Winter Season Care: చలి కాలంలో ఈ జాగ్రత్తలు తీసుకోండి.. హెల్దీగా ఉండండి!

శీతా కాలం మొదలైంది.. వాతావరణంలోనే కాకుండా.. శరీర పరంగా కూడా ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి. వింటర్ సీజన్ లో చలి ఎక్కువగా ఉండి.. బాడీలో హీట్ అనేది తగ్గిపోతుంది. అలాగే ఇన్ ఫెక్షన్లు, వ్యాధులు, అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. దోమల బెడద కూడా ఎక్కువగా ఉంటుంది. రోగ నిరోధక శక్తి కూడా తగ్గిపోతుంది. శరీరం పొడి బారిపోతుంది, తేమను కోల్పోతుంది. అలాగే జుట్టు కూడా రాలి పోతూ, చిరాకుగా మారుతుంది. వర్షాకాలం, వేసవి కాలంలో ఎలా ఉన్నా..

Winter Season Care: చలి కాలంలో ఈ జాగ్రత్తలు తీసుకోండి.. హెల్దీగా ఉండండి!
Follow us
Chinni Enni

| Edited By: Ravi Kiran

Updated on: Oct 28, 2023 | 10:10 PM

శీతా కాలం మొదలైంది.. వాతావరణంలోనే కాకుండా.. శరీర పరంగా కూడా ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి. వింటర్ సీజన్ లో చలి ఎక్కువగా ఉండి.. బాడీలో హీట్ అనేది తగ్గిపోతుంది. అలాగే ఇన్ ఫెక్షన్లు, వ్యాధులు, అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. దోమల బెడద కూడా ఎక్కువగా ఉంటుంది. రోగ నిరోధక శక్తి కూడా తగ్గిపోతుంది. శరీరం పొడి బారిపోతుంది, తేమను కోల్పోతుంది. అలాగే జుట్టు కూడా రాలి పోతూ, చిరాకుగా మారుతుంది. వర్షాకాలం, వేసవి కాలంలో ఎలా ఉన్నా.. జాగ్రత్తలు తీసుకున్నా తీసుకోకపోయినా పర్వా లేదు కానీ.. చలి కాలంలో మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే చాలా సమస్యలు ఎదుర్కొనాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఆహార విషయంలో కేర్ తీసుకోవాలి. మరి వింటర్ సీజన్ లో ఎలాంటి ఆహారాలు తీసుకుంటే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం.

పాలకూర:

చలి కాలంలో ఖచ్చితంగా తీసుకోవాల్సిన ఆహార పదార్థాల్లో పాలకూర కూడా ఒకటి. పాలకూరలో విటమిన్లు ఎ, సిలతో పాటు యాంటీ ఆక్సిడెంట్లులు ఎక్కువగా ఉంటాయి. పాలకూర తినడం వల్ల స్కిన్ గ్లోగా తయారవుతుంది. కాబట్టి చలి కాలంలో వారానికి ఒక్కసారైనా పాలకూర తీసుకోవడం మంచింది.

ఇవి కూడా చదవండి

అవకాడో:

చలి కాలంలో స్కిన్ అనేది డ్రైగా మారుతుంది. దీంతో మార్కెట్ లో ఉండే ఖరీదైన క్రీములను తీసుకొచ్చి రాస్తారు. వాటి వల్ల దీర్ఘకాలికంగా సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తాయి. అలా కాకుండా ఆహారంలో కొద్ది మార్పులు చేసుకోవాలి. చర్మం ఆరోగ్యంలో ఉండడంలో అవకాడో కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులో ఉండే ఫ్యాట్స్, మినరల్స్ ఎక్కువగా ఉంచుతాయి. ఇందులోని ప్రోటీన్లు చర్మం వదులుగా కాకుండా చూసుకుంటాయి.

ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్:

చలి కాలంలో చర్మం అనేది అంద విహీనంగా తయారవుతుంది. స్కిన్ ని హెల్దీగా ఉంచడంలో ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ బాగా హెల్ప్ అవుతాయి. కాబట్టి వింటర్ సీజన్ లో మీరు తీసుకునే ఆహారంలో ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండేలా చూసుకోండి.

నీళ్లు తాగాలి:

చాలా మంది చలికాలంలో నీరు ఎక్కువగా తాగరు. వాతావరణం చల్లగా ఉందని నీరు తాగేందుకు ఆసక్తి చూపించారు. దీంతో బాడీలో నీరు శాతం అనేది తగ్గిపోతుంది. డీహైడ్రేషన్ కు గురయ్యే అవకాశం ఉంది. స్కిన్ కూడా పాడవుతుంది. కాబట్టి కాలం ఏదైనా సరిపడా నీళ్లు తాగాలని నిపుణులు చెబుతున్నారు.

వీటిని ఆహారంలో భాగం చేసుకోవాలి:

చలి కాలంలో విటమిన్ ఎ, సి ఫుడ్స్ ని ఎక్కువగా తీసుకోవాలి. ఇవి చర్మాన్ని, ఆరోగ్యాన్ని కాపాడేందుకు హెల్ప్ అవుతాయి. అలాగే చిలగడ దుంపలు, చేపలు, క్యారెట్ వంటిని ఆహారంలో భాగం చేసుకోవాలి.

గమనిక: ఇది ఇంటర్నెట్ నుంచి సేకరించిన సమాచారం. వీటిని ఫాలో అయ్యే ముందు ఒకసారి నిపుణులను సంప్రదించడం మేలు.