Health tips: మీరు కూడా ఇలాంటి లక్షణాలతో ఇబ్బంది పడుతున్నారా..? అది విటమిన్ బి12 లోపం కావొచ్చు..

శరీరం తనంతట తాను బీ12 ఉత్పత్తి చేయలేదు. అందువల్ల ఆహారం ద్వారానే మనం బీ12 విటమిన్ తీసుకోవాల్సి ఉంటుంది. విటమిన్ B12 మాంసం, చేపలు, గుడ్లు, పాల ఉత్పత్తులు వంటి జంతువుల ఆధారిత ఆహారాలలో లభిస్తుంది. ఈ బీ 12 విటమిన్ కాలేయంలో ఐదేళ్లపాటు నిల్వ ఉంటుంది. ఈ నిల్వ తగ్గినప్పుడు విటమిన్ లోపం ఏర్పడుతుంది. దాని ఎఫెక్ట్‌ కారణంగా మీ ఆరోగ్యం దెబ్బతింటుంది.

Health tips: మీరు కూడా ఇలాంటి లక్షణాలతో ఇబ్బంది పడుతున్నారా..? అది విటమిన్ బి12 లోపం కావొచ్చు..
Vitamin B12 Deficiency
Follow us
Jyothi Gadda

|

Updated on: Oct 28, 2023 | 4:07 PM

విటమిన్ బి12 లోపం అనేది నేడు చాలా మందిలో ఒక సాధారణ సమస్యగా మారిపోయింది. విటమిన్ B12 ఒక ముఖ్యమైన పోషకం. ఇది శరీరంలో ఎర్ర రక్త కణాలు, DNA ఏర్పడటానికి కూడా సహాయపడుతుంది. అలాగే, విటమిన్ B12 మెదడు, నరాల కణాలను బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. విటమిన్ బి12 లోపం వల్ల చర్మ సమస్యలు, కంటి ఆరోగ్యం, నరాల సంబంధిత సమస్యలు వంటి అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఈ పోషకం DNA, ఎర్ర రక్త కణాల సంశ్లేషణలో సహాయపడుతుంది. ఒక వయోజన వ్యక్తికి రోజుకు 2.4 మైక్రోగ్రాముల విటమిన్ B12 అవసరం.

శరీరంలోని వివిధ అవయవాల పనితీరుపై ఇది ప్రభావం చూపిస్తుంది. విటమిన్ B12 లోపం వల్ల కనిపించే లక్షణాలు అలసట, బలహీనత, చర్మం పాలిపోవడం, మలబద్ధకం, అతిసారం, ఆకలి లేకపోవడం, తిమ్మిరి, నరాల సమస్యలు, నడవడంలో ఇబ్బంది, మూడ్ మార్పులు, జ్ఞాపకశక్తి తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. మీలో హుషారు తగ్గినా, గతంలో ఉన్నంత హుషారుగా లేకపోయినా కూడా ఈ విటమిన్‌ లోపం ఉన్నట్టుగా మీరు గ్రహించాలి. అంతేకాదు.. మీకు ఆత్మ విశ్వాసం తగ్గినట్టు అనిపించినా, నిరాశ, నిస్సహాయత అనిపిస్తే విటమిన్ బీ12 లోపం ఉన్నట్టు గమనించాలి. శరీరం తనంతట తాను బీ12 ఉత్పత్తి చేయలేదు. అందువల్ల ఆహారం ద్వారానే మనం బీ12 విటమిన్ తీసుకోవాల్సి ఉంటుంది. విటమిన్ B12 మాంసం, చేపలు, గుడ్లు, పాల ఉత్పత్తులు వంటి జంతువుల ఆధారిత ఆహారాలలో లభిస్తుంది. ఈ బీ 12 విటమిన్ కాలేయంలో ఐదేళ్లపాటు నిల్వ ఉంటుంది. ఈ నిల్వ తగ్గినప్పుడు విటమిన్ లోపం ఏర్పడుతుంది. దాని ఎఫెక్ట్‌ కారణంగా మీ ఆరోగ్యం దెబ్బతింటుంది.

విటమిన్‌ బి 12 సమస్యను ఎలా పరిష్కరించాలి..?

ఇవి కూడా చదవండి

ఒక వ్యక్తి శరీరంలో విటమిన్ B12 చాలా తక్కువగా ఉంటే, అది మందులు, సప్లిమెంట్ల ద్వారా తీసుకోవచ్చు..దాంతో పాటుగా సమతుల్య ఆహారం తీసుకోవడం ద్వారా శరీరం విటమిన్ B12 ను సమకూర్చుకోగలదు. పాలు, మజ్జిగ, పెరుగు, జున్ను వంటి పాల ఉత్పత్తులలో విటమిన్ బి12 ఉంటుంది. సోయా, బాదం పాలు కూడా మీ ఆహారంలో చేర్చుకోవటం వల్ల మీకు విటమిన్‌ బి12 లభిస్తుందది. ఓట్స్, కార్న్ ఫ్లేక్స్ వంటి తృణధాన్యాలలో విటమిన్ బి12 పుష్కలంగా ఉంటుంది. విటమిన్ B12 అవసరాలను నిర్వహించడానికి తృణధాన్యాలు అల్పాహారంలో చేర్చవచ్చు.

అయితే, విటమిన్ సప్లిమెంట్స్ తీసుకునేముందు విటమిన్ బి 12 లోపం ఉందా లేదా విషయమై ముందుగా వైద్యులను సంప్రదించి తగిన టెస్టులు చేయించుకోవటం మంచిది. వైద్యుడి సలహా మేరకు మాత్రమే ఇలాంటి విటమిన్‌ సప్లిమెంట్లను వాడటం మంచిది.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..