Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Interesting Facts: షవర్మా తింటే అంత ప్రమాదమా.. ఇది తింటే నిజంగానే చనిపోతారా!

షవర్మా.. స్నాక్స్ లో ఎంతో ప్రాచుర్యం పొందిన ఐటెమ్. ముఖ్యంగా హైదరాబాద్ లో ఎక్కడ చూసినా ఈ షవర్మా స్టోర్స్ కనిపిస్తాయి. లొట్టలేసుకుంటూ మరీ వీటిని నగర వాసులు ఆస్వాదిస్తారు. ఇక నాన్ వెజ్ ప్రియుల గురించి చెప్పాల్సిన అవసరం లేదు. సమయం దొరికినప్పుడల్లా, తినాలనిపించినప్పుడల్లా ఫోన్ లో ఆర్డర్ పెట్టేస్తున్నారు. కేవలం నాన్ వెజిటేరియన్స్ కోసమే కాకుండా.. వెజ్ ప్రియుల కోసం కూడా వెజ్ షవర్మా తయారు చేస్తున్నారు. అయితే ఇటీవల కేరళలో..

Interesting Facts: షవర్మా తింటే అంత ప్రమాదమా.. ఇది తింటే నిజంగానే చనిపోతారా!
Shawarma
Follow us
Chinni Enni

| Edited By: Ravi Kiran

Updated on: Oct 30, 2023 | 7:05 AM

షవర్మా.. స్నాక్స్ లో ఎంతో ప్రాచుర్యం పొందిన ఐటెమ్. ముఖ్యంగా హైదరాబాద్ లో ఎక్కడ చూసినా ఈ షవర్మా స్టోర్స్ కనిపిస్తాయి. లొట్టలేసుకుంటూ మరీ వీటిని నగర వాసులు ఆస్వాదిస్తారు. ఇక నాన్ వెజ్ ప్రియుల గురించి చెప్పాల్సిన అవసరం లేదు. సమయం దొరికినప్పుడల్లా, తినాలనిపించినప్పుడల్లా ఫోన్ లో ఆర్డర్ పెట్టేస్తున్నారు. కేవలం నాన్ వెజిటేరియన్స్ కోసమే కాకుండా.. వెజ్ ప్రియుల కోసం కూడా వెజ్ షవర్మా తయారు చేస్తున్నారు. అయితే ఇటీవల కేరళలో జరిగిన షవర్మా సంఘటన దేశం మొత్తాన్ని ఊపేస్తుంది.

షవర్మా తిని చనిపోయిన వ్యక్తి:

కేరళలోని ఓ వ్యక్తి తన ఫ్రెండ్స్ తో పాటు కలిసి ఫుడ్ ఆర్డర్ చేసుకున్నాడు. అయితే అతనికి షవర్మా ఇష్టం కాబట్టి అది ఆర్డర్ పెట్టాడు. మిగతా వారు ఇతర పదార్థాలను తిన్నారు. అయితే షవర్మా తిన్న సడన్ గా వాంతులు చేసుకుని, అస్వస్థతకు గురయ్యాడు. అనంతరం ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ మృతి చెందాడు. షవర్మా వల్ల ఫుడ్ పాయిజన్ అయ్యి.. మృతి చెందారని డాక్టర్లు ధృవీకరించారు. దీంతో ఇప్పుడు ఫోకస్ అంతా షవర్మా మీద పడింది. షవర్మా వల్ల నిజంగానే ఫుడ్ పాయిజన్ అయి చనిపోతారా.. అది ఎందుకు జరిగింది? అనే ప్రశ్నలు మొదలయ్యాయి.

ఇవి కూడా చదవండి

షవర్మాలో ఎక్కువగా హానికర పదార్థాలు ఉంటాయి:

సాధారణంగా షవర్మాలో పెట్టే స్టఫ్ ను ఎక్కువ సేపు కాల్చుతూ ఉంటారు. వాటితో పాటు ఇతర పదార్థాలను కూడా జోడిస్తారు. ఇలా ఏ పదార్థానైనా ఓవర్ గా కుక్క్ చేస్తే అందులోని పోషకాలు పోయి.. విష పదార్థాలు చేరతాయి. ఇలాంటివి తిన్నప్పుడు.. వికారం, వాంతులు, విరేచనాలు, కడుపులో నొప్పి వంటి సమస్యలు ఎదురవుతాయి. కొందరు వీటిని తట్టుకోలేక.. మరణిస్తారు.

ఇంతకీ షవర్మా తింటే మంచిదా? కాదా?:

షవర్మా తింటే మంచిదా అంటే కాదని చెబుతున్నారు నిపుణులు. ఇందులో ఎన్నో అనారోగ్యకర ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇది రక్తంలో చెడు కొలెస్ట్రాల్ ను పెంచుతుంది. అంతే కాకుండా గుండె పోటు సమస్యలు, బరువు పెరిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. షవర్మా తింటే కొందరికి డయారియా, కడుపులో నొప్పి, వాంతులు, వికారం వంటివి వస్తాయి. ఒక్కొక్కరికి ఫుడ్ పాయిజన్ కూడా అవుతుంది. కాబట్టి ఏదో ఒక్కోసారి తింటే పర్వాలేదు కానీ.. అదే పలంగా తింటే మాత్రం ప్రాణం మీదకు వస్తుంది.