Helath Tips: తక్కువ నిద్ర వల్ల గుండె దెబ్బతింటుందా..! మహిళలపై చేసిన అధ్యయనం ఏమి చెబుతుందంటే..
వీరి అధ్యయనం ప్రకారం 12 వారాల్లో మొదటి 6 వారాల పాటు.. 35 మంది మహిళలు పూర్తి ఆరోగ్యకరమైన నిద్రలో ఉన్నారు. తర్వాతి 6 వారాలు మాత్రం వీరి నిద్ర వేళలో స్వల్ప మార్పులు వచ్చాయి. వీరు సాధారణంగా పడుకునే నిద్ర వేళ కంటే గంట రెండు గంటలు లేటుగా పడుకున్నారు. దీంతో స్వల్పంగా వీరి గుండె ఆరోగ్యంపై ప్రభావం పడినట్లు పరిశోధకులు గమనించారు.
నిద్ర వేళలో మార్పులు సంభవిస్తే దాని ప్రభావం గుండెపై పడుతుందనే విషయం కొలంబియా యూనివర్సిటీ నిర్వహించిన స్టడీలో బహిర్గతమైంది. మనం పడుకునే వేళ్ళ లో మార్పులు సంభవిస్తే వాటి ప్రభావం గుండెపై పడుతుందని పరిశోధకులు అంటున్నారు. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ కొలంబియా నిర్వహించిన ఈ స్టడీ లో ప్రతి ఒక్కరూ తమ నిద్రను 7 గంటల నుండి 9 గంటల పాటు నిద్రపోవాల్సిందేనని పేర్కొన్నారు.. దీంతోపాటు మధ్య రాత్రుల్లో మెలుకువ వస్తున్న సందర్భాలను సైతం యూనివర్సిటీ ఆఫ్ కొలంబియా పరిశోధన చేసింది. నిద్ర వేళలో చిన్నపాటి తేడా వచ్చిన సరే అనారోగ్య సమస్యలకు గురవుతారని ఈ స్టడీ తెలిపింది.
అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉండాలంటే కచ్చితంగా మంచి నిద్ర అవసరం. నిద్ర వేళలో చిన్నపాటి మార్పులతో పాటు నిద్ర మధ్యలో మెలకువ లాంటి పరిస్థితులు ఏర్పడిన దాని ప్రభావం గుండె పై పడుతుందని పరిశోధకులు చెబుతున్నారు. యూనివర్సిటీ ఆఫ్ కొలంబియా నిర్వహించిన స్టడీలో పడుకునే వేళలపై చేసిన స్టడీలో 35 మంది ఆరోగ్యంగా ఉన్న మహిళలు పాల్గొన్నారు.. వీరిపై 12 వారాలపాటు పరిశోధన చేసిన నిపుణులు నిద్ర సమయంలో మార్పు రావడం వల్ల వీరి గుండెపై ప్రభావం పడినట్టు తెలిపారు. వీరిని 12 వారాలపాటు పరిశీలించిన నిపుణులు ప్రతి ఒక్కరికి స్లీప్ త్రాకర్స్ తో పాటు వీరి ఆరోగ్యానికి సంబంధించిన మానిటరింగ్ ను ఎప్పటికప్పుడు చేశారు.
అయితే వీరి అధ్యయనం ప్రకారం 12 వారాల్లో మొదటి 6 వారాల పాటు.. 35 మంది మహిళలు పూర్తి ఆరోగ్యకరమైన నిద్రలో ఉన్నారు. తర్వాతి 6 వారాలు మాత్రం వీరి నిద్ర వేళలో స్వల్ప మార్పులు వచ్చాయి. వీరు సాధారణంగా పడుకునే నిద్ర వేళ కంటే గంట రెండు గంటలు లేటుగా పడుకున్నారు. దీంతో స్వల్పంగా వీరి గుండె ఆరోగ్యంపై ప్రభావం పడినట్లు పరిశోధకులు గమనించారు. నిద్రపోయే వేళల్లో తరచూ మార్పులు రావటం వల్ల కచ్చితంగా అనారోగ్యానికి గురవుతారని యూనివర్సిటీ ఆఫ్ కొలంబియా చెబుతుంది. మరో సంస్థ ఎన్.హెచ్.ఎస్ ( NHS) స్టడీ ప్రకారం ప్రతి ఒక్కరూ ఏడు నుండి తొమ్మిది గంటలపాటు నిద్రకు సమయం కేటాయించాలని తెలిపింది.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..