Brain Health Foods: బ్రెయిన్ షార్ప్ గా ఉండాలంటే ఈ ఫుడ్స్ ని ఖచ్చితంగా తీసుకోండి!

మెదడు యాక్టీవ్ గా, షార్ప్ గా ఉంటేనే ఏ పని మీదైనా దృష్టి పెట్టగలం. లేదంటే దేని మీద సరైన ఫోకస్ పెట్టలేం. మెదడు ఆరోగ్యంగా ఉంటేనే శరీరంలోని అవయవాలన్నీ సక్రమంగా పని చేస్తాయి. అలాగే ఒత్తిడి, భయాన్ని దూరం పెట్టాలి. లేదంటే మానసికంగా కృంగి డిప్రెషన్ కు గురయ్యే అవకాశం ఉంది. మనం సరైన ఆహారం, జాగ్రత్తలు తీసుకుంటేనే బ్రెయిన్ యాక్టీవ్ గా, షార్ప్ గా పని చేస్తుంది. లేదంటే ఇన్ ఫ్లమేషన్ కు కారణం అయ్యే సైటోకైన్స్ విడుదలై మెదడు పని తీరును దెబ్బతీస్తుంది. దీంతో మతి మరపు, జ్ఞాపక శక్తి..

Brain Health Foods: బ్రెయిన్ షార్ప్ గా ఉండాలంటే ఈ ఫుడ్స్ ని ఖచ్చితంగా తీసుకోండి!
Brain Health
Follow us
Chinni Enni

| Edited By: Ravi Kiran

Updated on: Oct 30, 2023 | 6:40 AM

మెదడు యాక్టీవ్ గా, షార్ప్ గా ఉంటేనే ఏ పని మీదైనా దృష్టి పెట్టగలం. లేదంటే దేని మీద సరైన ఫోకస్ పెట్టలేం. మెదడు ఆరోగ్యంగా ఉంటేనే శరీరంలోని అవయవాలన్నీ సక్రమంగా పని చేస్తాయి. అలాగే ఒత్తిడి, భయాన్ని దూరం పెట్టాలి. లేదంటే మానసికంగా కృంగి డిప్రెషన్ కు గురయ్యే అవకాశం ఉంది. మనం సరైన ఆహారం, జాగ్రత్తలు తీసుకుంటేనే బ్రెయిన్ యాక్టీవ్ గా, షార్ప్ గా పని చేస్తుంది. లేదంటే ఇన్ ఫ్లమేషన్ కు కారణం అయ్యే సైటోకైన్స్ విడుదలై మెదడు పని తీరును దెబ్బతీస్తుంది. దీంతో మతి మరపు, జ్ఞాపక శక్తి, ఏకాగ్రత నశించడం, అల్జీమర్స్ రావడానికి కారణం అవుతుంది. మరి బ్రెయిన్ ను ఆరోగ్యంగా ఉంచేందుకు ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

టమాటాలు:

బ్రెయిన్ ని షార్ప్ గా పని చేసేందుకు టమాటా బాగా హెల్ప్ చేస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, లైకోపీన్, బీటా కెరోటిన్ అనేవి మెండుగా ఉంటాయి. అంతేకాకుండా టమాటాలు ఫ్రీరాడికల్స్ ను అడ్డుకున్నట్లు పలు పరిశోధనల్లో తేలింది. టమాటాలో ఉండే లైకోపీన్.. మెదడులో ఇన్ ఫ్లమేషన్ కు కారణం అయ్యే జన్యవుల్ని ప్రభావితం చేస్తుందని తేలింది.

ఇవి కూడా చదవండి

సోయా ఉత్పత్తులు:

సోయా ఉత్పత్తులు కూడా బ్రెయిన్ పని తీరును మెరుగు పరిచేందుకు హెల్ప్ చేస్తాయి. సోయా ఉత్పత్తుల్లో జెనిస్టీన్, డెయిడ్ జెయిన్ అనే పాలీ ఫినాల్స్ ఉంటాయి. ఇవి మతిమరపుని తగ్గిస్తాయి. వీటిని ప్రతి రోజూ ఆహారంలో చేర్చుకోవడం ద్వారా ఆరోగ్యంతో పాటు బ్రెయిన్ ఆరోగ్యానికి కూడా మేలు జరుగుతుంది.

