- Telugu News Photo Gallery Benefits of ash gourd juice for weight loss drink twice in a week health tips in Telugu News
Ash Gourd juice: ఉదయాన్నే ఖాళీ కడుపుతో బూడిద గుమ్మడికాయ జ్యూస్ తాగితే ఎన్ని లాభాలో తెలుసా..? ముందు మీ పొట్ట ఫ్లాట్ అవుతుంది..!
బూడిద గుమ్మడి కాయ జ్యూస్ ఎప్పుడైనా తీసుకున్నారా..? రోజూ ఉదయాన్నే పరగడుపున బూడిద గుమ్మడికాయ జ్యూస్ తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసా..? బూడిద గుమ్మడి కాయలో అధికంగా ఉండే నీటి కంటెంట్ శరీరంలో విషపదార్థాలను బయటకు తొలగించడంలో సహాయపడుతుంది.. ఇది దాహాన్ని తీరుస్తుంది. బూడిద గుమ్మడికాయలో నీరు ఎక్కువగా ఉండటం వల్ల మనల్ని రోజంతా డీహైడ్రేట్ కాకుండా ఉంచుతుంది.
Updated on: Oct 29, 2023 | 9:53 PM

బూడిద గుమ్మడి కాయలో ఐరన్, కాల్షియం, ఫాస్పరస్, జింక్, కాపర్, మెగ్నీషియం, విటమిన్ సి, నియాసిన్, డైటరీ ఫైబర్ వంటి లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. తెల్ల గుమ్మడికాయ తింటే ఆకలి తగ్గుతుంది. కాబట్టి మీరు మళ్లీ మళ్లీ తినవలసిన అవసరం లేదు. ఇది బరువు తగ్గడంలో సహాయపడుతుంది.

తెల్ల గుమ్మడికాయలో మంచి మొత్తంలో విటమిన్ B3 ఉంటుంది. కాబట్టి దీనిని తీసుకోవడం వల్ల మీ శరీరానికి శక్తినిస్తుంది. దీన్ని తీసుకోవడం వల్ల మీ పేగు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మంచి బ్యాక్టీరియా ఉత్పత్తి అవుతుంది.

తెల్ల గుమ్మడికాయ రసం తాగడం వల్ల బరువు తగ్గవచ్చు. తెల్ల గుమ్మడికాయ జ్యూస్ తయారు చేయటం కోసం.. ముందుగా గుమ్మడికాయ పొట్టు తీసి ముక్కలుగా కోసి బ్లెండర్‌లో వేయాలి. దానికి నిమ్మరసం కలపండి. తర్వాత ఈ రెండు మిశ్రమాలను బాగా కలపాలి. ఈ జ్యూస్‌ని వారానికి రెండు సార్లు తాగడం వల్ల బరువు సులభంగా తగ్గుతారు.

బూడిద గుమ్మడికాయలోని పొటాషియం బీపీ కంట్రోల్ లో ఉంచేందుకు దోహదపడుతుంది. దీనివల్ల గుండె సంబంధ సమస్యలు రాకుండా ఉంటాయి. బూడిద గుమ్మడి కాయ రసం తాగడం వల్ల జీర్ణ సంబంధ సమస్యలు దూరమవుతాయి. మలబద్దకం సమస్య దూరమవుతుంది. ఇందులోని విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు చర్మానికి కూడా రక్షణనిస్తాయి.

బూడిద గుమ్మడి కాయలో కేలరీలు తక్కువగా ఉంటాయి. 100 గ్రాముల కాయ నుంచి శరీరానికి అందేవి కేవలం 13 క్యాలరీలఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఈ కారణంగా కడుపు నిండుగా ఉంటుంది. తక్కువగా తింటారు. మెదడు పనితీరును మెరుగుపరచుకోవాలంటే దీనిని తరచుగా డైట్‌లో చేర్చుకోవాలని నిపుణులు చెబుతున్నారు.




