- Telugu News Photo Gallery Cinema photos Actress Sreeleela refuses to work with vijay Deverakonda movie telugu cinema news
Sreeleela: ఎంబీబీఎస్ ఎగ్జామ్స్.. ఆ యంగ్ హీరో ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్న శ్రీలీల ?.. నిజమేంత..
ఇటీవలే భగవంత్ కేసరి సినిమాతో భారీ విజయాన్ని ఖాతాలో వేసుకుంది శ్రీలీల. ఇందులో తండ్రికూతుర్లుగా బాలయ్య, శ్రీలీల నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇప్పుడు ఆమె నటిస్తోన్న ఆదికేశవ విడుదలకు సిద్ధమవుతుంది. ఈసినిమానే కాకుండా నితిన్ జోడిగానూ నటిస్తోంది. అలాగే ఆమె చేతిలో దాదాపు ఇంకా ఆరు చిత్రాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే శ్రీలీల గురించి ఓ ఆసక్తికర విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంది. తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం హీరో విజయ్ దేవరకొండ సినిమా నుంచి శ్రీలీల తప్పుకున్నట్లు తెలుస్తోంది.
Updated on: Oct 28, 2023 | 1:17 PM

ఇటీవలే భగవంత్ కేసరి సినిమాతో భారీ విజయాన్ని ఖాతాలో వేసుకుంది శ్రీలీల. ఇందులో తండ్రికూతుర్లుగా బాలయ్య, శ్రీలీల నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇప్పుడు ఆమె నటిస్తోన్న ఆదికేశవ విడుదలకు సిద్ధమవుతుంది.

ఈసినిమానే కాకుండా నితిన్ జోడిగానూ నటిస్తోంది. అలాగే ఆమె చేతిలో దాదాపు ఇంకా ఆరు చిత్రాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే శ్రీలీల గురించి ఓ ఆసక్తికర విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంది.

తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం హీరో విజయ్ దేవరకొండ సినిమా నుంచి శ్రీలీల తప్పుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం విజయ్ ఫ్యామిలీ స్టార్ సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్నాడు. దీంతో వీరిద్దరి కాంబోలో రాబోయే సినిమాను వచ్చే ఏడాదికి పోస్ట్ పోన్ చేశారట.

అయితే వచ్చే ఏడాది శ్రీలీల డేట్స్ కేటాయించలేకపోయిందని.. ముందస్తు మూవీస్ ఒప్పందాలు ఉండడంతో డేట్స్ అడ్జట్ చేయలేక ఈ సినిమా నుంచి తప్పుకుందని అంటున్నారు.

అయితే శ్రీలీల స్థానంలోకి రష్మికను తీసుకున్నట్లు రూమర్స్ వినిపించాయి. కానీ ఇప్పుడు ఆమె స్థానంలో ఏజెంట్ బ్యూటీ సాక్షి వైద్యను తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంపై ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ రాలేదు.





























