- Telugu News Photo Gallery Cinema photos Varun Tej Marriage to Amala Paul Marriage Latest Film News from Industry
Film News: మెగా ఫ్యామిలీలో మొదలైన పెళ్లి సందడి.. త్వరలో పెళ్లి చేసుకోబోతున్న సౌత్ బ్యూటీ అమలా పాల్..
మెగా ఫ్యామిలీలో పెళ్లి సందడి మొదలైంది. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి వివాహం నవంబర్ 1న ఇటలీలో జరగనుంది. సౌత్ బ్యూటీ అమలా పాల్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు. యష్ రాజ్ ఫిలిం, నెటిఫ్లిక్స్ సంయుక్తంగా నిర్మించిన తొలి ప్రాజెక్ట్ ది రైల్వే మేన్. ప్రజెంట్ అన్ని ఇండస్ట్రీల్లో సీక్వెల్స్ ట్రెండ్ నడుస్తోంది. తాజాగా ఈ ట్రెండ్‌లోకి ఓ ఇంట్రస్టింగ్ బాలీవుడ్ మూవీ చేరింది. అల్లు అరవింద్ సమర్పణలో అల్లు ఎంటర్‌టైన్మెంట్స్, మ్యాచ్ బాక్స్ షాట్స్ LLP సంయుక్తంగా నిర్మించిన హిందీ సినిమా త్రీ ఆఫ్ అజ్.
Updated on: Oct 28, 2023 | 1:14 PM

మెగా ఫ్యామిలీలో పెళ్లి సందడి మొదలైంది. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి వివాహం నవంబర్ 1న ఇటలీలో జరగనుంది. ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. అక్టోబర్ 30న కాక్‌టైల్ పార్టీ, 31న హల్దీ, మెహందీ కార్యక్రమాలు జరగనున్నాయి. తాజాగా ఈ వేడుక సంబంధించిన ఆహ్వాన పత్రిక వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

సౌత్ బ్యూటీ అమలా పాల్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు. ఈవెంట్ మేనేజర్ జగత్ దేశాయ్‌తో కొద్ది రోజులుగా రిలేషన్‌షిప్‌లో ఉన్న ఈ భామ, అతడితో ఏడడుగులు నడిచేందుకు రెడీ అవుతున్నారు. గురువారం అమలా పాల్ పుట్టిన రోజు సందర్భంగా జగత్, ఆమెకు ప్రపోజ్ చేస్తున్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు ఈ జంట.

యష్ రాజ్ ఫిలిం, నెటిఫ్లిక్స్ సంయుక్తంగా నిర్మించిన తొలి ప్రాజెక్ట్ ది రైల్వే మేన్. 1984లో జరిగిన భోపాల్ గ్యాస్ దుర్ఘటన నేపథ్యంలో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్‌లో మాధవన్, కేకే మీనన్, దివ్యేందు, బాబిల్ ఖాన్ లీడ్ రోల్స్‌లో నటించారు. ఈ వెబ్ సిరీస్ నవంబర్ 18న డిజిటల్ ఆడియన్స్‌కు అందుబాటులోకి రానుంది.

ప్రజెంట్ అన్ని ఇండస్ట్రీల్లో సీక్వెల్స్ ట్రెండ్ నడుస్తోంది. తాజాగా ఈ ట్రెండ్‌లోకి ఓ ఇంట్రస్టింగ్ బాలీవుడ్ మూవీ చేరింది. 2004లో ఘన విజయం సాధించిన ఖాకీ సినిమాకు సీక్వెల్‌ను రూపొందించే పనిలో ఉన్నారు మేకర్స్. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందని, వీలైనంత త్వరగా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి వచ్చే ఏడాది సినిమా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నామని వెల్లడించారు.

అల్లు అరవింద్ సమర్పణలో అల్లు ఎంటర్‌టైన్మెంట్స్, మ్యాచ్ బాక్స్ షాట్స్ LLP సంయుక్తంగా నిర్మించిన హిందీ సినిమా త్రీ ఆఫ్ అజ్. ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో షెఫాలీ షా, జైదీప్ అహ్లావత్ లీడ్ రోల్స్‌లో నటించారు. అవినాష్ అరుణ్ దర్శకత్వం వహించారు. నవంబర్ 3న రిలీజ్‌కు రెడీ అవుతున్న ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్.




