Sweet Potato Benefits: చిలగడ దుంపల్ని చలికాలంలోనే ఎందుకు తింటారు? ఈ విషయాలు మీకోసమే!

చిలగడ దుంపలు వీటినే స్వీట్ పొటాటో అని కూడా పిలుస్తారు. పేరుకు తగ్గట్టుగానే ఇవి చాలా తియ్యగా ఉంటాయి. ఇప్పుడంటే వీటి వినియోగం చాలా తక్కువ కానీ.. పూర్వం వీటిని స్నాక్స్ గా ఖాళీగా ఉన్న సమయంలో తినేవారు. ఈ దుంపలతో కూరలు కూడా చేసుకుని తినేవారు. చిలగడ దుంపలు రుచితో పాటు, పోషక విలువలు కలిగి ఉంటుంది. అయితే చిలగడ దుంపలు కేవలం శీతా కాలం అంటే చలి కాలంలో మాత్రమే లభ్యమవుతాయి. ఈ వింటర్ సీజన్ లో వీటిని తినడం..

Sweet Potato Benefits: చిలగడ దుంపల్ని చలికాలంలోనే ఎందుకు తింటారు? ఈ విషయాలు మీకోసమే!
Sweet Potato
Follow us
Chinni Enni

| Edited By: Ravi Kiran

Updated on: Oct 27, 2023 | 9:40 PM

చిలగడ దుంపలు వీటినే స్వీట్ పొటాటో అని కూడా పిలుస్తారు. పేరుకు తగ్గట్టుగానే ఇవి చాలా తియ్యగా ఉంటాయి. ఇప్పుడంటే వీటి వినియోగం చాలా తక్కువ కానీ.. పూర్వం వీటిని స్నాక్స్ గా ఖాళీగా ఉన్న సమయంలో తినేవారు. ఈ దుంపలతో కూరలు కూడా చేసుకుని తినేవారు. చిలగడ దుంపలు రుచితో పాటు, పోషక విలువలు కలిగి ఉంటుంది. అయితే చిలగడ దుంపలు కేవలం శీతా కాలం అంటే చలి కాలంలో మాత్రమే లభ్యమవుతాయి. ఈ వింటర్ సీజన్ లో వీటిని తినడం వల్ల కలిగే బెనిఫిట్స్ అన్నీ ఇన్నీ కావు. మరి చిలగడ దుంపతో ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

చర్మానికి రక్షణగా:

చలి కాలంలో చర్మానికి ఎక్కువగా కేర్ తీసుకోవాలి. ఎందుకంటే ఈ సీజన్ లో చర్మం పొడిబారి పోతుంది. అందవిహీనంగా కనిపిస్తుంది. అంతే కాకుండా ముడతలు పడి, గ్లో తగ్గిపోతుంది. ఇలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే.. చిలగడ దుంపలు తినాలి. వీటిని తినడం వల్ల చర్మం తేమను కోల్పోకుండా, ముడతలు తగ్గి, చర్మం పొడి బారి పోకుండా చూస్తుంది.

ఇవి కూడా చదవండి

శరీర ఉష్ణోగ్రత పెంచుతుంది:

చిలగడ దుంపలో వేడెక్కించే శక్తి ఉంటుంది. ఈ దుంపలు సహజంగా వేడిని ఉత్పత్తి చేసే లక్షణాలు కలిగి ఉంటాయి. కాబట్టి ఈ వింటర్ సీజన్ లో చిలగడ దుంపలు తింటే.. శరీరంలో ఉష్ణోగ్రతను పెంచి వెచ్చగా ఉండేలా చేస్తుంది.

క్యాన్సర్ కు చెక్ పెట్టవచ్చు:

చిలగడ దుంపలో బీటా కెరోటిన్ ఎక్కువగా ఉంటుంది. ఈ దుంపలు తినడం వల్ల ప్రోస్టేట్, అండాశయ క్యాన్సర్ లు ఎటాక్ చేయకుండా హెల్ప్ చేస్తుంది.

రోగ నిరోధక శక్తిని పెంచుతుంది:

చలి కాలంలో చిలగడ దుంపలు తినడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దీంతో ఇన్ ఫెక్షన్లు, వ్యాధులు, అనారోగ్య సమస్యలతో పోరాడుతుంది. ఈ దుంపల్లో ఉండే కార్బోహైడ్రేట్లు శరీరానికి సమర్థవంతమైన చికిత్సగా పని చేస్తాయి.

