AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Skin problems: కడుపులో సమస్యలుంటే.. ముఖంపై ఈ లక్షణాలు కనిపిస్తాయ్‌..! నిర్లక్ష్యం చేయకండి..

తామర కూడా కడుపు ఆరోగ్య సమస్యలలో ఒక భాగమే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. పొట్టలో మంచి బ్యాక్టీరియా సమతుల్యం అదుపుతప్పినప్పుడు కూడా తామర వచ్చే అవకాశం ఉంది. తామర లక్షణాలు అసాధారణంగా చర్మం పొడిబారడం, దురద, పొక్కులు, చర్మం పొరలుగా ఏర్పడటం వంటిది జరుగుతుంది. ఇది శరీరంలో ఎక్కడైనా సంభవించవచ్చు. శరీరానికి అవసరం లేని పదార్ధాలు, అలాగే టాక్సిన్స్, పొట్ట జీర్ణించుకోలేక బయటకు పంపలేకపోతే చర్మం ద్వారా విసర్జించబడతాయి.

Skin problems: కడుపులో సమస్యలుంటే.. ముఖంపై ఈ లక్షణాలు కనిపిస్తాయ్‌..! నిర్లక్ష్యం చేయకండి..
Skin Problems
Jyothi Gadda
|

Updated on: Oct 28, 2023 | 3:17 PM

Share

పొట్ట సమస్యలు చర్మాన్ని కూడా ప్రభావితం చేస్తాయి. అయితే ఈ విషయం చాలా మందికి తెలియదు.. కానీ, ఇది నిజమేనంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఎలాగంటే కడుపు ఆరోగ్యం మన శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కూడా అనేక విధాలుగా ప్రభావితం చేస్తుంది. ఒంటిపై దురదలు, గజ్జి వాటి గురించి ఎప్పుడైనా విన్నారా? తామర అనేక కారణాల వల్ల సంభవించవచ్చు. కానీ తామర కూడా కడుపు ఆరోగ్య సమస్యలలో ఒక భాగమే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. పొట్టలో మంచి బ్యాక్టీరియా సమతుల్యం అదుపుతప్పినప్పుడు కూడా తామర వచ్చే అవకాశం ఉంది. తామర లక్షణాలు అసాధారణంగా చర్మం పొడిబారడం, దురద, పొక్కులు, చర్మం పొరలుగా ఏర్పడటం వంటిది జరుగుతుంది. ఇది శరీరంలో ఎక్కడైనా సంభవించవచ్చు.

మొటిమలు కడుపు నొప్పి కారణంగా సంభవించే మరొక చర్మ సమస్య. పైన పేర్కొన్న విధంగా మొటిమలు అనేక కారణాల వల్ల వస్తుంటాయి. అందులో ఒకటి పొట్ట చెడిపోవటం కూడా. శరీరానికి అవసరం లేని పదార్ధాలు, అలాగే టాక్సిన్స్, పొట్ట జీర్ణించుకోలేక బయటకు పంపలేకపోతే చర్మం ద్వారా విసర్జించబడతాయి. ఇది మొటిమలకు కారణం కావచ్చు.

సోరియాసిస్ అనే చర్మ వ్యాధి గురించి మీరందరూ వినే ఉంటారు. సోరియాసిస్ అనేది మందపాటి, పొడి, దురదతో కూడిన చర్మ సమస్య. దీని కారణంగా చర్మం పొరలు పొరలుగా ఉంటుంది. సోరియాసిస్‌కు కారణమేమిటో ఇప్పటికీ సరైన ఆధారాలు లేవంటున్నారు. కానీ పొట్ట పాడైపోయినప్పుడు కొందరికి సోరియాసిస్ సోకినట్లు నివేదికలు చెబుతున్నాయి.

ఇవి కూడా చదవండి

ఈ రకమైన సమస్యలను నివారించడానికి, కడుపు ఆరోగ్యాన్ని మెరుగుపరచడం అవసరం. మొదట మీరు ఒత్తిడిని ఎదుర్కోవాలి. దానికి అలవాటుపడాలి. కడుపుని దెబ్బతీసే ముఖ్యమైన అంశం ఒత్తిడి. అలాగే మీరు సరైన పోషకాహారంపై దృష్టిపెట్టాలి. సమయానికి సమతుల్య, పోషకమైన భోజనం తినండి. ఎక్కువ ఆహారం తీసుకోవడం కాదు – ఆరోగ్యకరమైన ఆహారాన్ని మితంగా తినడం అలవాటు చేసుకోండి. మీరు తినే ఆహారం సరైనదైతే అది చర్మానికి కావాల్సిన పోషణను అందిస్తుంది.

అలాగే, చక్కెర, ప్రాసెస్డ్ ప్యాక్ చేసిన ఆహారాలకు దూరంగా ఉండాలి. ఫైబర్ అధికంగా ఉండే కూరగాయలు, పండ్లను క్రమం తప్పకుండా తినండి. మొలకలు, తృణధాన్యాలు (పూర్తి), గింజలు, చిక్కుళ్ళు వంటివి ఎక్కువగా తీసుకోవాలి. నీరు పుష్కలంగా తాగాలి. ధూమపానం, మద్యపానం మానేయండి.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..