- Telugu News Photo Gallery Cinema photos Sreeleela visited Kanakadurgamma temple in Vijayawada along with director Anil Ravipudi
Sreeleela: విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న శ్రీలీల.. ఫొటోస్ వైరల్
అందాల భామ శ్రీలీల ప్రస్తుతం టాలీవుడ్ లో బిజీ హీరోయిన్ గా మారిపోయింది. తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ క్రేజ్ ను సొంతం చేసుకుంది. కన్నడ ఇండస్ట్రీ నుంచి ఈ భామ టాలీవుడ్ కి వచ్చింది. పెళ్లి సందడి సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించింది శ్రీలీల. తొలి సినిమాతోనే తన అందం, చలాకీ తనంతో ప్రేక్షకులను కట్టిపడేసింది ఈ క్యూటీ.
Updated on: Oct 29, 2023 | 8:28 AM

అందాల భామ శ్రీలీల ప్రస్తుతం టాలీవుడ్ లో బిజీ హీరోయిన్ గా మారిపోయింది. తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ క్రేజ్ ను సొంతం చేసుకుంది. కన్నడ ఇండస్ట్రీ నుంచి ఈ భామ టాలీవుడ్ కి వచ్చింది.

పెళ్లి సందడి సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించింది శ్రీలీల. తొలి సినిమాతోనే తన అందం, చలాకీ తనంతో ప్రేక్షకులను కట్టిపడేసింది ఈ క్యూటీ.

ఇక ఇప్పుడు టాలీవుడ్ లో వరుస సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడుపుతోంది. తాజాగా నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన భగవంత్ కేసరి సినిమాలో నటించి హిట్ అందుకుంది.

ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. ఈ మూవీలో బాలయ్య కూతురిగా కనిపించింది శ్రీలీల .. సినిమాలో బాలకృష్ణతో సమానమైన పాత్రలో కనిపించింది.

ఇక భగవంత్ కేసరి సినిమా సూపర్ హిట్ కావడంతో దర్శకుడు అనిల్ రావిపూడి తో కలిసి విజయవాదం అమ్మవారిని దర్శించుకుంది శ్రీలీల. ఇందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.




