- Telugu News Photo Gallery Cinema photos Tollywood Director ram abbaraju next movie update Telugu Entertainment Photos
Tollywood Directors: హిట్టుకు ముందు ఓ మాట.. హిట్ వచ్చాక మరో మాట చెప్తున్న తెలుగు డైరెక్టర్స్.
ఒట్టేసి ఓ మాట.. ఒట్టేయకుండా ఓ మాట చెప్పనమ్మా అంటారు కదా ప్రభాస్ ఛత్రపతి సినిమాలో..! దీన్నే కాస్త మార్చి వాడుకుంటున్నారు ఇండస్ట్రీలో కొందరు దర్శకులు. హిట్టుకు ముందు ఓ మాట.. హిట్ వచ్చాక మరో మాట చెప్తున్నారు డైరెక్టర్స్. మీతోనే మా నెక్ట్స్ సినిమా నిర్మాతలకు మాటిచ్చి.. రాత్రికి రాత్రే మరో నిర్మాత దగ్గర తేలిపోతున్నారు. తాజాగా అలాంటి ఇష్యూనే మరోటి తెరపైకి వచ్చింది. ఇంతకీ ఏంటది..?
Updated on: Oct 28, 2023 | 7:06 PM

ఒట్టేసి ఓ మాట.. ఒట్టేయకుండా ఓ మాట చెప్పనమ్మా అంటారు కదా ప్రభాస్ ఛత్రపతి సినిమాలో..! దీన్నే కాస్త మార్చి వాడుకుంటున్నారు ఇండస్ట్రీలో కొందరు దర్శకులు. హిట్టుకు ముందు ఓ మాట.. హిట్ వచ్చాక మరో మాట చెప్తున్నారు డైరెక్టర్స్.

మీతోనే మా నెక్ట్స్ సినిమా నిర్మాతలకు మాటిచ్చి.. రాత్రికి రాత్రే మరో నిర్మాత దగ్గర తేలిపోతున్నారు. తాజాగా అలాంటి ఇష్యూనే మరోటి తెరపైకి వచ్చింది. ఇంతకీ ఏంటది..? హిట్ ఇచ్చిన దర్శకుడు అంటే ఇండస్ట్రీలో హాట్ కేక్ మాదిరి..!

ఎప్పుడెప్పుడు ఆయన్ని బుక్ చేసుకుందామా అని చూస్తుంటారు నిర్మాతలు. మరోవైపు దర్శకులు కూడా మంచి ఆఫర్ ఉన్న వైపు వెళ్తుంటారు. కానీ కొందరేమో ముందుగానే నిర్మాతలకు అగ్రీమెంట్ ఇచ్చి బుక్ అయిపోతుంటారు. తాజాగా సామజవరగమనా దర్శకుడు రామ్ అబ్బరాజు విషయంలో ఇదే జరుగుతుంది.

ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన సామజవరగమనా సంచలన విజయం సాధించింది. శ్రీ విష్ణు హీరోగా నటించిన ఈ చిత్రంతోనే రామ్ అబ్బరాజు అందరి దృష్టిలో పడ్డారు. ఈయన నెక్ట్స్ సినిమా శర్వానంద్‌తో లాక్ అయిపోయింది.

మైత్రి మూవీ మేకర్స్‌లోనే ఇది ఉండే ఛాన్స్ ఉంది. అయితే చివరి నిమిషంలో ఈ సినిమాపై లీగల్ ఇష్యూస్ వచ్చినట్లు ప్రచారం జరుగుతుంది. సామజవరగమనా చేస్తున్నపుడే అనిల్ సుంకర లేదంటే ఆ సినిమా నిర్మించిన హాస్య మూవీస్ రాజేష్ దండాతో మరో చేయాలనేది అగ్రిమెంట్ అని..

దాన్నిప్పుడు రామ్ అబ్బరాజు బ్రేక్ చేస్తున్నారనేది ఇష్యూ. ఆ మధ్య పరశురామ్‌కు ఇలాంటి సమస్యే వచ్చింది. గీతా ఆర్ట్స్‌కు సినిమా కమిటై.. 14 రీల్స్, దిల్ రాజు బ్యానర్స్‌కు మాటిచ్చారీయన. విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ అలా వస్తున్నదే. మొత్తానికి దర్శకుల కారణంగా నిర్మాతలకు తిప్పలు తప్పట్లేదు.




