ప్రేమ కోసమై సరిహద్దులు దాటిన మహిళ.. భర్తను, కొడుకును వదిలేసి అక్రమంగా భారత్‌లోకి.. క్లైమాక్స్‌లో ట్విస్ట్..!

గతంలో పాకిస్తాన్ కు చెందిన సీమా హైదర్ అనే మహిళ యూపీకి చెందిన యువకుడ్ని ప్రేమించి పిల్లలతో సహా అక్రమంగా భారత్ లోకి ప్రవేశించింది. ఆ తర్వాత కూడా అలాంటి ప్రేమ కథలు అనేకం వచ్చాయి. అయితే, ఇప్పుడు కూడా అలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఈ సారి బంగ్లాదేశ్ కి చెందిన మహిళ ప్రేమించిన వ్యక్తి కోసం అక్రమంగా అంతర్జాతీయ సరిహద్దును దాటి భారత్‌లోకి ప్రవేశించింది. పాకిస్థాన్‌కు చెందిన సీమా హైదర్‌లాగే సరిహద్దుల్లోని మరో మహిళ తన ప్రేమను వెతుక్కుంటూ భారత్‌కు వచ్చింది. అయితే

ప్రేమ కోసమై సరిహద్దులు దాటిన మహిళ.. భర్తను, కొడుకును వదిలేసి అక్రమంగా భారత్‌లోకి.. క్లైమాక్స్‌లో ట్విస్ట్..!
Bangladesh Women Love Story
Follow us
Jyothi Gadda

|

Updated on: Oct 28, 2023 | 8:10 PM

గత కొద్ది రోజులుగా ప్రేమ, పెళ్లి పేరుతో విదేశీ యువతీ యువకులు భారత్‌లోకి అక్రమంగా ప్రవేశిస్తున్న సంఘటనలు తరచూ వెలుగులోకి వస్తున్నాయి. గతంలో పాకిస్తాన్ కు చెందిన సీమా హైదర్ అనే మహిళ యూపీకి చెందిన యువకుడ్ని ప్రేమించి పిల్లలతో సహా అక్రమంగా భారత్ లోకి ప్రవేశించింది. ఆ తర్వాత కూడా అలాంటి ప్రేమ కథలు అనేకం వచ్చాయి. అయితే, ఇప్పుడు కూడా అలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఈ సారి బంగ్లాదేశ్ కి చెందిన మహిళ ప్రేమించిన వ్యక్తి కోసం అక్రమంగా అంతర్జాతీయ సరిహద్దును దాటి భారత్‌లోకి ప్రవేశించింది. పాకిస్థాన్‌కు చెందిన సీమా హైదర్‌లాగే సరిహద్దుల్లోని మరో మహిళ తన ప్రేమను వెతుక్కుంటూ భారత్‌కు వచ్చింది. అయితే బంగ్లాదేశ్ యువతి ప్రేమికుడు మాత్రం సీమా ప్రేమికుడు సచిన్‌లా ధైర్యంగా నిలబడలేదు. వీరిద్దరూ ఉన్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు దాడి చేయడంతో ప్రేమికుడు అక్కడి నుంచి పరారయ్యాడు. బంగ్లాదేశ్ మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు.

వివరాల్లోకి వెళితే.. తను ప్రేమించిన ప్రియుడిని పెళ్లి చేసుకునేందుకు అక్రమంగా భారత్‌లోకి ప్రవేశించిన ఓ మహిళ పట్టుబడింది. 24 ఏళ్ల మహిళ అంతర్జాతీయ సరిహద్దును దాటి ప్రియుడి గ్రామంలోకి ప్రవేశించింది. ఆమెను గురించిన సమాచారం అందుకున్న పోలీసులు ప్రియుడితో కలిసి బయటకు వెళ్లిన సమయంలో అదుపులోకి తీసుకున్నారు. ధర్మనగర్ సబ్‌డివిజన్‌లోని ఫుల్‌బరీ నివాసి అయిన 34ఏళ్ల నూర్ జలాల్ ఆయుర్వేదాన్ని అభ్యసిస్తున్నాడు. బంగ్లాదేశ్‌లోని మౌల్వీ బజార్‌కు తరచూ వెళ్లేవాడు. ఈ క్రమంలోనే నూర్ అనే 24 ఏళ్ల మహిళతో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ప్రేమించిన ప్రియుడిని పెళ్లి చేసుకోవటం కోసం ఆమె 15 రోజుల క్రితం అక్రమంగా ధర్మనగర్‌కు చేరుకుంది. అయితే, ప్రియుడి కోసం భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించిన ఫాతిమా నుస్రత్‌ కు ఒక బిడ్డ కూడా ఉన్నాడని తెలిసింది. కానీ, ఎలాగైనా నూర్ జలాల్ తో కలిసి జీవించాలనే నిర్ణయం తీసుకున్న ఆమె దేశ సరిహద్దులు దాటింది.

పరదేశీ మహిళ అక్రమంగా భారత్‌లోకి ప్రవేశించిన విషయం పోలీసులకు చేరింది. దాంతో బంగ్లాదేశ్‌కు చెందిన ఫాతిమా నుస్రత్‌ను ఉత్తర త్రిపుర జిల్లాలోని ధర్మనగర్‌లో అరెస్టు చేశారు. ఇక్కడ ఆయుర్వేద చికిత్స చేస్తున్న నూర్ జలాల్ (34)తో కలిసి జీవించేందుకు ఆమె భారత్‌కు వచ్చినట్టుగా అంగీకరించింది. త్రిపురలోని ఫుల్బరీలో ఇద్దరు కలిసి ఉంటున్న సమయంలో బంగ్లాదేశ్‌కు చెందిన యువతి ఇక్కడ అక్రమంగా నివసిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. గురువారం పోలీసులు వారి నివాసానికి చేరుకుని మహిళను అదుపులోకి తీసుకున్నారు. వీరిని కోర్టులో హాజరుపరిచి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. అయితే పోలీసులు వచ్చే సమయానికి నూర్ జలాల్ ఘటనా స్థలం నుంచి పారిపోయినట్టుగా తెలిసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..