Health Care: మీ ఆయుష్షు పెరగాలంటే.. ఈ ఫుడ్స్ మీ ఆహారంలో భాగం చేసుకోండి!
మనం తీసుకునే ఆహారం బట్టే మన ఆరోగ్యం అనేది ఆధారపడి ఉంటుంది. అయితే ఇప్పుడు బిజీ లైఫ్ కారణంగా తినడానికి కూడా సరైన సమయం ఉండటం లేదు. ఉన్న సమయంలోనే హడావిడిగా ఏదో జంక్ ఫుడ్ లేదా ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకుంటున్నారు. దీంతో లేని పోని అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. బీపీ, డయాబెటీస్, అధిక బరువు, గుండె జబ్బులు వంటి వాటిని ఎదుర్కొనాల్సి ఉంటుంది. కాబట్టి మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. సరైన ఆహారం తీసుకోవడం..
మనం తీసుకునే ఆహారం బట్టే మన ఆరోగ్యం అనేది ఆధారపడి ఉంటుంది. అయితే ఇప్పుడు బిజీ లైఫ్ కారణంగా తినడానికి కూడా సరైన సమయం ఉండటం లేదు. ఉన్న సమయంలోనే హడావిడిగా ఏదో జంక్ ఫుడ్ లేదా ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకుంటున్నారు. దీంతో లేని పోని అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. బీపీ, డయాబెటీస్, అధిక బరువు, గుండె జబ్బులు వంటి వాటిని ఎదుర్కొనాల్సి ఉంటుంది. కాబట్టి మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. సరైన ఆహారం తీసుకోవడం వల్ల మనం కూడా ఎలాంటి అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటారు.
బ్లూబెర్రీలు:
హెల్దీగా ఉండాలంటే బ్లూబెర్రీలను తీసుకోవాలి. వీటిల్లో ఆంథోసైనిన్స్ అనే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి గుండె జబ్బులు, షుగర్ వంటి సమస్యల బారిన పడకుండా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల రక్త పోటు అదుపులో ఉండడమే కాకుండా, మూత్ర పిండాలకు సంబంధించిన సమస్యలు కూడా రాకుండా ఉంటాయి.
కూరగాయలు – ఆకు కూరలు:
ప్రతి రోజూ తాజాగా ఉన్న ఆకు కూరలు, కూరగాయలు తినడం వల్ల శరీరానికి అవసరం అయ్యే విటమిన్లు, మినరల్స్, ఫైబర్, పోషకాలు పుష్కలంగా అందుతాయి. వీటిని తినడం వల్ల ఆరోగ్యం మెరుగు పడటంతో పాటు జీర్ణ శక్తి కూడా మెరుగు పడుతుంది. అంతే కాకుండా బరువును కూడా అదుపులో ఉంచుకోవచ్చు.
ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్:
ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ తీసుకోవడం వల్ల ముఖ్యంగా గుండె ఆరోగ్యాన్ని, చర్మ సమస్యలు రాకుండా కాపాడుకోవచ్చు. అలాగే దీర్ఘకాల అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటాం.
డ్రై ఫ్రూట్స్:
ప్రతి రోజూ మీ డైట్ లో డ్రై ఫ్రైట్స్ ని తీసుకోవడం వల్ల దీర్ఘకాలికంగా వచ్చే అనారోగ్య సమస్యల నుంచి దూరంగా ఉండొచ్చు. అంతే కాకుండా శరీరం బలంగా, దృఢంగా ఉంటుంది. రోగ నిరోధక శక్తి బాగా పెరుగుతుంది.
యాపిల్:
ప్రతి రోజూ ఒక యాపిల్ తింటే డాక్టర్ కు దూరంగా ఉండొచ్చన్న ట్యాగ్ లైన్ ఊరికే రాలేదు. ఎందుకంటే యాపిల్ లో ఉండే పోషకాలు అన్నీ ఇన్నీ కావు. రోజూ యాపిల్ తినడం వల్ల గుండె ఆరోగ్యం, షుగర్, బీపీ కంట్రోల్ లో, చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. ఇలా ప్రతి రోజూ మనం ఆహారంలో పోషకాలు నిండిన ఆహారాన్ని యాడ్ చేసుకోడం వల్ల అనారోగ్య సమస్యలు దరి చేరకుండా హెల్దీగా ఉండొచ్చు.
గమనిక: ఇది ఇంటర్నెట్ నుంచి సేకరించిన సమాచారం. వీటిని ఫాలో అయ్యే ముందు ఒకసారి నిపుణులను సంప్రదించడం మేలు.