kartik Masam: కార్తీక మాసంలో చేసే స్నానం, దానం అత్యంత విశిష్టం.. ఈ నెలలో తులసి పూజ ఎలా చేయాలంటే..
కార్తీక మాసం సనాతన ధర్మంలో చాలా ముఖ్యమైనది. ఈ నెలలో చేసే స్నానానికి, దానానికి ప్రత్యేకంగా పరిగణించబడుతుంది. ఈ మాసంలో తులసి పూజకు కూడా చాలా ప్రాముఖ్యత ఉంది. తులసిలో లక్ష్మీదేవి నివసిస్తుందని నమ్మకం. అటువంటి పరిస్థితిలో కార్తీక పౌర్ణమి రోజున ఆచారాల ప్రకారం తులసిని పూజించడం ద్వారా లక్ష్మీదేవి ప్రసన్నురాలవుతుందని విశ్వాసం. కార్తీక మాసంలో తులసి పూజ చేసే పద్దతి, ప్రాముఖ్యతను గురించి తెలుసుకుందాం.
మాసాల్లో కార్తీక మాసం అత్యంత విశిష్టమైంది. శివ కేశవులను పూజించే ఈ కార్తీక మాసం హిందూ మతంలో ఉత్తమమైనదిగా పరిగణించబడుతుంది. ఆశ్వియుజ మాసం తర్వాత దీపావళి నుంచి కార్తీక మాసం మొదలు అవుతుంది. ఈ నెల రోజులు ప్రతి రోజూ శుభప్రదమే.. కార్తీక సోమవారం, కార్తీక పూర్ణిమ మరింత శుభప్రదమని నమ్మకం. ఈ కార్తీక మాసం సనాతన ధర్మంలో చాలా ముఖ్యమైనది. ఈ నెలలో చేసే స్నానానికి, దానానికి ప్రత్యేకంగా పరిగణించబడుతుంది. ఈ మాసంలో తులసి పూజకు కూడా చాలా ప్రాముఖ్యత ఉంది. తులసిలో లక్ష్మీదేవి నివసిస్తుందని నమ్మకం. అటువంటి పరిస్థితిలో కార్తీక పౌర్ణమి రోజున ఆచారాల ప్రకారం తులసిని పూజించడం ద్వారా లక్ష్మీదేవి ప్రసన్నురాలవుతుందని విశ్వాసం. కార్తీక మాసంలో తులసి పూజ చేసే పద్దతి, ప్రాముఖ్యతను గురించి తెలుసుకుందాం.
కార్తీక మాసం తులసి పూజ విధానం
- ముందుగా తులసి మొక్కను శుభ్రమైన ప్రదేశంలో ఏర్పాటు చేసి అనంతరం ఆ ప్రదేశాన్ని అందంగా ముగ్గులతో అలంకరించండి.
- అలంకరించిన తరువాత తులసి మొక్క దగ్గర స్వస్తిక్ ను వేయండి.
- తులసి దగ్గర ముగ్గుతో పద్మం, శంఖం, చక్రం, కన్నయ్య పాదాల చిత్రాన్ని వేయండి.
- అలాగే తులసి మొక్క దగ్గర ఉసిరి మొక్కను ఉంచండి.
- ఉసిరి విష్ణువు నివాసం అని నమ్ముతారు.
- ఇప్పుడు తులసి మొక్కకు నెయ్యి దీపం వెలిగించి ధూపం వేసి తర్వాత తులసిని ఆవాహన చేయండి.
- అనంతరం తులసి మొక్కకు కుంకుమ, పసుపు, చందనంతో పూజ చేసి నైవేద్యాన్ని సమర్పించండి. ఎరుపు లేదా పసుపు రంగు దుస్తులను సమర్పించండి.
- ఇప్పుడు తులసి చుట్టూ దీపాలను వెలిగించండి. ఇలా నెల రోజులూ ఉదయం, సాయంత్రం తులసి దగ్గర దీపం వెలిగించండి.
కార్తీక మాసంలో తులసిని ఎందుకు పూజిస్తారంటే?
హిందూ సనాతన ధర్మంలో తులసిని చాలా పవిత్రంగా.. గౌరవప్రదంగా పరిగణిస్తారు. తులసిని పూజించడానికి కార్తీక మాసం అత్యంత ప్రత్యేకమైనది. తులసి మొక్కలో లక్ష్మీదేవి నివసిస్తుందని నమ్ముతారు. అందుకే కార్తీకమాసంలో తులసి దగ్గర దీపం వెలిగించడం వల్ల సంపదలకు అధిదేవత అయిన లక్ష్మీదేవి సంతసించి భక్తులపై తన అపారమైన అనుగ్రహాన్ని కురిపిస్తుంది. కర్మ, అర్థ, మోక్షాలను అందించే మాసమే కార్తీకమాసమని పురాణాలలో వర్ణించబడింది. అటువంటి పరిస్థితిలో ఈ సమయంలో తులసిని పూజించడం శుభప్రదంగా పరిగణించబడుతుంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు.