Skin Care: మీ చర్మం ముత్యంలా మెరిసిపోవడానికి ఇలాంటి ఇంటి చిట్కా అద్భుతం చేస్తుంది.. తప్పక ట్రై చేయండి..
ఎలాంటి ఖర్చు లేకుండా కాస్త జాగ్రత్తలు తీసుకుంటే అందమైన చర్మాన్ని సొంతం చేసుకోవచ్చు. అది కూడా పూర్తిగా సహజమైన మార్గాల ద్వారా...!! చర్మకాంతిని పెంచుకోవాలనుకునే వారికి మన ఇంట్లో, ఇంటి పెరట్లో లభించే వస్తువులతో చక్కటి పరిష్కారం లభిస్తుంది. అందులో భాగంగా మన వంటింట్లో లభించే పసుపు, పెరట్లో దొరికే కలబంద అతి ముఖ్యమైన పదార్థాలు. ఈ నేచురల్ పదార్థాలను క్రమం తప్పకుండా మీ చర్మంపై అప్లై చేస్తూ ఉంటే త్వరలోనే మీరు మార్పును గమనిస్తారు. అదేలాగో ఇక్కడ తెలుసుకుందాం..
మెరిసే అందమైన చర్మం కలిగి ఉండాలన్నది ప్రతి అమ్మాయి కల. ముఖాన్ని, చర్మాన్ని మరింత అందంగా మార్చుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాం. అందుకోసం ఎన్నో ఖరీదైన బ్యూటీ ప్రొడక్ట్స్ కొంటుంటారు. అయితే, ఎలాంటి ఖర్చు లేకుండా కాస్త జాగ్రత్తలు తీసుకుంటే అందమైన చర్మాన్ని సొంతం చేసుకోవచ్చు. అది కూడా పూర్తిగా సహజమైన మార్గాల ద్వారా…!! చర్మకాంతిని పెంచుకోవాలనుకునే వారికి మన ఇంట్లో, ఇంటి పెరట్లో లభించే వస్తువులతో చక్కటి పరిష్కారం లభిస్తుంది. అందులో భాగంగా మన వంటింట్లో లభించే పసుపు, పెరట్లో దొరికే కలబంద అతి ముఖ్యమైన పదార్థాలు. ఈ నేచురల్ పదార్థాలను క్రమం తప్పకుండా మీ చర్మంపై అప్లై చేస్తూ ఉంటే త్వరలోనే మీరు మార్పును గమనిస్తారు. అదేలాగో ఇక్కడ తెలుసుకుందాం..
పసుపు, కలబంద చర్మానికి చాలా మేలు చేస్తుంది. రెండింటినీ విడివిడిగా ఉపయోగించవచ్చు. అయితే ఈ రెండింటి మిశ్రమాన్ని ఉపయోగించడం వల్ల చర్మం మరింత మెరుపుతో పాటు అందాన్ని సంతరించుకుంటుంది. ఈ రెండు సహజ పదార్థాల ప్రయోజనాలు రెండు రెట్లు. కాబట్టి ఫలితం కూడా రెట్టింపుగానే కనిపిస్తుంది.
పసుపులో యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. అయితే కలబంద చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచడంలో సహాయపడుతుంది. అలాంటప్పుడు ఈ రెండింటి కలయిక చర్మానికి రెట్టింపు ప్రయోజనాలను ఇస్తుందనడంలో సందేహం లేదంటున్నారు ఆరోగ్య నిపుణులు. అధిక హైడ్రేటింగ్ కలబంద, పసుపు యాంటీ బాక్టీరియల్ లక్షణాల మిశ్రమాన్ని చర్మానికి అప్లై చేయడం ద్వారా చర్మాన్ని మెరుగుపరచడానికి, కాంతివంతంగా మార్చుకోవచ్చు.
పసుపు, కలబంద, తేనె మిశ్రమాన్ని చర్మానికి అప్లై చేసి 20 నుండి 25 నిమిషాల తర్వాత సాధారణ నీటితో శుభ్రం చేసుకోవటం వల్ల అద్బుతమైన మార్పును గమనిస్తారు. ఇలా చేయడం వల్ల చర్మం కోల్పోయిన మెరుపును కూడా తిరిగి పొందేలా చేస్తుంది. కలబంద, పసుపు పొడి మిశ్రమాన్ని చర్మంపై కొద్దిగా గంధం కలపండి. మిశ్రమం ఆరిన తర్వాత, సాధారణ నీటితో శుభ్రం చేసుకోండి. ఇలా చేయడం వల్ల చర్మంపై ముడతలు తొలగిపోతాయి.
మొటిమల సమస్యలతో బాధపడేవారికి కలబంద, పసుపు మిశ్రమం చాలా సహాయపడుతుంది. కలబంద, పసుపు, తేనె కలిపిన మిశ్రమాన్ని చర్మానికి పట్టించాలి. మిశ్రమం ఆరిపోయిన తర్వాత సాధారణ నీటితో శుభ్రం చేసుకోండి. ఇలా చేయడం వల్ల మొటిమల సమస్య నుండి ఉపశమనం పొందుతారు. కలబంద, పసుపు మిశ్రమం చర్మానికి మంచిది. అయితే ఇది కొంతమందిలో అలెర్జీ ప్రతిచర్యలకు కారణమవుతుంది. పైన పేర్కొన్న మిశ్రమంలో దేనికైనా మీకు అలెర్జీ ఉంటే, దయచేసి వాటిని ఉపయోగించకుండా ఉండండి. లేదంటే నిపుణుల సలహాలు తీసుకోవటం మంచిది.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..