AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Milk Hair Mask: కప్పు పాలతో మీ జుట్టు సమస్యలన్నీ దూరం చేయవచ్చు.. ఎలాగంటే..

అమ్మయిలు జుట్టు సంరక్షణ గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంటారు. ఎన్ని జాత్రగ్తలు తీసుకున్నా ఒక్కోసారి వెంట్రుకలు అకారణంగా రాలిపోతుంటాయి. ఎన్ని రకాల నూనెలు, షాంపూలు మార్చినా జుట్టు రాలిపోవడాన్ని అరికట్టలేవు. వేల సంఖ్యలో హెయిర్ ట్రీట్‌మెంట్లు చేయించుకన్న ప్రయోజనం ఉండదు. చర్మం, జుట్టు సంరక్షణకు సహజ పదార్ధాలు వినియోగిస్తే మంచి ఫలితం ఉంటుంది. ముఖ్యంగా పాలు జుట్టు పోషణకు ఎంతో ఉపయోగపడుతుంది. ప్రాచీన కాలం నుంచి అందం..

Milk Hair Mask: కప్పు పాలతో మీ జుట్టు సమస్యలన్నీ దూరం చేయవచ్చు.. ఎలాగంటే..
Milk Hair Mask
Srilakshmi C
|

Updated on: Oct 29, 2023 | 2:54 PM

Share

అమ్మయిలు జుట్టు సంరక్షణ గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంటారు. ఎన్ని జాత్రగ్తలు తీసుకున్నా ఒక్కోసారి వెంట్రుకలు అకారణంగా రాలిపోతుంటాయి. ఎన్ని రకాల నూనెలు, షాంపూలు మార్చినా జుట్టు రాలిపోవడాన్ని అరికట్టలేవు. వేల సంఖ్యలో హెయిర్ ట్రీట్‌మెంట్లు చేయించుకన్న ప్రయోజనం ఉండదు. చర్మం, జుట్టు సంరక్షణకు సహజ పదార్ధాలు వినియోగిస్తే మంచి ఫలితం ఉంటుంది. ముఖ్యంగా పాలు జుట్టు పోషణకు ఎంతో ఉపయోగపడుతుంది. ప్రాచీన కాలం నుంచి అందం కోసం పాలు, పచ్చి పసుపు, తేనె వాడుతున్నారు. జుట్టు, చర్మంలకు తేమ స్థాయిలను నిర్వహించడానికి కూడా పాలు బాగా పని చేస్తాయి. జుట్టు సంరక్షణకు పాలను ఎలా ఉపయోగించాలో ఇక్కడ తెలుసుకుందాం..

పాలలో ప్రోటీన్లు, విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. పాలు అనేక రకాల జుట్టు సమస్యలను దూరంగా ఉంచుతుంది. తగినంత ప్రోటీన్, తేమ లేకపోవడం వల్ల జుట్టు సమస్యలు తలెత్తుతాయి. దీనితో పాటు, వెంట్రుకల చివర్లు కూడా చిట్లిపోతాయి. పాలు ఈ సమస్యను పరిష్కరించగలవు. పాలతో తయారు చేసిన రకరకాల హెయిర్ మాస్క్‌లను అప్లై చేయడం వల్ల ఈ సమస్య నుంచి త్వరగా విముక్తి పొందవచ్చు.

గరుకుగా, చిట్లిన జుట్టు సమస్యలకు చికిత్స అందించడంలో పాలు సహాయపడుతుంది. జుట్టు పోషక లోపాల చికిత్సలో కూడా సహాయపడుతుంది. ఈ సహజ పదార్ధం స్కాల్ప్‌ కరుకుదనాన్ని తగ్గిస్తుంది. శిరోజాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఫలితంగా జుట్టు రాలడం తగ్గిపోతుంది. మిల్క్ క్లెన్సర్‌ని రెగ్యులర్‌గా ఉపయోగించడం వల్ల వెంట్రుకలు మధ్యలో తెగిపోకుండా ఆరోగ్యంగా పెరుగుతాయి.

ఇవి కూడా చదవండి

పాలను జుట్టుకు ఎలా ఉపయోగించాలంటే..

ఒక గిన్నెలో 200 – 300 మిల్లీ లీటర్ల పాలు తీసుకోవాలి. ఆ తర్వాత జుట్టును పెద్ద పళ్ల దువ్వెనతో సున్నితంగా దువ్వుకోవాలి. జుట్టులో చిక్కులు ఉండకూడదు. తర్వాత పాలను కొద్దికొద్దిగ్గా వెంట్రులకు నెమ్మదిగా అప్లై చేసుకోవాలి. దీన్ని మాడుతోపాటు జుట్టుకు కూడా అప్లై చేసుకోవాలి. 30 నిమిషాల తర్వాత గాఢత తక్కువగా ఉండే షాంపూతో తలస్నానం చేస్తే సరి.

మరిన్ని లైఫ్‌స్టైల్ కథనాల కోసం క్లిక్‌ చేయండి.