బ్రోకలీ:

బ్రోకలీలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా, క్యాలరీలు అనేవి తక్కువగా ఉంటాయి. బ్రోకలీలో గ్లూకోసైనోలేట్స్.. శరీరంలో చేరాక ఐసోథయోసైనెట్స్ గా మారతాయి. ఇవి ఒత్తిడిని తగ్గించడమే కాకుండా నరాల క్షీణతను కూడా తగ్గిస్తాయి. అలాగే బ్రోకలీలో ఉండే విటమిన్స్ సి, కె, ఫ్లేవనాయిడ్స్ మెదడు పని తీరును మెరుగు పరుస్తాయి. కాబట్టి బ్రోకలీని ఆరోగ్యంలో చేర్చోవడం ద్వారా చాలా రకాల బెనిఫిట్స్ ఉన్నాయి.

ఇవి కూడా చాలా మంచిది:

అలాగే మనం తీసుకునే ఆహారంలో ఆకు పాలకూర, కేల్, క్యాబేజీ, కొన్ని రకాల ఫ్రెష్ ఫ్రూట్స్ ముఖ్యంగా వాల్ నట్స్, బ్లాక్ కరెంట్ వంటి వాటిని యాడ్ చేసుకుంటే మంచి ఫలితాలను పొందవచ్చు. ఇవి బ్రెయిన్ ని ఆక్టీవ్ గా ఉంచేలా చేస్తాయి. అంతే కాకుండా మతి మరపు రాకుండా నిరోధిస్తాయి. వీటిని స్నాక్స్ లా కూడా తీసుకునేలా ప్లాన్ చేసుకోవాలి. ఇవి మెదడు ఇన్ ఫ్లామేషన్ కి గురి కాకుండా చూస్తాయి. కాబట్టి బ్రెయిన్ ని హెల్దీగా షార్ప్ గా పని చేసేలా చూస్తాయి.

గమనిక: ఇది ఇంటర్నెట్ నుంచి సేకరించిన సమాచారం. వీటిని ఫాలో అయ్యే ముందు ఒకసారి నిపుణులను సంప్రదించడం మేలు.

అసలే చలికాలం.. కొంపదీసి ఇవి తింటున్నారేమో జాగ్రత్తా.!
అసలే చలికాలం.. కొంపదీసి ఇవి తింటున్నారేమో జాగ్రత్తా.!
బంగాళాఖాతంలో వాయుగుండం.. తమిళనాడు, నెల్లూరులో భారీ వర్షాలు.!
బంగాళాఖాతంలో వాయుగుండం.. తమిళనాడు, నెల్లూరులో భారీ వర్షాలు.!
పాన్ కార్డ్ 2.O.. అసలేంటిది.? మీ కార్డు మళ్లీ మార్చుకోవాలా.?
పాన్ కార్డ్ 2.O.. అసలేంటిది.? మీ కార్డు మళ్లీ మార్చుకోవాలా.?
చల్లని బీరుతో చిల్ అవుదామనుకున్నారు.. తీరా బాటిల్ మూత ఓపెన్ చేయగా
చల్లని బీరుతో చిల్ అవుదామనుకున్నారు.. తీరా బాటిల్ మూత ఓపెన్ చేయగా
పక్షుల్లోనూ విడాకులు.! వాతావరణంలో మార్పులతో విడిపోతున్న పక్షులు..
పక్షుల్లోనూ విడాకులు.! వాతావరణంలో మార్పులతో విడిపోతున్న పక్షులు..
డిసెంబర్‌ 1 నుంచి కీలక మార్పులు. పెట్రోల్,డీజిల్ ధరలు పెరుగుతాయా?
డిసెంబర్‌ 1 నుంచి కీలక మార్పులు. పెట్రోల్,డీజిల్ ధరలు పెరుగుతాయా?
మాయా లేదు.. మర్మం లేదు.. అగ్నిగుండం చుట్టూ గొర్రెల ప్రదక్షిణ.!
మాయా లేదు.. మర్మం లేదు.. అగ్నిగుండం చుట్టూ గొర్రెల ప్రదక్షిణ.!
చేపల పులుసు తినాలనే కోరిక.. ఇట్టా అయితుంది అనుకోలే..
చేపల పులుసు తినాలనే కోరిక.. ఇట్టా అయితుంది అనుకోలే..
నామాల స్వామికే నామాలు పెట్టాలనుకున్నాడు.! శ్రీవారి హుండీలోనే చోరీ
నామాల స్వామికే నామాలు పెట్టాలనుకున్నాడు.! శ్రీవారి హుండీలోనే చోరీ
చలి పెడుతోందా.. ఖావో.. పాయా.. ఒకటి తీసుకుంటే ఒకటి ఫ్రీ.!
చలి పెడుతోందా.. ఖావో.. పాయా.. ఒకటి తీసుకుంటే ఒకటి ఫ్రీ.!