AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బుధవారం పుట్టినవారు లక్కీ.. మనీ మైండెడ్..! వీరు ఏ రంగంలో రాణిస్తారంటే..?

Excerpt (Telugu): బుధవారం జన్మించిన వ్యక్తులు ఉన్నత మేధస్సు, వాక్చాతుర్యం కలిగి ఉంటారు. వ్యాపారంలో అపారమైన విజయం సాధిస్తారు. వీరు సృజనాత్మక ఆలోచనలతో క్లిష్ట సమస్యలను సులభంగా పరిష్కరిస్తారు. అదృష్ట సంఖ్య 5, తెలుపు, బంగారపు రంగులు, గణపతి ఆరాధన వీరికి శుభప్రదం. సరైన మార్గదర్శనంతో జీవితంలో ఉన్నత స్థితికి చేరుకుంటారు.

Rajashekher G
|

Updated on: Mar 11, 2026 | 7:54 AM

Share
వారంలో ఒక్కో రోజు పుట్టినవారికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. బుధవారం జన్మించిన స్త్రీ, పురుషుల జీవిత గమనం, వ్యక్తిత్వ లక్షణాలు,  విజయాన్ని సాధించే మార్గాలను ఇప్పడు తెలుసుకుందాం. బుధవారం పుట్టిన వ్యక్తులలో మేధాశక్తి, లౌకిక జ్ఞానం, లౌక్యం,  వాక్చాతుర్యం అధికంగా ఉంటాయి. వీరు తమ మాటల ద్వారా ఇతరులను సులభంగా ఆకర్షించే ప్రత్యేక సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. వ్యాపార రంగంలో వీరు నిష్ణాతులు. వీరు చేపట్టే ఏ వ్యాపారంలోనైనా అద్భుతమైన విజయాన్ని సాధించే యోగం ఉంది. వేల మంది రోజుల తరబడి ఆలోచించి చేసే పనులను సైతం వీరు అతి తక్కువ సమయంలో పూర్తి చేయగల సామర్థ్యాన్ని ప్రదర్శిస్తారు.

1 / 5

మనీ మైండెడ్‌..

ఒక ప్రతికూల పరిస్థితి ఎదురైనప్పుడు, బుధవారం జన్మించినవారి మెదడు పాదరసంలాగా వేగంగా స్పందించి, తక్షణమే సమస్యకు పరిష్కార మార్గాన్ని సూచిస్తుంది. ఈ లక్షణం వల్ల వీరు ఇతరుల ప్రశంసలను అందుకుంటారు. వీరు అధికంగా మనీ మైండెడ్‌గా ఉంటారు. డబ్బు సంపాదించడానికి ఎల్లప్పుడూ కొత్త మార్గాలను అన్వేషిస్తూ ఉంటారు. తాము చేసే ఉద్యోగం లేదా వ్యాపారం ఎప్పుడూ నూతనంగా, వినూత్నంగా ఉండాలని కోరుకుంటారు. చేతిలో రూపాయి లేకపోయినా, అవసరానికి డబ్బు సమకూర్చుకోగల ప్రత్యేకమైన చాకచక్యం వీరికి సొంతం.

మనీ మైండెడ్‌.. ఒక ప్రతికూల పరిస్థితి ఎదురైనప్పుడు, బుధవారం జన్మించినవారి మెదడు పాదరసంలాగా వేగంగా స్పందించి, తక్షణమే సమస్యకు పరిష్కార మార్గాన్ని సూచిస్తుంది. ఈ లక్షణం వల్ల వీరు ఇతరుల ప్రశంసలను అందుకుంటారు. వీరు అధికంగా మనీ మైండెడ్‌గా ఉంటారు. డబ్బు సంపాదించడానికి ఎల్లప్పుడూ కొత్త మార్గాలను అన్వేషిస్తూ ఉంటారు. తాము చేసే ఉద్యోగం లేదా వ్యాపారం ఎప్పుడూ నూతనంగా, వినూత్నంగా ఉండాలని కోరుకుంటారు. చేతిలో రూపాయి లేకపోయినా, అవసరానికి డబ్బు సమకూర్చుకోగల ప్రత్యేకమైన చాకచక్యం వీరికి సొంతం.

2 / 5

అదృష్టం తెచ్చేవారు..

