Brain Stroke Symptoms : అక్టోబరు 29న ప్రపంచ స్ట్రోక్ డే.. మహిళల్లోనే ఎక్కువ సమస్య.. లక్షణాలు తెలుసుకోండి..!

కంటి చూపులో ఆకస్మిక మార్పులు కూడా స్ట్రోక్‌లో భాగం కావచ్చు. ఇది కూడా గమనించాలి. అస్పష్టమైన దృష్టి, కంటికి ఫ్లాష్ కొట్టిన అనుభూతి కూడా ఉండవచ్చు. స్ట్రోక్ మరొక లక్షణం మానసిక గందరగోళం వంటి సమస్యలు. అస్పష్టమైన ఆలోచనలు, మాటల్లో గందరగోళం, స్పృహ కోల్పోవడం వంటి సమస్యలు. మీరు అలసట, వాంతులు లేదా వికారం కూడా అనుభవించవచ్చు. మీరు గొంతులో బిగుతు, శ్వాస ఆడకపోవడాన్ని కూడా అనుభవించవచ్చు.

Brain Stroke Symptoms : అక్టోబరు 29న ప్రపంచ స్ట్రోక్ డే.. మహిళల్లోనే ఎక్కువ సమస్య.. లక్షణాలు తెలుసుకోండి..!
Brain Stroke Symptoms
Follow us
Jyothi Gadda

|

Updated on: Oct 28, 2023 | 9:58 PM

మీరందరూ స్ట్రోక్, స్ట్రోక్ కారణంగా సంభవించే మరణాలు, లేదంటే, సగం శరీరం బలహీనమై పోవటం వంటి అనేక కేసులు చూసే ఉంటారు. లేదంటే కనీసం విని కూడా ఉంటారు. కానీ నిజం ఏమిటంటే చాలా మందికి స్ట్రోక్ అంటే ఏమిటో తెలియదు. సరళంగా చెప్పాలంటే, మెదడుకు రక్త ప్రసరణ పాక్షికంగా లేదా పూర్తిగా నిరోధించబడిన స్థితిని స్ట్రోక్ అంటారు. దాని తీవ్రతను బట్టి, రోగి కూడా ప్రభావితమవుతాడు. అక్టోబరు 29న ప్రపంచ స్ట్రోక్ డే జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో బ్రేక్‌ స్ట్రోక్‌కు సంబంధించిన కాస్త అవగాహన పెంచుకునే ప్రయత్నమే ఈ ప్రత్యేక కథనం సారాంశం..

మెదడుకు రక్త ప్రసరణ పాక్షికంగా లేదా పూర్తిగా నిరోధించబడిన స్థితిని స్ట్రోక్ అంటారు. దాని తీవ్రతను బట్టి, రోగి కూడా ప్రభావితమవుతాడు. కొందరికి కోలుకోలేని సమస్య రావచ్చు. మరికొందరు పక్షవాతంతో బాధపడవచ్చు. కొందరు మాట్లాడలేకపోవడం, పరిమితమైన ముఖ కదలికలు ఇలా అనేక రకాలుగా స్ట్రోక్‌ ప్రభావం పుడుతుంది. పురుషుల కంటే స్త్రీలకు స్ట్రోక్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. ఈ విషయం చాలా మందికి తెలియదు. దీనికి చాలా కారణాలు కూడా ఉన్నాయంటున్నారు. ఒకటి బీపీ లేదా రక్తపోటు. బీపీ ఉన్న స్త్రీలు దానిని అదుపులో ఉంచుకోలేకపోవడం వల్ల వారికి త్వరగా పక్షవాతం వచ్చే అవకాశం ఉంది.

అదేవిధంగా, పురుషుల కంటే స్త్రీలకు ఎక్కువ ఆయుర్దాయం ఉంటుంది. స్ట్రోక్ ఎక్కువగా వృద్ధులను ప్రభావితం చేస్తుంది. అందువల్ల మహిళల్లో స్ట్రోక్ ముప్పు పెరుగుతుంది. ఇవే కాకుండా గర్భనిరోధక మాత్రలు, గర్భం ధరించడం వంటివన్నీ మహిళల్లో స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతాయని నిపుణులు చెబుతున్నారు. అందువల్లే మహిళ్లలో పెరుగుతున్న స్ట్రోక్ సమస్యకు సంబంధించిన కొన్ని లక్షణాల గురించి ఇక్కడ తెలుసుకుందాం..

ఇవి కూడా చదవండి

స్ట్రోక్ సమస్య ప్రధాన లక్షణాలను ‘ఫాస్ట్’ అంటారు. అందులోని ఒక్కో అక్షరం ఒక్కో లక్షణాన్ని సూచిస్తుంది. F- అంటే ‘ముఖం వంగిపోవడం’, A- అంటే ‘చేతి బలహీనత’, S- అంటే ‘మాటల కష్టం’ T- అంటే ‘సమయం’. అంటే, ఇలాంటి లక్షణాలు గమనించినట్లయితే వెంటనే రోగిని ఆసుపత్రిలో చేర్చాల్సి వస్తుంది. ఈ లక్షణాలు పురుషులు, మహిళలు ఇద్దరిలో ఒకేలా కనిపిస్తాయి. ముఖం ఒక వైపు తిమ్మిరి పట్టడం అనేది స్ట్రోక్ ముఖ్యమైన లక్షణం. చేయి పనిచేయక పోవటం, బలహీనంగా మారటం గమనించినప్పుడు కూడా జాగ్రత్త వహించండి.

కంటి చూపులో ఆకస్మిక మార్పులు కూడా స్ట్రోక్‌లో భాగం కావచ్చు. ఇది కూడా గమనించాలి. అస్పష్టమైన దృష్టి, కంటికి ఫ్లాష్ కొట్టిన అనుభూతి కూడా ఉండవచ్చు. స్ట్రోక్ మరొక లక్షణం మానసిక గందరగోళం వంటి సమస్యలు. అస్పష్టమైన ఆలోచనలు, మాటల్లో గందరగోళం, స్పృహ కోల్పోవడం వంటి సమస్యలు. మీరు అలసట, వాంతులు లేదా వికారం కూడా అనుభవించవచ్చు. మీరు గొంతులో బిగుతు, శ్వాస ఆడకపోవడాన్ని కూడా అనుభవించవచ్చు. మీకు ఈ లక్షణాలన్నీ కనిపిస్తే, అది స్ట్రోక్ అని అనుకోకండి. బదులుగా, సకాలంలో వైద్య చికిత్స పొందడం అవసరం.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..