- Telugu News Photo Gallery Fennel seeds with coconut oil turns white hair permanently black Telugu News
హెయిర్ డై అవసరం లేదు… ఇంట్లో తయారు చేసిన ఈ నూనె చాలు.. తెల్లజుట్టును ఎప్పటికీ నల్లగా చేస్తుంది.!
తెల్ల జుట్టు సమస్యతో బాధపడేవారు తరచుగా హెయిర్ డైస్‌ని వాడుతుంటారు. చాలా మంది మార్కెట్‌లో లభించే కెమికల్ హెయిర్ ప్రొడక్ట్స్ వాడుతూ ఎంతో డబ్బు ఖర్చుపెడుతుంటారు. కెమికల్ హెయిర్ కలర్ వాడటం వల్ల రకరకాల జుట్టు సమస్యలు కూడా వస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఈ మిశ్రమాన్ని తయారు చేసి జుట్టుకు పట్టించడం వల్ల రకరకాల జుట్టు సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.
Updated on: Oct 27, 2023 | 6:40 PM

తెల్ల జుట్టు సమస్యతో బాధపడేవారు తరచుగా హెయిర్ డైస్‌ని వాడుతుంటారు. చాలా మంది మార్కెట్‌లో లభించే కెమికల్ హెయిర్ ప్రొడక్ట్స్ వాడుతూ ఎంతో డబ్బు ఖర్చుపెడుతుంటారు. కెమికల్ హెయిర్ కలర్ వాడటం వల్ల రకరకాల జుట్టు సమస్యలు కూడా వస్తాయని నిపుణులు చెబుతున్నారు.

కొబ్బరినూనె, సోంపు గింజల మిశ్రమం తెల్లజుట్టు సమస్యల నుండి సులభంగా ఉపశమనం కలిగిస్తుంది. ఈ మిశ్రమాన్ని తయారు చేసి జుట్టుకు పట్టించడం వల్ల రకరకాల జుట్టు సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.

ఇందుకోసం ముందుగా సోంపు గింజల పొడిని తయారు చేసుకోవాలి. తర్వాత కొబ్బరి నూనెలో వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించి 25 నుంచి 30 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. అప్పుడు స్నానం చేయండి. ఇలా చేయడం వల్ల తెల్ల జుట్టు సులభంగా నల్లగా మారుతుంది.

సొంపు నూనెలో ఉండే గుణాలు చాలా రకాల జుట్టు సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. తెల్ల జుట్టును నల్లగా చేసేందుకు కీలక పాత్ర పోషిస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. సోంపు నూనెలో యాంటీఆక్సిడెంట్లు, ఫైటోన్యూట్రియెంట్లు అధిక పరిమాణంలో లభిస్తాయి.

సొంపు నూనెను వినియోగించడం వల్ల తీవ్ర జుట్టు సమస్యల నుంచి కూడా సులభంగా ఉపశమనం లభిస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. తరచుగా జుట్టు సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజు ఈ నూనెను వినియోగిస్తే త్వరలోనే మంచి ఫలితాలను చూస్తారు.