బుధవారం పుట్టినవారు ఏ సంస్థలో పనిచేసినా, ఆ సంస్థకు అదృష్టం పట్టినట్లేనని చెప్పాలి. కంపెనీ నష్టాల్లో కూరుకుపోయినప్పుడు లేదా ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కూడా, వీరు తమ తెలివినే పెట్టుబడిగా పెట్టి, సంస్థను తిరిగి ఉన్నత స్థితికి తీసుకురాగల సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. వ్యక్తిగత లక్షణాల విషయానికి వస్తే, వీరు పొగడ్తలకు సులభంగా లొంగిపోతారు, ఇతరులకు సహాయం చేయడానికి ముందుంటారు. అయితే, తమ పనిలో ఇతరుల జోక్యాన్ని వీరు ఏ మాత్రం సహించరు.

అదృష్టం తెచ్చేవారు.. బుధవారం పుట్టినవారు ఏ సంస్థలో పనిచేసినా, ఆ సంస్థకు అదృష్టం పట్టినట్లేనని చెప్పాలి. కంపెనీ నష్టాల్లో కూరుకుపోయినప్పుడు లేదా ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కూడా, వీరు తమ తెలివినే పెట్టుబడిగా పెట్టి, సంస్థను తిరిగి ఉన్నత స్థితికి తీసుకురాగల సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. వ్యక్తిగత లక్షణాల విషయానికి వస్తే, వీరు పొగడ్తలకు సులభంగా లొంగిపోతారు, ఇతరులకు సహాయం చేయడానికి ముందుంటారు. అయితే, తమ పనిలో ఇతరుల జోక్యాన్ని వీరు ఏ మాత్రం సహించరు.

3 / 5

వీరు ఏ రంగంలో రాణిస్తారంటే..

బుధవారం జన్మించినవారు ఎలక్ట్రికల్, టెక్నికల్ రంగాల్లో బాగా రాణిస్తారు. గణిత శాస్త్రం, జ్యోతిష్య శాస్త్రం వంటి రంగాల్లో ప్రత్యేక ప్రతిభను ప్రదర్శిస్తారు. న్యాయవాదులుగా, జ్యోతిష్కులుగా, ఉపాధ్యాయులుగా కూడా వీరు అద్భుతంగా విజయం సాధించగలరు. వ్యాపారాలు చేయాలనుకునేవారు షేర్ మార్కెట్, స్పెక్యులేషన్ వ్యాపారాలను ఎంచుకుంటే మంచి అదృష్టం కలిసి వస్తుంది.

వీరు ఏ రంగంలో రాణిస్తారంటే.. బుధవారం జన్మించినవారు ఎలక్ట్రికల్, టెక్నికల్ రంగాల్లో బాగా రాణిస్తారు. గణిత శాస్త్రం, జ్యోతిష్య శాస్త్రం వంటి రంగాల్లో ప్రత్యేక ప్రతిభను ప్రదర్శిస్తారు. న్యాయవాదులుగా, జ్యోతిష్కులుగా, ఉపాధ్యాయులుగా కూడా వీరు అద్భుతంగా విజయం సాధించగలరు. వ్యాపారాలు చేయాలనుకునేవారు షేర్ మార్కెట్, స్పెక్యులేషన్ వ్యాపారాలను ఎంచుకుంటే మంచి అదృష్టం కలిసి వస్తుంది.

4 / 5
వీరి అదృష్ట సంఖ్య 5.. గోల్డెన్ కలర్.. 

వీరి అదృష్ట సంఖ్య ఐదు. ఏదైనా ముఖ్యమైన పనులను 5, 14, 23 తేదీల్లో ప్రారంభించడం శ్రేయస్కరం. తెలుపు రంగు, బంగారపు రంగులు వీరికి కలిసి వచ్చే అదృష్ట రంగులు. గోల్డ్ కలర్ దుస్తులు ధరించడం లేదా గోల్డ్ కలర్ కర్చీఫ్ దగ్గర ఉంచుకోవడం అదృష్టాన్ని పెంచుతుంది. నవగ్రహాలలో బుధుడిని ప్రసన్నం చేసుకోవడం వల్ల శుభ ఫలితాలు లభిస్తాయి. ప్రతిరోజూ "ఓం బుం బుధాయ నమః" అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు జపించడం మంచిది. బుధవారం జన్మించినవారు పూజించాల్సిన ప్రధాన దైవం గణపతి. గణపతి ఆలయ సందర్శన, గణపతి స్తోత్ర పారాయణం ద్వారా వీరు జీవితంలో తొందరగా విజయం సాధించడానికి మార్గం సుగమం అవుతుంది.

