- Telugu News Photo Gallery Cinema photos Tollywood Movie Update News on 28 10 2023 Telugu Entertainment Photos
Tollywood: కీడా కోలా ఓవర్సీస్ రిలీజ్ ఎప్పుడంటే..? | ఆకాశం దాటి వస్తావా అంటున్న యాష్ మాస్టర్..
కొరియోగ్రాఫర్ యష్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘ఆకాశం దాటి వస్తావా’. శశికుమార్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. నిర్మాత శిరీష్ సమర్పణలో దిల్ రాజు ప్రొడక్షన్స్ పతాకంపై హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా సినిమాలోని శృంగార అంటూ సాగే లిరికల్ సాంగ్ రిలీజ్ చేసారు మేకర్స్. చియాన్ విక్రమ్ హీరోగా పా రంజిత్ తెరకెక్కిస్తున్న పీరియాడిక్ యాక్షన్ సినిమా తంగలాన్..
Lakshminarayana Varanasi, Editor - TV9 ET | Edited By: Anil kumar poka
Updated on: Oct 28, 2023 | 7:05 PM

కొరియోగ్రాఫర్ యష్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘ఆకాశం దాటి వస్తావా’. శశికుమార్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. నిర్మాత శిరీష్ సమర్పణలో దిల్ రాజు ప్రొడక్షన్స్ పతాకంపై హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా సినిమాలోని శృంగార అంటూ సాగే లిరికల్ సాంగ్ రిలీజ్ చేసారు మేకర్స్.

చియాన్ విక్రమ్ హీరోగా పా రంజిత్ తెరకెక్కిస్తున్న పీరియాడిక్ యాక్షన్ సినిమా తంగలాన్. ఫస్ట్ లుక్, మేకింగ్ వీడియో విడుదలైన తర్వాత సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. హాలీవుడ్ రేంజ్ విజువల్స్‌తో ఈ సినిమా వస్తుంది. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసారు మేకర్స్. 2024, జనవరి 26న విడుదల కానుంది తంగలాన్.

వరుణ్ సందేశ్ హీరోగా ఆర్ఎన్ హర్షవర్ధన్ దర్శకత్వంలో ధనరాజ్, కాశీ విశ్వనాథ్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సస్పెన్స్ థ్రిల్లర్ ‘చిత్రం చూడర’. ఈ సినిమాలో శీతల్ భట్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ టీజీ విశ్వ ప్రసాద్ ఈ సినిమా టీజర్‌ను లాంచ్ చేశారు.

తరుణ్ భాస్కర్ నటిస్తూ తెరకెక్కిస్తున్న సినిమా కీడా కోలా. ఈ మధ్యే విడుదలైన ట్రైలర్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది. సినిమా నవంబర్ 3న విడుదల కానుంది. చైతన్య రావు, బ్రహ్మానందం, జీవన్ ఇందులో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను ఓవర్సీస్‌లో 400 స్క్రీన్స్‌లో నవంబర్ 2న విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు దర్శక నిర్మాతలు.

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా బోయపాటి శ్రీను తెరకెక్కించిన యాక్షన్ డ్రామా చిత్రం స్కంద. ఈ చిత్రంలో శ్రీలీల, సాయి మంజ్రేకర్ హీరోయిన్లుగా నటించారు. పాన్ ఇండియా మూవీగా వచ్చిన స్కంద థియేటర్లలో అంతగా ఆకట్టుకోలేదు. తాజాగా ఈ చిత్ర ఓటిటి రిలీజ్ డేట్ కన్ఫర్మ్ అయింది. నవంబర్ 2న ప్రముఖ ఓటిటిలో స్ట్రీమ్ కానుంది స్కంద.





























