- Telugu News Photo Gallery Maharshi Valmiki Jayanti: Interesting Facts Of Valmiki Caves In Nandyala District Andhra Pradesh
Valmiki Caves: పర్యాటకులను సంభ్రమాశ్చర్యానికి గురిచేస్తోన్న వాల్మీకి గుహలు.. ప్రత్యేకతలేంటో తెలుసా?
ఆశ్చర్యం.. సంభ్రమాశ్చర్యం... బోరా గుహలు, బెలూం గుహలను తలదన్నే విధంగా అత్యంత ఆశ్చర్యాన్ని కలిగించే విధంగా వెలుగులోకి వచ్చాయి వాల్మీకి గుహలు. సహజ సిద్ధం తో పాటు అతి ప్రాచీన చరిత్ర కలిగి రామాయణంతో ముడిపడి ఉండటం ఈ గుహలకు అత్యంత ప్రాధాన్యత చేకూరింది. నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం నల్ల మేకల పల్లి దగ్గర వాల్మీకి గుహలు వెలుగు చూశాయి. అత్యంత సహజ సిద్ధంగా ఉన్నాయి
J Y Nagi Reddy | Edited By: Basha Shek
Updated on: Oct 28, 2023 | 2:14 PM

ఆశ్చర్యం.. సంభ్రమాశ్చర్యం... బోరా గుహలు, బెలూం గుహలను తలదన్నే విధంగా అత్యంత ఆశ్చర్యాన్ని కలిగించే విధంగా వెలుగులోకి వచ్చాయి వాల్మీకి గుహలు. సహజ సిద్ధం తో పాటు అతి ప్రాచీన చరిత్ర కలిగి రామాయణంతో ముడిపడి ఉండటం ఈ గుహలకు అత్యంత ప్రాధాన్యత చేకూరింది. నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం నల్ల మేకల పల్లి దగ్గర వాల్మీకి గుహలు వెలుగు చూశాయి. అత్యంత సహజ సిద్ధంగా ఉన్నాయి. రామాయణాన్ని రచించిన వాల్మీకి మహర్షి ఈ గుహలలో తపస్సు చేసి రామాయణం రచించారని ప్రచారంలో ఉంది. అయితే ఈ ప్రచారానికి ఎటువంటి ఆధారాలు లేవు.

ల్ల మేకల పల్లి పక్కన బోయవాళ్ళపల్లి అనే చిన్న ఊరు ఉంది. బోయ కులస్తులు .. కాలక్రమేనా వాల్మీకి సామాజిక వర్గంగా పిలుచుకుంటూ ఉన్నారు. ఈ బోయ వాళ్ళ పల్లి దగ్గరే వాల్మీకి గుహలు ఉండటంతో దీనికి వాల్మీకి గుహలు అని ప్రచారం వచ్చింది. స్థానికులు కొందరు కురుబయి గయిలు అని కూడా పిలుచుకుంటారు. పైన అంతా పైదానంలా ఉండి లోపల మాత్రం సహజ సిద్ధమైన గుహలు ఉన్నాయి. వందల ఏళ్ల నాటి నుంచి ఈ గుహలు ఉన్నప్పటికీ బయట ప్రపంచానికి తెలియదు.

నల్ల మేకల పల్లి గ్రామానికి చెందిన సర్పంచ్ సంధ్య భర్త పేరు బయపు రెడ్డి.. అత్యంత ప్రాచీన పురాతన ఆధ్యాత్మిక ఊహల గురించి స్థానిక డోన్ ఎమ్మెల్యే, ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. అయితే గతంలో పర్యాటక శాఖ మంత్రిగా ఉన్న భూమా అఖిల ప్రియ దృష్టికి కూడా కొందరు గుహల గురించి తెచ్చారని సమాచారం. సమాచారం అందిన తక్షణమే స్పందించిన మంత్రి బుగ్గన పర్యాటక పురావస్తు శాఖ అధికారులను పరిశీలించాలని ఆదేశించారు. పరిశీలించిన అధికారులు మంత్రికి నివేదికను అందించారు.

బెలూం గుహలను ప్రముఖ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందే అవకాశం ఉందని ఈ నివేదికలో పేర్కొన్నారు. వెంటనే మంత్రి వాల్మీకి గుహలను అభివృద్ధి చేసేందుకు రహదారుల అభివృద్ధికి, అక్కడే ఒక హోటల్ నిర్మాణానికి ఐదు కోట్ల రూపాయల నిధులు కేటాయించారు. ప్రస్తుతం అవన్నీ కూడా ఎండింగ్ స్టేజ్ లో ఉన్నాయి. లోపలికి వెళ్ళిన పర్యాటకులకు ఇబ్బంది లేకుండా ఆక్సిజన్ బ్లోయర్లను కూడా ఏర్పాటు చేశారు. లోపల అతి పురాతన, మెరుస్తూ ఉండే శివలింగం కూడా ఉంది. ఈ శివలింగం స్వయంభు అని కూడా ప్రచారంలో ఉంది.

గుహలు శివలింగం రామాయణ కాలం నాటివి అని స్థానికులు చెప్పుకుంటూ ఉన్నారు. ప్రస్తుతం బాగా అభివృద్ధి చెందడంతో వీటిని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రారంభించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ వాల్మీకి గుహలు ప్రారంభమైతే నల్ల మేకల పల్లి ప్రాంతం పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందే అవకాశం ఉందని భావిస్తున్నారు. నల్ల మేకల పల్లికి డబుల్ లైన్ తారు రోడ్డు సౌకర్యం ఉంది. డోన్ నుంచి 30 కిలోమీటర్లు గుత్తి నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఈ వాల్మీకి గుహలు సహజసిద్ధంగా వెలిశాయి.

దరాబాద్ బెంగళూరు జాతీయ రహదారికి కూడా ఈ వాల్మీకి గుహలను అనుసంధానం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. దసరా పండుగ రోజు వాల్మీకి గుహలను చూసేందుకు వేలాది మంది తరలి వచ్చారంటే గుహల పట్ల ప్రజలలో ఎంత ఆసక్తి ఉందో అర్థమవుతుంది.. ఇప్పటికే పనులు పూర్తికావచ్చాయని మంత్రి బుగ్గన చేతుల మీదుగా ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నామని పర్యాటకశాఖ డివిజనల్ మేనేజర్ చంద్రమౌళి రెడ్డి తెలిపారు.





























