Ayurvedic Skin Care Tips: స్పష్టమైన, కాంతివంతమైన ముఖసౌందర్యం కోసం ఆయుర్వేద చర్మ సంరక్షణ రహస్యాలు

పెరుగు వేసి అందులో కాస్త నిమ్మరసం పిండాలి. ఈ మిశ్రమాన్ని బాగా మిక్స్‌ చేసిన ముఖానికి ప్యాక్‌లాగా అప్లై చేయాలి. ఈ ప్యాక్‌ని మీ ముఖంపై 20 నిమిషాల పాటు ఉంచాలి. ఈ ఫేస్ ప్యాక్ తో మీ ముఖంపై మచ్చలు, గీతలు, ముడతలను వదిలించుకోవడానికి సహాయపడుతుంది. నిమ్మకాయలోని విటమిన్ సి చర్మాన్ని కాంతివంతంగా మార్చడంలో సహాయపడుతుంది.

Ayurvedic Skin Care Tips: స్పష్టమైన, కాంతివంతమైన ముఖసౌందర్యం కోసం ఆయుర్వేద చర్మ సంరక్షణ రహస్యాలు
Ayurvedic Skin Care
Follow us
Jyothi Gadda

|

Updated on: Oct 28, 2023 | 5:07 PM

ఆయుర్వేదం అనేది పురాతన భారతీయ వైద్య విధానం. ఇది అందమైన చర్మంతో సహా మొత్తం శ్రేయస్సు, ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి వేల సంవత్సరాలుగా అభ్యసిస్తూ, అనుసరిస్తున్న విధానం. స్పష్టమైన, కాంతివంతమైన చర్మం, చంద్రబింబంలాంటి ముఖ సౌందర్యం కోసం ఆయుర్వేద చర్మ సంరక్షణ రహస్యాలు కొన్ని ఉన్నాయి. అలాంటి ఉపాయాల గురించి ఇక్కడ తెలుసుకుందాం..

అద్భుతమైన ప్రయోజనాలు యాంటీ ఫంగల్ లక్షణాల కారణంగా వేపను ఆయుర్వేదం చాలా కాలంగా ఉపయోగిస్తున్నారు. కొన్ని వేప ఆకులను నీటిలో వేసి మరిగించి, ఆ ద్రవాన్ని ముఖం క్లెన్సర్‌గా వాడండి, ఇది మొటిమలను వదిలించుకోవడానికి సహాయపడుతుంది.

అలోవెరా జెల్..

ఇవి కూడా చదవండి

అలోవెరా జెల్ దాని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాల కారణంగా వివిధ చర్మ సమస్యలకు చికిత్స చేయడానికి అత్యంత ప్రభావవంతమైన ఆయుర్వేద హోం రెమెడీగా అనేక అధ్యయనాలు రుజువు చేశాయి. ఆకుల నుండి నేరుగా జెల్‌ను తీసి వాడుకోవచ్చు. దాన్ని అలాగే చర్మంపై 15 నిమిషాలు వదిలేసి ఆ తర్వాత శుభ్రంగా కడిగేసుకోవాలి. త్వరలోనే మార్పు చూస్తారు.

పసుపు తేనెతో ఫేస్ ప్యాక్..

ముఖానికి ఒక చెంచా పచ్చి తేనె, చెంచా పసుపుతో కలిపి ముఖానికి రాయండి. ఇది 10-15 నిమిషాల వరకు పూర్తిగా ఆరనివ్వండి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి. తేనె యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది. పసుపు యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్.

పెరుగుతో ఫేస్ ప్యాక్..

అన్ని రకాల చర్మాలకు అద్భుతంగా పనిచేసే మరో ఫేస్‌ ప్యాక్‌ ఇది. ఇందుకోసం ఒక గిన్నె తీసుకుని అందులో కాస్త పెరుగు వేసి అందులో కాస్త నిమ్మరసం పిండాలి. ఈ మిశ్రమాన్ని బాగా మిక్స్‌ చేసిన ముఖానికి ప్యాక్‌లాగా అప్లై చేయాలి. ఈ ప్యాక్‌ని మీ ముఖంపై 20 నిమిషాల పాటు ఉంచాలి. ఈ ఫేస్ ప్యాక్ తో మీ ముఖంపై మచ్చలు, గీతలు, ముడతలను వదిలించుకోవడానికి సహాయపడుతుంది. నిమ్మకాయలోని విటమిన్ సి చర్మాన్ని కాంతివంతంగా మార్చడంలో సహాయపడుతుంది.

టర్మరిక్ స్క్రబ్

టర్మరిక్ స్క్రబ్ కూడా చర్మ సమస్యలకు చక్కటి ఔషధంగా పనిచేస్తుంది. చర్మంపై మృతకణాలను తొలగించడానికి నిమ్మ, చక్కెర మాస్క్ అద్భుతంగా పనిచేస్తుంది. ఒక గిన్నెలో కొంచెం పంచదార,నిమ్మరసం తీసుకుని చర్మంపై 5 నిమిషాల పాటు సున్నితంగా స్క్రబ్ చేయండి. ఈ ఫేస్ మాస్క్ కాంతివంతమైన చర్మాన్ని అందించడంలో సహాయపడుతుంది.

రోజ్‌వాటర్ ఫేషియల్ టోనర్‌..

రోజ్ వాటర్ యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంది. తరతరాలుగా చర్మానికి ఉపశమనం, పోషణకు ఉపయోగిస్తారు. మీ చర్మాన్ని శుభ్రం చేసిన తర్వాత, కాటన్ బాల్స్ సాయంతో ముఖానికి రోజ్‌ వాటర్ అప్లై చేయండి

గంధంతో రోజ్ వాటర్..

గంధపు పొడి, రోజ్ వాటర్ కలిపి పేస్ట్ లా చేసి మీ ముఖానికి అప్లై చేయండి. 10-15 నిమిషాలు బాగా ఆరిపోయిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రంగా కడిగేయాలి. ఈ ప్యాక్‌ మీకు చికాకు, ఎరుపును తగ్గించడం ద్వారా చర్మపు రంగును సమం చేస్తుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..