- Telugu News Photo Gallery Cinema photos Priyanka Chopra Wears Rs1.5 Crore Watch At Jio MAMI Mumbai Film Festival
Priyanka Chopra: జియో మామి ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రియాంక.. స్పెషల్ అట్రాక్షన్‌గా వాచ్.. ఎన్ని కోట్లో తెలుసా?
బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన ప్రియాంక చోప్రా ఇప్పుడు గ్లోబర్ రేంజ్‌లో పాపులారిటీ సొంతం చేసుకుంది. పలు హాలీవుడ్ సినిమాల్లో మెరుస్తోంది. అమెరికన్ పాప్ సింగర్ నిక్ జోనస్‌ను పెళ్లాడిన తర్వాత ఎక్కువగా కాలిఫోర్నియాకే పరిమితమైందీ అందాల తార.
Updated on: Oct 28, 2023 | 2:12 PM

1. బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన ప్రియాంక చోప్రా ఇప్పుడు గ్లోబర్ రేంజ్‌లో పాపులారిటీ సొంతం చేసుకుంది. పలు హాలీవుడ్ సినిమాల్లో మెరుస్తోంది. అమెరికన్ పాప్ సింగర్ నిక్ జోనస్‌ను పెళ్లాడిన తర్వాత ఎక్కువగా కాలిఫోర్నియాకే పరిమితమైందీ అందాల తార.

అయితే పండగలు, పర్వదినాలు, ప్రత్యేక దినాల్లో ఇండియాకు వస్తోంది ప్రియాంక చోప్రా. అలా తాజాగా ముంబై వేదికగా జరుగుతోన్న జియో మామి ఫిల్మ్ ఫెస్టివల్ 2023లో సందడి చేసిందీ గ్లోబల్ స్టార్.

ఈ ఈవెంట్‌కు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది ప్రియాంక. దీంతో అవి నెట్టింట తెగ వైరలవుతున్నాయి. రెడ్ కార్పెట్‌పై తన సతీమణి ఫొటోలు చూసి నిక్ జొనాస్ కూడా కామెంట్ చేశాడు.

కాగా ఈ ఈవెంట్‌కు లగ్జరీ వాచ్ ధరించి హాజరైంది ప్రియాంక. అందరి దృష్టి ఈ వాచ్ పైనే పడింది. ఆమె వాచ్ విలువ సుమారు రూ. 1.5 కోట్ల రూపాయలని తెలుస్తోంది. దీనిని 18 క్యారెట్ రోజ్ గోల్డ్ కేస్‌తో తయారుచేశారట.

కాగా జియో మామీ ఫిల్మ్ ఫెస్టివల్ కమిటీకి అధికారిక అధ్యక్షురాలి హోదాలో ఈ ఈవెంట్ కు హాజరైంది ప్రియాంక చోప్రా. ఓ అందమైన గౌను ధరించి రెడ్ కార్పెట్‌పై మెరిసి అందరి దృష్టిని ఆకర్షించింది.





























