AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Winter Skin Care: చలి కాలంలో స్కిన్ డ్రైగా మారుతుందా.. చర్మాన్ని ఇలా మెరిపించేయండిలా!

చలి కాలం వచ్చేసింది.. వాతావరణంలోనే కాకుండా శరీరంలో కూడా మార్పులు వస్తాయి. చర్మం డ్రైగా, పొలుసు బారినట్టు మారిపోతుంది. అలాగే తేమ కూడా తగ్గిపోయి.. నిర్జీవంగా మారుతుంది. వర్షకాలం, వేసవి కాలంలో చర్మంపై శ్రద్ధ చూపకపోయినా.. చలి కాలంలో మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. లేదంటే చర్మం అందవిహీనంగా తయారవుతుంది. చలి గాలుల వల్ల పగలటం, పొడి బారటం, చిట పటలాడం, మంట పెట్టడం, దురద పెట్టడం వంటి..

Winter Skin Care: చలి కాలంలో స్కిన్ డ్రైగా మారుతుందా.. చర్మాన్ని ఇలా మెరిపించేయండిలా!
Winter Skin Care
Chinni Enni
| Edited By: |

Updated on: Oct 28, 2023 | 9:25 PM

Share

చలి కాలం వచ్చేసింది.. వాతావరణంలోనే కాకుండా శరీరంలో కూడా మార్పులు వస్తాయి. చర్మం డ్రైగా, పొలుసు బారినట్టు మారిపోతుంది. అలాగే తేమ కూడా తగ్గిపోయి.. నిర్జీవంగా మారుతుంది. వర్షకాలం, వేసవి కాలంలో చర్మంపై శ్రద్ధ చూపకపోయినా.. చలి కాలంలో మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. లేదంటే చర్మం అందవిహీనంగా తయారవుతుంది. చలి గాలుల వల్ల పగలటం, పొడి బారటం, చిట పటలాడం, మంట పెట్టడం, దురద పెట్టడం వంటి సమస్యలు వస్తాయి. ఈ కాలంలో డ్రై స్కిన్ ఉన్న వారికి ఇబ్బందులు మరీ ఎక్కువగా వస్తాయి. అలాంటి వారు ఖచ్చితంగా చర్మానికి కేర్ తీసుకోవాలి. కాబట్టి వింటర్ సీజన్ లో మాయిశ్చ రైజింగ్ క్రీములు వాడాలి. చలి కాలంలో ఇంటి వద్దే కొన్ని రకాల టిప్స్ పాటిస్తే మీ ఫేస్ గ్లోయింగ్ గా ఉంటుంది. మరి ఆ చిట్కాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

నీరు ఎక్కువగా తీసుకోవాలి:

ఈ సీజన్ లో చలి కారణంగా అంతగా నీరు తాగాలని అనిపించదు. కానీ శీతా కాలంలో చర్మం డ్రైగా మారిపోతుంది. కాబట్టి తగినంత నీరు తాగుతూ ఉండాలి. దీంతో చర్మం సాఫ్ట్ గా, తేమను కోల్పోకుండా గ్లోగా ఉంటుంది. అంతే కాకుండా బ్లడ్ సర్క్యులేషన్ కూడా బాగా జరుగుతుంది.

ఇవి కూడా చదవండి

మాయిశ్చరైజర్ ను మార్చాలి:

సాధారణంగా వర్షా కాలం, వేసవి కాలంలో రాసుకునే మాయిశ్చరైజర్స్ కంటే చలి కాలంలో ఇంకా రిచ్ గా, ఆయిల్ బేస్ ఉండే క్రీములు రాసుకోవాలి. వీలైనంత వరకూ ఆర్గానిక ప్రాడెక్ట్స్ వాడటం బెటర్.

ఈ కూరగాయలు తినాలి:

ఈ సీజన్ లో చర్మానికి మేలు చేసే కూరగాయాలు తింటే స్కిన్ కూడా బాగుంటుంది. చిలగడ దుంపలు, క్యాప్సికం, క్యారెట్, గుమ్మడి కాయ వంటి వాటిలో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్లు, ఏ, బీ, ఈ, ఐరన్ వంటి ఉంటాయి. ఇవి తీసుకుంటే చర్మం తేమగా ఉంటుంది.

ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్:

చలి కాలంలో ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న ఆహారం తీసుకోవాలి. వీటివల్ల స్కిన్ సాఫ్ట్ గా ఉంటాయి. సాల్మన్ ఫిష్, ఆలీవ్ ఆయిల్, వాల్ నట్స్ లో ఈ ఫ్యాటీ యాసిడ్స్ మెండుగా ఉంటాయి.

కొబ్బరి నూనె:

కొబ్బరి నూనె అనేది స్కిన్ కేర్ లో కీ రోల్ పోషిస్తుంది. ఫ్రీ రాడికల్స్ వల్ల జరిగిన డ్యామేజ్ ను తగ్గిస్తుంది. అలాగే స్కిన్ యంగ్ గా కనిపించేలా చేస్తుంది. కాబట్టి చలి కాలంలో రాత్రి పడుకునే ముందు కొద్దిగా కొబ్బరి నూనె మసాజ్ చేసుకుని.. ఉదయాన్నే స్నానం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి.

దానిమ్మ పండు:

అన్ని రకాల పండ్ల కంటే దానిమ్మ పండు చాలా బెటర్. వీటిల్లో యాంటీ ఆక్సిడెంట్స్.. సెల్ ఏజీయింగ్ ను అడ్డుకుంటాయని పలు పరిశోధనల్లో తేలాయి. కాబట్టి చలి కాలంలో దానిమ్మ పండు తిన్నా, జ్యూస్ తాగినా మంచిదే. కాబట్టి వింటర్ సీజన్ లో వీలైనంత వరకూ దానిమ్మ పండు తింటే స్కిన్ బావుంటుంది.

Follow Us
డబ్బు కోసం ఇంత దారుణమా.. ? రష్మీ ఎమోషనల్ పోస్ట్..
డబ్బు కోసం ఇంత దారుణమా.. ? రష్మీ ఎమోషనల్ పోస్ట్..
నవరాత్రుల్లో ఇంటికి ఈ 6 వస్తువులు తెచ్చుకోండి.. సుఖసంతోషాలు..
నవరాత్రుల్లో ఇంటికి ఈ 6 వస్తువులు తెచ్చుకోండి.. సుఖసంతోషాలు..
ఖాళీ కడుపుతో అరటిపండు తినడం మంచిదేనా? నిపుణులు ఏం చెబుతున్నారంటే
ఖాళీ కడుపుతో అరటిపండు తినడం మంచిదేనా? నిపుణులు ఏం చెబుతున్నారంటే
భోగి సినిమాను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?
భోగి సినిమాను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?
వలలో ఈ చేప చిక్కింది.. జాలరి పంట పండింది..
వలలో ఈ చేప చిక్కింది.. జాలరి పంట పండింది..
శుక్ర మూఢమిలోనూ వీరికి శుభాలు! అదృష్టం పట్టే రాశులివే..!
శుక్ర మూఢమిలోనూ వీరికి శుభాలు! అదృష్టం పట్టే రాశులివే..!
సిక్స్ కొడితే ఔటే.. బ్యాటర్లను భయపెడుతోన్న టీమిండియా బౌలర్..!
సిక్స్ కొడితే ఔటే.. బ్యాటర్లను భయపెడుతోన్న టీమిండియా బౌలర్..!
తెలంగాణ వైద్య శాస్త్రవేత్తకు ప్రతిష్టాత్మక గౌరవం..
తెలంగాణ వైద్య శాస్త్రవేత్తకు ప్రతిష్టాత్మక గౌరవం..
90s డ్రీమ్ గర్ల్ మహేశ్వరి వారసురాలు.. టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్..
90s డ్రీమ్ గర్ల్ మహేశ్వరి వారసురాలు.. టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్..
నవరాత్రుల్లో దుర్గాదేవి ముందు నెయ్యి దీపం వెలిగించాలా? నూనె దీపమా
నవరాత్రుల్లో దుర్గాదేవి ముందు నెయ్యి దీపం వెలిగించాలా? నూనె దీపమా