కమల్ హాసన్, మణిరత్నం కాంబినేషన్‌లో 33 ఏళ్ళ తర్వాత వస్తున్న సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు జరిగాయి. పొన్నియన్ సెల్వన్ సినిమాతో ఫామ్‌లోకి వచ్చారు మణిరత్నం. అలాగే విక్రమ్‌తో కమల్ కూడా సూపర్ ఫామ్‌లో ఉన్నారు. ఈయన ప్రస్తుతం వినోద్ దర్శకత్వంలో నటిస్తున్నారు. ఇది సెట్స్‌పై ఉండగానే మరో సినిమాను ప్రకటించారు కమల్ హాసన్.