జై హనుమాన్‌..! గాలిలో ఎగురుతున్న ‘ఆంజనేయుడి డ్రోన్’ సోషల్ మీడియాలో వైరల్… చూస్తే..

డ్రోన్‌ సాయంతో విత్తనాలు చల్లుకోవడం నుంచి ఎరువులు, పురుగు మందులు వేయడం, పంటల అంచనా, పంటలకు అందించాల్సిన పోషకాలు అందించడంతో పాటు పలు అంశాల్లో ఈ టెక్నాలజీ ప్రయోజనకారిగా మారింది. అంతేకాదు.. కోవిడ్‌ కాలంలో చాలా చోట్ల డ్రోన్‌ సాయంతో బాధితులకు కావాల్సిన మందులను కూడా సరఫరా చేశారు. అటు దేశ సరిహద్దులో కూడా డ్రోన్‌లను వినియోగిస్తూ దేశ భద్రతలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. అయితే, ఇలాంటి సాంకేతికత, డ్రోన్‌ వాడకం ఇప్పుడు మతపరమైన కార్యకలాపాలలో కూడా ఉపయోగించుకుంటున్నారు.

జై హనుమాన్‌..! గాలిలో ఎగురుతున్న 'ఆంజనేయుడి డ్రోన్' సోషల్ మీడియాలో వైరల్... చూస్తే..
Hanuman Drone
Follow us
Jyothi Gadda

|

Updated on: Oct 27, 2023 | 5:01 PM

ఇది డ్రోన్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగం. అవును, 21వ శతాబ్దంలో అద్భుతమైన ఆవిష్కరణలు జరుగుతున్నాయి. ఈ ఆవిష్కరణలు జీవితాన్ని చాలా సులభతరం చేశాయి., అవి మన జీవనశైలిని చాలా వరకు మార్చాయి. ప్రస్తుతం విరివిగా అందుబాటులోకి వచ్చిన డ్రోన్‌ టెక్నాలజీ అన్ని రంగాలు, అన్ని విభాగాల్లో విస్తృతంగా వ్యాపించింది. వ్యవసాయ రంగం మొదలు, దేశ సంరక్షణలో కూడా విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతోంది. డ్రోన్‌ సాయంతో విత్తనాలు చల్లుకోవడం నుంచి ఎరువులు, పురుగు మందులు వేయడం, పంటల అంచనా, పంటలకు అందించాల్సిన పోషకాలు అందించడంతో పాటు పలు అంశాల్లో ఈ టెక్నాలజీ ప్రయోజనకారిగా మారింది. అంతేకాదు.. కోవిడ్‌ కాలంలో చాలా చోట్ల డ్రోన్‌ సాయంతో బాధితులకు కావాల్సిన మందులను కూడా సరఫరా చేశారు. అటు దేశ సరిహద్దులో కూడా డ్రోన్‌లను వినియోగిస్తూ దేశ భద్రతలో కీలక పాత్ర పోషిస్తున్నాయి.

అయితే, ఇలాంటి సాంకేతికత, డ్రోన్‌ వాడకం ఇప్పుడు మతపరమైన కార్యకలాపాలలో కూడా ఉపయోగించుకుంటున్నారు. అది ఆలయ నిర్మాణం కావచ్చు.. లేదా గుళ్లు, గోపురాల్లో లైటింగ్, సంగీతం మొదలైన వాటి ద్వారా పాత్రల ప్రదర్శన కావచ్చు. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ క్లిప్‌లో మీరు గాలిలో ఎగురుతున్న ‘శ్రీ ఆంజనేయ’ విగ్రహాన్ని చూడవచ్చు. వాస్తవానికి హనుమాన్ విగ్రహాన్ని ఎవరో శాస్త్రోక్తంగా తయారు చేసిన డ్రోన్‌కు అతికించారు. ఆ తర్వాత ‘ఆంజనేయుడు’ గాలిలో ఎగురుతూ కనిపించాడు. ఈ వీడియోని మైక్రోబ్లాగింగ్ సైట్ ‘X’ లో షేర్‌ చేశారు. దాంతో ఈ వీడియో వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో విస్తృతంగా షేర్ చేయబడుతోంది.

ఇవి కూడా చదవండి

ఈ వీడియోని X హ్యాండిల్ @sky_phd పోస్ట్ చేసారు. ఇది కేవలం 20 సెకన్ల నిడివి గల వీడియో, ఇందులో ‘హనుమాన్’ విగ్రహాన్ని డ్రోన్‌కు అటాచ్‌ చేసి ఎగురవేస్తున్నారు. దాంతో హనుమంతుడు గాల్లో ఎగురుతున్నట్టుగా ఉంది. అది చూసిన జనాలు ఆశ్చర్యపోతున్నారు.. గుంపులుగా రోడ్లపై గుమిగూడి వింతగా చూస్తున్నారు. ‘హనుమాన్ డ్రోన్’ గాలిలో ఎగరగానే అక్కడి వారంతా జై హనుమాన్‌ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేయడం ప్రారంభించారు. ఇప్పటివరకు ఈ పోస్ట్‌కి 2 లక్షల 30 వేలకు పైగా వీక్షణలు, వేల సంఖ్యలో లైక్‌లు వచ్చాయి. చాలా మంది వినియోగదారులు ఈ వీడియోపై రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు. ఈ వీడియో ఛత్తీస్‌గఢ్‌లోని అంబికాపూర్‌కి చెందినదిగా తెలిసింది. అక్కడ, దసరా ఉత్సవాల సందర్భంగా డ్రోన్‌తో ‘హనుమాన్’ విగ్రహాన్ని ఎగురవేశారు.

ఇకపోతే, సోషల్ మీడియాలో వీడియో వైరల్‌ కావటంతో చాలా మంది వినియోగదారులు దీనిపై స్పందించారు. చాలా మంది వినియోగదారులు తమ భిన్నమైన అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..