IRCTC: జ్యోతిర్లింగ దర్శనం మరింత సులువు.. తక్కువ ఖర్చులోనే 6 రోజుల టూర్ ప్యాకేజీ.
ఎలాంటి ఇబ్బంది లేకుండా రెండు జ్యోతిర్లింగాలను దర్శించుకునే అవకాశం కల్పిస్తోంది ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC). మధ్యప్రదేశ్‌లో ఉన్న ఉజ్జయిన మహా కాలేశ్వర ఆలయం, ఓంకారేశ్వర ఆలయాలను సందర్శించుకునే అవకాశాన్ని ఐఆర్‌సీటీసీ కల్పిస్తోంది. ఈ రెండు ఆలయాలతో పాటు మరికొన్ని ఆలయాలను సందర్శించుకోవచ్చు. 'మధ్యప్రదేశ్ జ్యోతిర్లింగ దర్శన్' అనే పేరుతో...
జ్యోతిర్లింగాలను దర్శించుకోవాలని చాలా మందికి ఉంటుంది. జీవితంలో ఒక్కసారైనా ఈ పుణ్యక్షేత్రాలను దర్శించుకోవాలని కోరుకుంటుంటారు. అయితే ప్రయాణం ఇబ్బందితో కూడుకుని ఉండడం, భాష తెలియని ఇతర రాష్ట్రాల్లో ఉన్న జ్యోతిర్లింగాలను దర్శించుకోవడానికి ఇబ్బందులు పడుతుంటారు.
అయితే ఇలాంటి వారి కోసమే ఎలాంటి ఇబ్బంది లేకుండా రెండు జ్యోతిర్లింగాలను దర్శించుకునే అవకాశం కల్పిస్తోంది ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC). మధ్యప్రదేశ్‌లో ఉన్న ఉజ్జయిన మహా కాలేశ్వర ఆలయం, ఓంకారేశ్వర ఆలయాలను సందర్శించుకునే అవకాశాన్ని ఐఆర్‌సీటీసీ కల్పిస్తోంది. ఈ రెండు ఆలయాలతో పాటు మరికొన్ని ఆలయాలను సందర్శించుకోవచ్చు. ‘మధ్యప్రదేశ్ జ్యోతిర్లింగ దర్శన్’ అనే పేరుతో ఈ టూర్ ప్యాకేజీని అందిస్తోంది. టూర్‌కు సంబంధించిన పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి..
టూర్ ఇలా సాగుతుంది…
* ప్రతి బుధవారం మధ్యప్రదేశ్‌కు రైలు అందుబాటులో ఉంటుంది. నవంబర్ 1వ తేదీ నుంచి టికెట్లు బుక్ చేసుకోవచ్చు. కాచిగూడ నుంచి ఈ రైలు బయలు దేరుతుంది. కాజీపేట జంక్షన్‌లో కూడా ఈ రైలు ఆగుతుంది.
* మొదటిరోజు కాచిగూడలో సాయంత్రం 4.40 గంటలకు 12707 నెంబర్ గల సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ రైలు బయలుదేరుతుంది.
* రెండో రోజు ఉదయం 8:15 గంటలకు భోపాల్ రైల్వే స్టేషన్‌కు చేరుకుంటారు. అనంతరం హోటల్‌లో బస చేయాల్సి ఉంటుంది. కాసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత సాంచి స్థూపం చూడడానికి తీసుకెళ్తారు. అనంతరం భోపాల్‌కు చేరుకొని అక్కడి ట్రైబల్ మ్యూజియంను చూపిస్తారు. రాత్రి భోపాల్‌లనే బస చేయాల్సి ఉంటుంది.
* ఇక మూడో రోజు ఉదయం టిఫిన్ చేసిన తర్వాత ఉజ్జయిని బయలుదేరుతారు. అక్కడ శ్రీ మహాకాళేశ్వర ఆలయంతో పాటు.. హరసిద్ధి, మంగళనాథ్, నవగ్రహ శని మందిరం, శ్రీ చింతామన్ గణేష్, రామ్ ఘాట్, శ్రీ గఢ్కాళికా ఆలయాలను సందర్శించుకుంటారు. రాత్రి అక్కడే బస ఉంటుంది.
* నాల్గో రోజు ఉదయం టిఫిన్ చేశాక ఓంకారేశ్వర్‌కు వెళ్తారు. అక్కడ ఓంకారేశ్వర దేవాలయం, నర్మదా ఘాట్‌లను సందర్శించుకున్న తర్వాత ఓంకారేశ్వర్‌లోనే రాత్రి బస చేయాల్సి ఉంటుంది. లేదా అదే రోజు రాత్రి ఇందౌర్‌కు వెళ్తారు.
* ఇక 5వ రోజు టిఫిన్ పూర్తికాగానే మహేశ్వరానికి బయల్దేరుతారు. అక్కడ అహల్యా దేవి కోట, మండూ ఫోర్ట్ అందాల్ని వీక్షించి తిరిగి ఇందౌర్‌కి పయనమవుతారు. అనంతరం హైదరాబాద్ తిరుగు ప్రయాణం ప్రారంభమవుతుంది. రాత్రి 8 గంటలకు యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్ రైలు (ట్రైన్ నెం: 19301) బయలు దేరుతుంది. ఆరో రోజు రాత్రి 10 గంటలకు కాచిగూడ రైల్వే స్టేషన్‌కు చేరుకోవడంతో యాత్ర పూర్తవుతుంది.
ఛార్జీలు ఎలా ఉంటాయంటే..
* ఒక్కో ప్రయాణికుడికి సింగిల్ రూమ్ షేరింగ్ అయితే రూ. 37,810, ట్విన్ షేరింగ్‌కు రూ. 21,150, ట్రిపుల్ షేరింగ్‌కు రూ. 16,390గా నిర్ణయించారు. 5 నుంచి 11 ఏళ్ల మధ్య చిన్నారులకు బెడ్‌తో అయితే రూ. 12,390, బెడ్ లేకుండా అయితే రూ. 10,500గా టికెట్‌ను నిర్ణయించారు.
* ఇక స్లీపర్ బెర్త్‌లో సింగిల్ షేరింగ్ రూమ్‌కు రూ. 35,320, ట్విన్ షేరింగ్‌కు రూ. 18,660, ట్రిపుల్ షేరింగ్‌కు రూ. 13,900గా ఉండగా, 5 నుంచి 11 ఏళ్ల మధ్య చిన్నారులకు బెడ్‌తో అయితే రూ. 9,900, బెడ్ లేకుండా అయితే రూ. 8,010గా చెల్లించాలి.
* నలుగురు నుంచి ఆరుగులు కలిసి బుక్ చేసుకుంటే ఛార్జీలు వేరేలా ఉంటాయి. డబుల్ షేరింగ్‌కు థర్డ్ ఏసీలో రూ. 18,850, ట్రిపుల్ షేరింగ్‌కు రూ. 16,020 ఉంటుంది. 5 నుంచి 11 ఏళ్ల చిన్నారులకు బెడ్‌తో అయితే రూ. 12,390, బెడ్‌తో అయితే రూ. 10,500గా చార్జీలు ఉన్నాయి.
* స్లీపర్ బెర్త్‌లో డబుల్ షేరింగ్‌కు రూ. 16,360, ట్రిపుల్ షేరింగ్‌కు రూ. 13,530 చెల్లించాలి. ఇక 5 నుంచి 11 ఏళ్ల మధ్య చిన్నారులకు బెడ్‌తో అయితే రూ. 9,900, బెడ్ లేకుండా అయితే రూ. 8,010 చెల్లించాల్సి ఉంటుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..