Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కుక్కలు రాత్రిపూట ఎందుకు ఏడుస్తాయి..? ఇది అపశకునమా..! అసలు మర్మమేంటో తెలుసా..?

ఇంట్లో పెంపుడు కుక్కలు, వీధి కుక్కలు ఏడిస్తే..అశుభం అని. ఎవరైనా చనిపోతారనే నమ్మకం చాలా మందిలో ఉంటుంది. అయితే దీని వెనుక ఉన్న శాస్త్రీయ కారణాన్ని మనం వెతికితే విశ్వాసాల ఆధారంగా మనకు ఏమీ కనిపించదు. ఎలాంటి సమాధానం లభించదు. అయితే, అసలు రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయో తెలిస్తే మీరు ఎప్పటికి భయపడరు.. జంతువులు ముఖ్యంగా కుక్కలు చలికాలంలో ఎక్కువగా ఏడుస్తాయని నిపుణులు చెబుతున్నారు.

కుక్కలు రాత్రిపూట ఎందుకు ఏడుస్తాయి..? ఇది అపశకునమా..! అసలు మర్మమేంటో తెలుసా..?
Dogs Crying
Follow us
Jyothi Gadda

|

Updated on: Oct 27, 2023 | 4:20 PM

రాత్రిపూట కుక్కల ఏడుపు మీరు తరచుగా వినే ఉంటారు. కుక్కలు రాత్రిపూట తమ చుట్టూ ఎక్కడైనా ఆత్మలు కనిపిస్తే ఏడుస్తాయని పెద్దలు చెబుతుంటారు. ఇంట్లో పెంపుడు కుక్కలు, వీధి కుక్కలు ఏడిస్తే..అశుభం అని. ఎవరైనా చనిపోతారనే నమ్మకం చాలా మందిలో ఉంటుంది. అయితే దీని వెనుక ఉన్న శాస్త్రీయ కారణాన్ని మనం వెతికితే విశ్వాసాల ఆధారంగా మనకు ఏమీ కనిపించదు. ఎలాంటి సమాధానం లభించదు. అయితే, అసలు రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయో తెలిస్తే మీరు ఎప్పటికి భయపడరు.. జంతువులు ముఖ్యంగా కుక్కలు చలికాలంలో ఎక్కువగా ఏడుస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే అవి చలికి తట్టుకోలేక ఏడుస్తుంటాయి. ఇది కాకుండా అవి ఇతర కుక్కలకు సందేశాలను పంపడం కూడా మరొక కారణం కావచ్చు అంటున్నారు.

మనుషుల్లాగే కుక్కలకు కూడా భావోద్వేగాలు కలిగి ఉంటాయి. వాటికి కలిగే బాధ, కోపం, ఆవేదన, ఆందోళనను ఇలా శోకం పెట్టి ఏడవడం ద్వారా చూపిస్తాయని పరిశోధకులు చెబుతున్నారు. అలాగే, పగటిపూట కుక్కకు గాయమైతే, చలికి రాత్రి దాని నొప్పి పెరుగుతుంది. దాంతో అవి నొప్పిని భరించలేక బిగ్గరగా ఏడవడం ప్రారంభిస్తారు. ఈ కారణాలే కాకుండా, కుక్కలు బాగా ఆకలితో ఉన్నప్పుడు కూడా ఏడుస్తాయి. మరోవైపు శీతాకాలంలో రాత్రి సమయం ఎక్కువగా ఉంటుంది.అటువంటి పరిస్థితిలో కుక్కలకు తినడానికి ఏమీ లభించనప్పుడు, అవి ఆకలితో ఏడుపు ప్రారంభిస్తాయి. అంతేగానీ, కుక్కలు ఏడిస్తే మనుషులు చనిపోతారన్న మాటల వెనుక ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని చెబుతున్నారు పరిశోధకులు. ఒకవేళ అలా జరిగితే అది కేవలం యాధృచ్ఛికం మాత్రమేని అంటున్నారు.

అంతేకాదు.. కుక్కలు తమ పిల్లలు, లేదా తల్లికి దూరమైనప్పుడు కూడా ఏడుస్తాయి. కుక్కలు కూడా తమ కుటుంబం, లేదంటే మందగానే జీవించే జంతువులు. వీధి కుక్కలను వాటి గుంపు నుండి వేరు చేసినప్పుడు, లేదంటే పెంపుడు కుక్క దాని యజమాని నుండి వేరైనప్పుడు అవి సాధారణంగా రాత్రిపూట బిగ్గరగా అరవడం, ఏడవడం ప్రారంభిస్తాయి.

ఇవి కూడా చదవండి

కుక్కలను విశ్వాసానికి ప్రతిరూపంగా బావిస్తారు. అంతేకాదు.. కుక్కలకు అతీంద్రియ శక్తులు ఉన్నాయని కూడా నమ్ముతారు చాలా మంది. మనం చూడలేని నెగిటివ్ ఎనర్జీ లను కూడా కుక్కలు చూస్తాయని చెబుతుంటారు కొందరు. కానీ, నిపుణుల అభిప్రాయం ప్రకారం, వయస్సు పెరగడం కూడా కుక్కల ఏడుపుకి కారణం అంటున్నారు. పెరుగుతున్న వయస్సు కారణంగా కుక్కలలో భయం భావన పెరుగుతుంది. అటువంటి పరిస్థితిలో అవి రాత్రిపూట ఒంటరిగా ఉన్నప్పుడు ఏడుపు ప్రారంభిస్తాయి. ఒంటరిగా అనుభూతి చెందితే కూడా కుక్కలు ఏడుస్తుంటాయి.

మరిన్ని ట్రెండింగ్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..