AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SSC CHSL 2023 Result: ఎస్‌ఎస్‌సీ సీహెచ్‌ఎస్‌ఎల్‌ టైర్‌-2 అడ్మిట్‌ కార్డులు విడుదల.. నవంబర్‌ 2న పరీక్ష

ఇంటర్‌ అర్హతతో కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీల భర్తీకి కంబైన్డ్‌ హయ్యర్‌ సెకండరీ లెవల్‌ ఎగ్జామినేషన్‌-2023 (SSC CHSL) టైర్‌-2 రాత పరీక్ష అడ్మిట్‌ కార్డులను స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులు స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (Staff Selection Commission) అధికారిక వెబ్‌సైట్‌ నుంచి అడ్మిట్‌ కార్డులు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని ఓ ప్రకటనలో తెలియజేసింది. కాగా టైర్‌-2 డిస్క్రిప్టివ్‌ పరీక్ష దేశ వ్యాప్తంగా నవబర్‌ 2వ తేదీన వివిధ పరీక్ష కేంద్రాల్లో పరీక్ష..

SSC CHSL 2023 Result: ఎస్‌ఎస్‌సీ సీహెచ్‌ఎస్‌ఎల్‌ టైర్‌-2 అడ్మిట్‌ కార్డులు విడుదల.. నవంబర్‌ 2న పరీక్ష
Staff Selection Commission
Srilakshmi C
|

Updated on: Oct 30, 2023 | 2:20 PM

Share

న్యూఢిల్లీ, అక్టోబర్ 30: ఇంటర్‌ అర్హతతో కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీల భర్తీకి కంబైన్డ్‌ హయ్యర్‌ సెకండరీ లెవల్‌ ఎగ్జామినేషన్‌-2023 (SSC CHSL) టైర్‌-2 రాత పరీక్ష అడ్మిట్‌ కార్డులను స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులు స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (Staff Selection Commission) అధికారిక వెబ్‌సైట్‌ నుంచి అడ్మిట్‌ కార్డులు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని ఓ ప్రకటనలో తెలియజేసింది. కాగా టైర్‌-2 డిస్క్రిప్టివ్‌ పరీక్ష దేశ వ్యాప్తంగా నవబర్‌ 2వ తేదీన వివిధ పరీక్ష కేంద్రాల్లో పరీక్ష నిర్వహించనున్నారు. ఈ జాబ్‌ నోటిఫికేషన్‌ ద్వారా 1762 ఉద్యోగాలు భర్తీ చేయనున్న సంగతి తెలిసిందే.

వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్థలు, మంత్రిత్వ శాఖలు, కార్యాలయాలు, ట్రైబ్యునళ్లు మొదలైనవాటిలో లోయర్‌ డివిజనల్‌ క్లర్క్, జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్స్‌ పోస్టులను భర్తీ చేసేందుకు ఈ ఏడాది మే నెలలో ఎస్‌ఎస్‌సీ నోటిఫికేషన్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ ఉద్యోగాలకు టైర్‌ 1, టైర్‌ 2 పరీక్షలు, కంప్యూటర్‌ టెస్ట్‌, టైపింగ్‌ టెస్ట్‌, డాక్యుమెంట్ల వెరిఫికేషన్‌, మెడికల్ టెస్ట్స్‌ ఆధారంగా అభ్యర్థులను ఈ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. నియామక ప్రక్రియలో ఎంపికైన వారికి నెలకు రూ.19,900ల నుంచి రూ.92,300ల వరకు జీతంగా చెల్లిస్తారు.

తెలంగాణ ఎడ్‌సెట్‌2023 చివరి విడత సీట్ల కేటాయింపు పూర్తి

తెలంగాణలో ‘ఎడ్‌సెట్‌-2023’ చివరి విడత సీట్ల కేటాయింపు ప్రక్రియ ఆదివారం (అక్టోబరు 29)తో ముగిసింది. చివరి విడతలో రాష్ట్రం వ్యాప్తంగా ఉన్న బీఈడీ కాలేజీల్లో దాదాపు 6,223 సీట్లను కేటాయించినట్లు ఎడ్‌సెట్‌ కన్వీనర్‌ రమేశ్‌బాబు ఓ ప్రకటనలో తెలిపారు. చివరి విడతలో సీట్లు పొందిన అభ్యర్థులందరూ నేటి నుంచి (సోమవారం, అక్టోబరు 30) నుంచి నవంబరు 4వ తేదీ వరకు సంబంధిత కాలేజీల్లో చేరాలని తెలిపారు. అలాగే ధ్రువీకరణ పత్రాలు, రుసుములు కూడా చెల్లించాలని సూచించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.