(Disclaimer: ఈ వార్తలోని సమాచారం జ్యోతిష్యం, మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. దీనిని టీవీ9 తెలుగు  ధృవీకరించదు.)

వీరి అదృష్ట సంఖ్య 5.. గోల్డెన్ కలర్.. వీరి అదృష్ట సంఖ్య ఐదు. ఏదైనా ముఖ్యమైన పనులను 5, 14, 23 తేదీల్లో ప్రారంభించడం శ్రేయస్కరం. తెలుపు రంగు, బంగారపు రంగులు వీరికి కలిసి వచ్చే అదృష్ట రంగులు. గోల్డ్ కలర్ దుస్తులు ధరించడం లేదా గోల్డ్ కలర్ కర్చీఫ్ దగ్గర ఉంచుకోవడం అదృష్టాన్ని పెంచుతుంది. నవగ్రహాలలో బుధుడిని ప్రసన్నం చేసుకోవడం వల్ల శుభ ఫలితాలు లభిస్తాయి. ప్రతిరోజూ "ఓం బుం బుధాయ నమః" అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు జపించడం మంచిది. బుధవారం జన్మించినవారు పూజించాల్సిన ప్రధాన దైవం గణపతి. గణపతి ఆలయ సందర్శన, గణపతి స్తోత్ర పారాయణం ద్వారా వీరు జీవితంలో తొందరగా విజయం సాధించడానికి మార్గం సుగమం అవుతుంది. (Disclaimer: ఈ వార్తలోని సమాచారం జ్యోతిష్యం, మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించదు.)

5 / 5
Follow Us
బాక్సింగ్ రింగ్‌లోకి టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఫొటోస్ వైరల్
బాక్సింగ్ రింగ్‌లోకి టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఫొటోస్ వైరల్
బుధవారం పుట్టినవారు మనీ మైండెడ్..! వీరు ఏ రంగంలో రాణిస్తారంటే..?
బుధవారం పుట్టినవారు మనీ మైండెడ్..! వీరు ఏ రంగంలో రాణిస్తారంటే..?
బెండకాయ తింటున్నారా.. జర జాగ్రత్త...
బెండకాయ తింటున్నారా.. జర జాగ్రత్త...
యుద్ధంలో భారీ నష్టం.. ఆఫ్ఘన్ ముందు మోకరిల్లిన పాక్..!
యుద్ధంలో భారీ నష్టం.. ఆఫ్ఘన్ ముందు మోకరిల్లిన పాక్..!
కేవలం రూ.800తో కోటీశ్వరులు అవ్వొచ్చు.. కియోసాకి సిల్వర్ సీక్రెట్
కేవలం రూ.800తో కోటీశ్వరులు అవ్వొచ్చు.. కియోసాకి సిల్వర్ సీక్రెట్
జలుబుకి చెక్ పెట్టె అల్లం పులుసు ఇలా చేస్తే.. గ్లాసులు తాగేస్తారు
జలుబుకి చెక్ పెట్టె అల్లం పులుసు ఇలా చేస్తే.. గ్లాసులు తాగేస్తారు
గోల్డ్‌, సిల్వర్‌ ధరలు ఎంత పెరిగాయంటే?
గోల్డ్‌, సిల్వర్‌ ధరలు ఎంత పెరిగాయంటే?
వీళ్లే ఇంత డేంజరస్‌గా ఉంటే.. ఇక టీమిండియాలోకి వాడు ఎంట్రీ ఇస్తే
వీళ్లే ఇంత డేంజరస్‌గా ఉంటే.. ఇక టీమిండియాలోకి వాడు ఎంట్రీ ఇస్తే
ఇంటర్నెట్‌ లేకుండా యూపీఐ నుంచి పేమెంట్‌ చేయడం ఎలాగో తెలుసా?
ఇంటర్నెట్‌ లేకుండా యూపీఐ నుంచి పేమెంట్‌ చేయడం ఎలాగో తెలుసా?
గ్యాస్ లేకపోయినా వీటితో నిమిషాల్లోనే వంట పూర్తి.. ప్రతి ఇంట్లో..
గ్యాస్ లేకపోయినా వీటితో నిమిషాల్లోనే వంట పూర్తి.. ప్రతి ఇంట్లో..