- Telugu News Photo Gallery Spiritual photos Astro tips in telugu: birds net know here full details vastu tips
Astro Tips: ఇంట్లో ఈ పక్షులు గూళ్లు కట్టుకున్నాయా..! అవి అదృష్టానికి చిహ్నం.. డబ్బే డబ్బు..
సృష్టిలోని ప్రతి జీవిలో దైవాన్ని చూడమని సనాతన హిందూ ధర్మం సూచిస్తుంది. మొక్కలు, పశువులు, పక్షులు ఇలా ప్రతి జీవిని దైవంగా భావించి పూజిస్తారు కూడా.. అదే సమయంలో జ్యోతిష్య శాస్త్రంలో జంతువులకు, పక్షులకు, మొక్కలకు కూడా ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. జంతువుల పెంపకంలో మాత్రమే కాదు పక్షులను ఇంటి ఆవరణలో మొక్కల పెంపకం విషయంలో కూడా జ్యోతిష్యశాస్త్రం కొన్ని నియమాలను పేర్కొంది.
Updated on: Oct 28, 2023 | 8:05 PM

అయితే కొన్ని సార్లు మొక్కల్లో,పాడు పడిన ఇళ్లలో మాత్రమే కాదు నివాసయోగ్యమైన ఇంట్లో కూడా పక్షులు గూళ్లు కట్టుకుంటాయి. సాధారణంగా ఇంటి కిటీకిలు, గుమ్మాలు, వెంటిలేటర్స్ పై స్థలాన్ని ఆక్రమించి తమ సొంతం అన్నట్లు గూళ్లను కట్టుకుని నివాసం ఏర్పాటు చేసుకుంటాయి. గుడ్లు పెట్టి సంతోషముగా జీవిస్తాయి.

అయితే ఇంట్లో కొన్ని రకాల పక్షులు గూళ్లను కట్టుకుని నివసిస్తే శుభ్రప్రదం అయితే.. మరికొన్ని జీవులు ఇంట్లో నివాసం ఏర్పాటు చేసుకుంటే అరిష్టమని జ్యోతిష్య శాస్త్రం పేర్కొంది.

ఎవరి ఇంట్లోనైనా పిచ్చుక గూడు కట్టుకుని నివాసం ఏర్పాటు చేసుకుంటే ఆ ఇంట్లో సుఖ సంపదలు వస్తాయని.. ఆ ఇంట్లో సభ్యుల దురదృష్టం కూడా అదృష్టంగా మారుతుందని విశ్వాసం. ఆ ఇంట్లోని సభ్యులకు లక్ష్మీదేవి ఆశీర్వాదం లభిస్తుందని విశ్వాసం.

పావురం లక్ష్మీదేవి భక్తురాలిగా హిందువుల విశ్వాసం. కనుక ఇంట్లో పావురం ఇంటిలో గూడు కట్టుకోవడం శుభప్రదం అని ఆ ఇంట్లో నివసించేవారికి డబ్బులకు కొరత ఉందని విశ్వాసం.

అంతేకాదు పావురం గూడు కట్టుకున్న ఇంట్లో సుఖ శాంతిలుంటాయని.. ఆర్ధిక ఇబ్బందులు ఉండవని నమ్మకం. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో పావురం గూడు నిర్మించుకోవడం అదృష్టం అని నమ్మకం.





























