చేసే సమోసాలు టేస్టీగా ఉండడానికి పిండిని కలిపే విధానమే ప్రధాన కారణం..
పిండి మరీ మెత్తగా కాకుండా, మరీ గట్టిగా కాకుండా చూసుకోవాలి. సమోసాల కోసం పిండిని తయారు చేయడానికి ముందుగా ఒక పెద్ద పాత్రని తీసుకొని అందులో ఒకటిన్నర గిన్నె మైదా పిండి వేసుకోవాలి. అనంతరం రుచికి సరపడా ఉప్పుతో పాటు సరిపడ నూనె వేసుకొని బాగా కలుపుకోవాలి. పిడికిలతో పిండిని ఒత్తినప్పుడు గట్టిగా ఉంటే సమోసా క్రిస్పీగా అవుతుందని అర్థం. అనంతరం పిండిలో కొద్ద కొద్దిగా నీరు పోస్తూ చపాతీ పిండిలా కలుపుకోవాలి. పిండిపై తడి గుడ్డ కప్పి ఉంచి కాసేపు నానబెట్టాలి.
ఇక సమోసా లోపల స్టఫ్ చేయడానికి కూరని తయారు చేసుకోవాలి. ఇందుకోసం ముందుగా ఒక పాత్రను స్టవ్‌పై పెట్టుకొని నూనె వేసుకోవాలి. అనంతరం నూనె వేడయ్యాక జీలకర్ర, అల్లం, వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి ముక్కలు వేసుకుని బాగా వేయించాలి. ఆ తర్వాత అందులో ఎర్ర మిరప పొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా వేసుకుని కొన్ని నీళ్ళు పోసుకుని తడి మసాలా సిద్ధం చేసి పక్కన పెట్టుకోవాలి. తడి మసాలో నూనెలో వేసి వేయించాలి. వేగిన తర్వాత కొత్తిమీర, చాట్ మసాలా వేసుకోవాలి. తక్కువ మంట మీద 3 నుంచి 4 నిమిషాల పాటు ఉడికించాలి. తర్వాత ఉడకబెట్టిన బంగాళాదుంప ముక్కలను వేసుకొని వేయించుకోవాలి. దీంతో కూర తయారైనట్లే.
ఇక చివరిగా సమోసా కోసం కలిపి పెట్టుకున్న పిండిని తీసుకొని చిన్న చిన్న ఉండలుగా చేసి చిన్న చిన్న చపాతీలుగా చేసుకోవాలి. వీటిలో అప్పటికే సిద్ధం చేసుకున్న కర్రీని పెట్టి, సమోసా ఆకారంలో పిండిని ఫోల్డ్ చేయాలి. అనంతరం ఇంకో పాత్రలో ఆయిల్ తీసుకొని వేడి చేయాలి. సమోసలను వేడి నూనెలో వేసుకొని ఫ్రైట్ చేసకోవాలి. సమోసలు గోధమ రంగులోకి వచ్చే వరకు వేయించుకోవాలి. అంతే కరకరమనే సమోసాలు సిద్ధమైనట్లే.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..