- Telugu News Photo Gallery Home Remedies: How to get rid of rats from home, check here is details in telugu
Home Remedies: ఇలా చేయండి.. ఇంట్లో ఎలుకలన్నీ పారిపోతాయ్!
ఇంట్లో ఎలుకలు ఉన్నాయంటే.. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమరుపాటున బయట ఖరీదైన బట్టలు, డ్యాక్సుమెంట్స్, కూరగాయలు, పండ్లు మర్చిపోయామా అంతే సంగతులు. నాశనం చేసి పారేస్తాయ్. ఇల్లంతా చెండాలం చేస్తాయి. ఎన్ని సార్లు వాటిని వెళ్లగొట్టినా.. అవి అంత తొందరగా వెళ్లవు. ఎలుకలు పెద్ద తల నొప్పిగా తయారవుతాయ్. వీటిని ఇంట్లో నుంచి వెళ్ల గొట్టేందుకు మార్కెట్లో దొరికే కెమికల్స్ ని వాడుతూ ఉంటారు. అయితే వీటితో కొన్ని రకాల సైడ్ ఎఫెక్ట్స్..
Updated on: Oct 30, 2023 | 6:50 AM

ఇంట్లో ఎలుకలు ఉన్నాయంటే.. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమరుపాటున బయట ఖరీదైన బట్టలు, డ్యాక్సుమెంట్స్, కూరగాయలు, పండ్లు మర్చిపోయామా అంతే సంగతులు. నాశనం చేసి పారేస్తాయ్. ఇల్లంతా చెండాలం చేస్తాయి. ఎన్ని సార్లు వాటిని వెళ్లగొట్టినా.. అవి అంత తొందరగా వెళ్లవు. ఎలుకలు పెద్ద తల నొప్పిగా తయారవుతాయ్. వీటిని ఇంట్లో నుంచి వెళ్ల గొట్టేందుకు మార్కెట్లో దొరికే కెమికల్స్ ని వాడుతూ ఉంటారు. అయితే వీటితో కొన్ని రకాల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. కాబట్టి ఇంట్లోనే కొన్ని నేచురల్ టిప్స్ తో వాటికి చెక్ పెట్టొచ్చు.

ఉల్లిపాయలు: ఉల్లిపాయల నుంచి ఒక లాంటి ఘాటు వాసన వస్తుంది. వీటి స్మెల్ ఎలుకలకు అంతగా పడదు. ఈ వాసనకు ఎలుకలు చిరాకు పడతాయి. ఇంట్లో కన్నాలు ఉన్న చోట, ఇంటి మూలల్లో ఉల్లి పాయ ముక్కలను పెడుతూ ఉండాలి. అలాగే వీటిని రెండు, మూడు రోజులకోసారి మార్చుతూ ఉంటే ఎలుకల సమస్యని దూరం చేసుకోవచ్చు.

అమోనియం స్ప్రే: ఎలుకలు అమోనియం వాసనను తట్టుకోలేవు. కాబట్టి కొద్దిగా నీటిలో అమోనియంను కలిపాలి. ఈ మిశ్రమాన్ని బాటిల్ లో వేసి.. ఎలుకలు ఎక్కువగా తిరిగే చోట స్ప్రే చేయాలి. ఇలా చేస్తే ఈ వాసనకు ఎలుకలు మాయం అవుతాయి.

పెప్పర్ మింట్ ఆయిల్: పెప్పర్ మింట్ ఆయిల్ నుంచి కూడా మంచి ఘాటు వాసన వస్తుంది. కాబట్టి ఈ వాసన అన్నా ఎలుకలకు పడదు. పెప్పర్ మింట్ ఆయిల్ లో ముంచిన కాటన్ బాల్స్ ను.. ఇంట్లోని మూలల్లో వివిధ ప్రదేశాల్లో ఉంచాలి.

వెల్లుల్లి: వెల్లుల్లి కూడా ఘాటైన పదార్థాం. ఒక స్పూన్ వెల్లల్లి రసాన్ని గదుల్లోని మూలల్లో, ఎలుకలు తిరిగే చోట స్ప్రే చేస్తే ఎలుకల బెడదను అరికట్టవచ్చు. అలాగే ఎలుకలు పట్టే ప్యాడ్ లు కూడా మార్కెట్లో లభ్యమవుతున్నాయి. వీటితో ఈజీగా ఎలుకల సమస్యని వదిలించుకోవచ్చు.




