Tirumala Temple Closed: చంద్రగ్రహణం కార‌ణంగా రాత్రి 7గంటలకే శ్రీ‌వారి ఆల‌యం మూసివేత.. తిరిగి దర్శనం ఎప్పుడంటే..

తోమాల అర్చన సేవలు జరిగే సమయంలో శ్రీవారి సర్వదర్శనం కోసం భక్తులను అనుమతిస్తామన్నారు. ఆలయం తలుపులు మూసి వేసే దాకా 42 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని ప్రస్తుతం 19 కంపార్ట్మెంట్లలో శ్రీవారి దర్శనం కోసం భక్తులు వేచి ఉన్నారని చెప్పారు. అన్నదానం కూడా మూసి వేశామని, భక్తులకు ఇబ్బంది లేకుండా ముందుగానే ఆహార పొట్లాలను భక్తులకు అందించామన్నారు టిటిడి ఇఓ ధర్మారెడ్డి.

Tirumala Temple Closed: చంద్రగ్రహణం కార‌ణంగా రాత్రి 7గంటలకే శ్రీ‌వారి ఆల‌యం మూసివేత.. తిరిగి దర్శనం ఎప్పుడంటే..
Tirumala Temple Closed
Follow us
Raju M P R

| Edited By: Jyothi Gadda

Updated on: Oct 28, 2023 | 9:32 PM

తిరుపతి,అక్టోబర్‌28; పాక్షిక చంద్రగ్రహణం కారణంగా నిత్యం భక్తులతో కిటికిటలాడే తిరుమల శ్రీవారి ఆలయాన్ని రాత్రి 7.05 గంటలకే మూసి వేయాల్సి వచ్చింది. శ్రీవారి ఆలయ తలుపులు మూసివేసిన అర్చకులు తెల్లవారుజామున 3.15 గంటలకు తిరిగి తెరుస్తారు. దాదాపు 8 గంటల పాటు ఆలయ తలుపులు మూసి ఉంటాయి. అర్ధరాత్రి 1.05 నుండి 2.22 గంటల మధ్య పాక్షిక చంద్రగ్రహణం పూర్తవుతుండగా గ్ర‌హ‌ణం అనంత‌రం తెల్లవారుజామున 3.05 గంటలకు తిరిగి ఆలయ మహా ద్వారాన్ని తెరుస్తామన్నారు టిటిడి ఇఓ ధర్మారెడ్డి. సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొల్పి పుణ్యా వచనం, సంప్రోక్షణ, శుద్ధి చేస్తారన్నారు. అనంతరం తోమాల, అర్చన సేవలతో కైకర్యాలు యధావిధిగా కొనసాగుతాయన్నారు.

తోమాల అర్చన సేవలు జరిగే సమయంలో శ్రీవారి సర్వదర్శనం కోసం భక్తులను అనుమతిస్తామన్నారు. ఆలయం తలుపులు మూసి వేసే దాకా 42 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని ప్రస్తుతం 19 కంపార్ట్మెంట్లలో శ్రీవారి దర్శనం కోసం భక్తులు వేచి ఉన్నారని చెప్పారు. అన్నదానం కూడా మూసి వేశామని, భక్తులకు ఇబ్బంది లేకుండా ముందుగానే ఆహార పొట్లాలను భక్తులకు అందించామన్నారు టిటిడి ఇఓ ధర్మారెడ్డి.

చంద్రగ్రహణంతో తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనాన్ని సాయంత్రం 6 గంటలకు మూసివేసిన టిటిడి అధికారులు రేపు ఉదయం 9 గంటలకు తెరవనున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..