ఫైబర్ పుష్కలంగా ఉంటుంది:

స్వీట్ పొటాటోలో పీచు పదార్థం అనేవి ఎక్కువగా ఉంటుంది. ఇవి కొంచెం తిన్నా పొట్ట నిండిన ఫీల్ ఉంటుంది. త్వరగా ఇతర ఆహార పదార్థాలను తినలేం. కాబట్టి బరువు తగ్గేందుకు కూడా హెల్ప్ అవుతుంది. అంతే కాకుండా చెడు కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది. చెడు కొలెస్ట్రాల్ తగ్గడం వల్ల రక్త పోటు స్థాయిలు కూడా అదుపులోకి వస్తాయి.

గర్భిణీలకు మంచిది:

గర్భిణీలు చిలగడ దుంపల్ని ఉడికించి తినడం వల్ల.. బిడ్డకు మంచి పోషక విలువలు అందుతాయి. అలాగే ఈ దుంపలు మహిళల్లో సంతానోత్పత్తిని పెంచుతాయి. కాబట్టి వీటిని తింటే మంచి ఫలితాలు ఉంటాయి.

గమనిక: ఇది ఇంటర్నెట్ నుంచి సేకరించిన సమాచారం. వీటిని ఫాలో అయ్యే ముందు ఒకసారి నిపుణులను సంప్రదించడం మేలు.

గుడిమెల్లంక గ్రామానికి ఆధ్యాత్మిక శోభ.. రూ.300 కోట్ల వ్యయంతో భారీ
గుడిమెల్లంక గ్రామానికి ఆధ్యాత్మిక శోభ.. రూ.300 కోట్ల వ్యయంతో భారీ
భారత అమ్ములపొదలోకి అత్యాధునిక మిస్సైళ్లు!
భారత అమ్ములపొదలోకి అత్యాధునిక మిస్సైళ్లు!
మీకు ఆధార్‌ కార్డ్‌ ఉందా.? వెంటనే ఈ పనిచేయండి..
మీకు ఆధార్‌ కార్డ్‌ ఉందా.? వెంటనే ఈ పనిచేయండి..
14 ఏళ్లకే హీరోయిన్‏గా ఏంట్రీ..చిరంజీవి అలా పిలుస్తూ ఏడిపించేవారు.
14 ఏళ్లకే హీరోయిన్‏గా ఏంట్రీ..చిరంజీవి అలా పిలుస్తూ ఏడిపించేవారు.
చివరిగా.. ట్రంప్‌ను ఓ కోర్కె కోరిన జో బిడెన్‌..!
చివరిగా.. ట్రంప్‌ను ఓ కోర్కె కోరిన జో బిడెన్‌..!
చలికాలం సమస్యలకు కొబ్బరి నూనెతో చెక్‌.. ముఖానికి అప్లై చేస్తే..
చలికాలం సమస్యలకు కొబ్బరి నూనెతో చెక్‌.. ముఖానికి అప్లై చేస్తే..
ఈ పూలను వాడితే ముసలితనాన్ని వాయిదా వేయొచ్చు.. అందం అమాంతంగాపెరిగి
ఈ పూలను వాడితే ముసలితనాన్ని వాయిదా వేయొచ్చు.. అందం అమాంతంగాపెరిగి
అమెరికాలో తులసీ గబ్బార్డ్‌కు కీలక బాధ్యతలు.. ఎవరో తెలుసా?
అమెరికాలో తులసీ గబ్బార్డ్‌కు కీలక బాధ్యతలు.. ఎవరో తెలుసా?
బంగారం కొనేవారికి శుభవార్త..! ధర ఎంతో తెలిస్తే ఎగిరి గంతేస్తారు..
బంగారం కొనేవారికి శుభవార్త..! ధర ఎంతో తెలిస్తే ఎగిరి గంతేస్తారు..
బామ్మ గెటప్‏లో బిగ్‏బాస్ ముద్దుగుమ్మ.. ఇట్టా మారిపోయిందేంట్రా..
బామ్మ గెటప్‏లో బిగ్‏బాస్ ముద్దుగుమ్మ.. ఇట్టా మారిపోయిందేంట్రా..