Watch Viral Video: పులితో పెట్టుకుంటే ఇట్టాగే ఉంటది మరీ.. ! దెబ్బకు అక్క తిక్క కుదిరింది.. ఏమైందో వీడియోలో చూసేయండి..

ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన జంతువుల్లో పులి కూడా ఒకటి. కానీ చాలా దేశాల్లో పెంపుడు జంతువుగా కూడా జీవిస్తుంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో చాలా ప్రమాదకరమైన పరిస్థితి తలెత్తింది. వీడియోలో, ఒక మహిళ భారీ పులితో కాలక్షేపం చేస్తున్న దృశ్యం కనిపిస్తుంది. కానీ అకస్మాత్తుగా ఏదో జరుగుతుంది, దాని గురించి ఆమెకు తెలియదు. అయితే, అక్కడ ఆ మహిళ తన పులిని ప్రేమగా లాలించింది. ఒక్కసారిగా పులి ప్రవర్తనలో మార్పు వచ్చి దూకుడుగా మారుతుంది. దాంతో ఆ పులి తన దవడలతో ఆమెపై దాడికి దిగింది. మహిళ మోచేయి, ఆ తర్వాత ఆమె కాళ్లను కూడా నోట కరిచింది.. ఆ తర్వాత ఏం జరిగిందో..

Watch Viral Video: పులితో పెట్టుకుంటే ఇట్టాగే ఉంటది మరీ.. ! దెబ్బకు అక్క తిక్క కుదిరింది.. ఏమైందో వీడియోలో చూసేయండి..
Tiger Attacked Woman
Follow us
Jyothi Gadda

|

Updated on: Oct 28, 2023 | 8:40 PM

చాలా మంది ఇళ్లలో కుక్కలు, పిల్లులను పెంపుడు జంతువులుగా పెంచుకుంటారు. ఇటీవల విదేశాల్లో కొందరు పులులు, సింహాలు, భయంకర కొండచిలువలను పెంచుకుంటున్న సంఘటనలు మనం సోషల్ మీడియాలో చాలా సార్లు చూశాం. అలాంటి జంతువులను తమ ఇళ్లలో పెంచుకోవటమే కాకుండా వాటితో కలిసి భోజనం చేయటం, ఒకే బెడ్‌పై నిద్రపోతున్న దృశ్యాలు కూడా చూశాం. అయితే, ఇలాంటి వీడియోలు చూడటానికి చాలా ఆశ్చర్యంగానూ, షాకింగ్‌గానూ ఉంటాయి. సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్న ఇలాంటి వీడియోలు చూసిన జనాలు భయపడుతున్నారు. తాజాగా అలాంటిదే మరో వీడియో నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. ఇది చూసి ప్రజలు చాలా ఆశ్చర్యపోతున్నారు. వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో పులిని ప్రేమగా లాలిస్తున్న మహిళకు ఒక్కసారిగా షాకింగ్‌ అనుభవం ఎదురైంది. సడెన్‌గా పులి ప్రవర్తనలో మార్పు వచ్చి దూకుడుగా మారుతుంది.ఆ తర్వాత ఏం జరిగిందో చూపించే ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.

ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన జంతువుల్లో పులి కూడా ఒకటి. కానీ చాలా దేశాల్లో పెంపుడు జంతువుగా కూడా జీవిస్తుంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో చాలా ప్రమాదకరమైన పరిస్థితి తలెత్తింది. వీడియోలో, ఒక మహిళ భారీ పులితో కాలక్షేపం చేస్తున్న దృశ్యం కనిపిస్తుంది. కానీ అకస్మాత్తుగా ఏదో జరుగుతుంది, దాని గురించి ఆమెకు తెలియదు. అయితే, అక్కడ ఆ మహిళ తన పులిని ప్రేమగా లాలించింది. ఒక్కసారిగా పులి ప్రవర్తనలో మార్పు వచ్చి దూకుడుగా మారుతుంది. దాంతో ఆ పులి తన దవడలతో ఆమెపై దాడికి దిగింది. మహిళ మోచేయి, ఆ తర్వాత ఆమె కాళ్లను కూడా నోట కరిచింది..

ఇవి కూడా చదవండి

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో జనాలు చాలా ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఈ పోస్ట్‌పై చాలా మంది తమ స్పందనను తెలియజేశారు. ఈ వీడియోను 3 లక్షల మందికి పైగా లైక్ చేశారు. వీడియో చూసిన జనాలు షాకింగ్‌ రియాక్షన్ ఇచ్చారు. చాలా మంది వినియోగదారులు తమ అభిప్రాయాన్ని షేర్‌ చేశారు. వీడియో చూసిన తర్వాత నేను చాలా భయపడ్డాను అని ఒకరు, ప్రజలు ఇంత ప్రమాదకరమైన జంతువులను ఎలా పెంచుకుంటారని కొందరు ప్రశ్నిస్తున్నారు. పులి దాడి నుండి మహిళ ప్రాణం తృటిలో రక్షించబడిందని మరికొందరు స్పందించారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..