Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

World Heart Day: ఈ బ్లడ్ గ్రూప్ ఉన్నవారిలో గుండె జబ్బులు ప్రమాదం ఎక్కువట.. జాగ్రత్తగా ఉండమంటున్న నిపుణులు..

గుండె జబ్బుల గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రతి సంవత్సరం వరల్డ్ హార్ట్ డే ని జరుపుకుంటారు. గుండె సంబంధిత వ్యాధులు జీవనశైలిపై లేదా జన్యుశాస్త్రంపై ఎక్కువగా ఆధారపడి ఉంటాయి. అయితే కొన్నిసార్లు బ్లడ్ గ్రూప్ కూడా కారణం కావచ్చు. అవును బ్లడ్ గ్రూప్ కారణంగా కూడా గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందని తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోతారు. ఏ బ్లడ్ గ్రూప్‌ వారికి ఎక్కువగా గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందో తెలుసుకుందాం.. 

World Heart Day: ఈ బ్లడ్ గ్రూప్ ఉన్నవారిలో గుండె జబ్బులు ప్రమాదం ఎక్కువట.. జాగ్రత్తగా ఉండమంటున్న నిపుణులు..
World Heart Day
Follow us
Surya Kala

|

Updated on: Sep 29, 2023 | 8:56 AM

మనిషి ఆరోగ్యంగా ఉండాలనుకుంటే.. హృదయాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. గుండె మానవ శరీరంలో అతి ముఖ్యమైన అవయవం. ప్రస్తుతం మారిన జీవనశైలి వల్ల వయసుతో సంబంధం లేకుండా చాలా మంది గుండె జబ్బుల బారిన పడుతున్నారు. వృద్ధుల్లోనే కాదు యువతలో కూడా గుండెపోటు కేసులు పెరుగుతున్నాయి. గుండె జబ్బుల గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రతి సంవత్సరం వరల్డ్ హార్ట్ డే ని జరుపుకుంటారు. గుండె సంబంధిత వ్యాధులు జీవనశైలిపై లేదా జన్యుశాస్త్రంపై ఎక్కువగా ఆధారపడి ఉంటాయి. అయితే కొన్నిసార్లు బ్లడ్ గ్రూప్ కూడా కారణం కావచ్చు. అవును బ్లడ్ గ్రూప్ కారణంగా కూడా గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందని తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోతారు. ఏ బ్లడ్ గ్రూప్‌ వారికి ఎక్కువగా గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందో తెలుసుకుందాం..

పరిశోధనలో ఏం తేలిందంటే

బ్లడ్ గ్రూప్, గుండె సంబంధిత వ్యాధులపై నిర్వహించిన పరిశోధనలో కొన్ని బ్లడ్ గ్రూప్‌లు ఉన్నవారికి గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని ద్వారా తెలుస్తోంది. పరిశోధన ప్రకారం  A, B బ్లడ్ గ్రూప్‌ల వ్యక్తులకు గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఈ రెండు బ్లడ్ గ్రూపులు ఉన్నవారిలో  రక్తం గడ్డకట్టే గుణం ఎక్కువ ఉంటుంది. ఈ బ్లడ్ గ్రూపులు ఉన్నవారికి గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉండటానికి ఇదే కారణం. ఇంకా చెప్పాలంటే ఇతర బ్లడ్ గ్రూప్ ల వారి కంటే ఈ రెండు బ్లడ్ గ్రూపులు ఉన్నవారికి గుండె జబ్బులు ఎక్కువగా వచ్చే ప్రమాదం ఉంటుందని పరిశోధలు కూడా చెబుతున్నాయి.

ఏ వ్యక్తుల్లో తక్కువ ప్రమాదం అంటే..

అమెరికన్ హార్ట్ అసోసియేషన్ నిపుణులు ఇందుకు సంబంధించి దాదాపు 4 లక్షల మందిపై పరిశోధనలు జరిపినట్లు.. ఈ పరిశోధనల్లో ‘O’ బ్లడ్ గ్రూప్ ఉన్నవారిలో గుండె సంబంధిత వ్యాధులు తక్కువగా ఉన్నట్లు తేలిందని చెబుతున్నారు. అంతేకాదు ఈ బ్లడ్ గ్రూప్ వారికి గుండె జబ్బులు తక్కువగా ఉంటాయి. హార్ట్ఎ టాక్ ,  హార్ట్ ఫెయిల్యూర్ ప్రమాదం మిగతా బ్లడ్ గ్రూప్ కంటే 10 శాతం తక్కువ అని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

ఆరోగ్యకరమైన జీవనశైలి

గుండె జబ్బులు రాకుండా ఉండాలంటే ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడం. అందుకని హెల్తీ డైట్ తీసుకోవడంతో పాటు వర్కవుట్స్ చేయడం కూడా చాలా ముఖ్యం.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..