AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bank Jobs: సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో ఉద్యోగాలు.. నెలకు రూ. లక్ష వరకు జీతం..

దేశ వ్యాప్తంగా ఉన్న పలు శాఖల్లో వేర్వేరు స్ట్రీమ్స్‌లో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నారు. హ్యూమన్ క్యాపిటల్‌ మేనేజ్‌మెంట్‌ డిపార్ట్‌మెంట్ ఈ ఖాళీలు ఉన్నాయి. మొత్తం 192 ఖాళీలకు గాను.. ఆఫీసర్‌ (స్పెషలిస్ట్‌ కేటగిరీ) స్కేల్‌ I: ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ(15), రిస్క్‌ మేనేజర్‌(2), సెక్యూరిటీ ఆఫీసర్‌(15), లైబ్రేరియన్‌(1) చొప్పున పోస్టుల్ని భర్తీ చేయనుండగా.. స్కేల్‌ -2లో ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ(73), లా ఆఫీసర్‌(15)...

Bank Jobs: సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో ఉద్యోగాలు.. నెలకు రూ. లక్ష వరకు జీతం..
Central Bank Of India Jobs
Narender Vaitla
|

Updated on: Oct 29, 2023 | 5:45 PM

Share

సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. కేంద్ర ప్రభుత్వ రంగ బ్యాంకులో పలు పోస్టులను భర్తీ చేయనున్నారు. స్పెషలిస్ట్ కేటగిరీలో ఆఫీసర్‌ పోస్టుల భర్తీ చేయనున్నారు. పలు విభాగాల్లో ఉన్న మొత్తం 192 ఖాళీలను బర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

దేశ వ్యాప్తంగా ఉన్న పలు శాఖల్లో వేర్వేరు స్ట్రీమ్స్‌లో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నారు. హ్యూమన్ క్యాపిటల్‌ మేనేజ్‌మెంట్‌ డిపార్ట్‌మెంట్ ఈ ఖాళీలు ఉన్నాయి. మొత్తం 192 ఖాళీలకు గాను.. ఆఫీసర్‌ (స్పెషలిస్ట్‌ కేటగిరీ) స్కేల్‌ I: ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ(15), రిస్క్‌ మేనేజర్‌(2), సెక్యూరిటీ ఆఫీసర్‌(15), లైబ్రేరియన్‌(1) చొప్పున పోస్టుల్ని భర్తీ చేయనుండగా.. స్కేల్‌ -2లో ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ(73), లా ఆఫీసర్‌(15), క్రెడిట్‌ ఆఫీసర్‌(50), ఫైనాన్సియల్‌ అనలిస్ట్‌(4), సీఏ -ఫైనాన్స్‌/అకౌంట్స్‌/జీఎస్టీ/ Ind AS/బ్యాలెన్స్‌ షీట్‌/ట్యాక్సేషన్‌ (3); స్కేల్‌ IIIలో ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (6), ఫైనాన్సియల్‌ అనలిస్ట్‌ (5), స్కేల్‌ IV రిస్క్‌మేనేజర్‌ (1); స్కేల్‌ Vలో ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (1), రిస్క్‌ మేనేజర్‌ (1) చొప్పు ఉన్నాయి.

పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగాల్లో పని అనుభవం ఉండాలి. పలు పోస్టులకు సంబంధించి ఇంజినీరింగ్‌/డేటా అనలిటిక్స్‌లో డిగ్రీ/ఎంబీఏ/ ఎంబీఏ ఫైనాన్స్‌/ఎంసీఏ/ఎమ్మెస్సీ(ఐటీ) వంటి విద్యార్హత కలిగి ఉండాలి. పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల కనిష్ట వయసు 30 ఏళ్లుకాగా, గరిష్టంగా 45 ఏళ్లుగా నిర్ణయించారు. స్కేల్‌ 1 ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు రూ. 36,000 నుంచి రూ. 63,840 వరకు చెల్లిస్తారు.

ఇక స్కేల్‌ II పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ. 48,170 నుంచి రూ. 69,810 వరకు చెల్లిస్తారు. ఇక స్కేల్ III ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు రూ. 63,940 నుంచి రూ. 78,230 వరకు చెల్లిస్తారు. స్కేల్‌ IV పోస్టులకు ఎంపికైన రూ. 76,010 నుంచి రూ. 89,890గా నిర్ణయించారు. ఇక స్కేల్‌ V పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ. 89,89 నుంచి రూ. 1,00,350 వరకు చెల్లిస్తారు.

ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు, మహిళా అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ. 175 చెల్లించాల్సి ఉంటుంది. ఇతరులు రూ. 850 చెల్లించాలి. అభ్యర్థులను ఆన్‌లైన్ రాత పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. రాత పరీక్షను డిసెంబర్‌ మూడు లేదా నాలుగో వారంలో నిర్వహించనున్నారు. పూర్తి వివరాలు, దరఖాస్తు చేసుకోవడానికి ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
సికింద్రాబాద్‌లోని ఈ ప్రాంతంలో ప్రతి రోజూ ఉచిత టిఫిన్..
సికింద్రాబాద్‌లోని ఈ ప్రాంతంలో ప్రతి రోజూ ఉచిత టిఫిన్..
రాజమౌళికి మరో అరుదైన గౌరవం.. దిగ్గజాల సరసన నిలిచిన జక్కన్న
రాజమౌళికి మరో అరుదైన గౌరవం.. దిగ్గజాల సరసన నిలిచిన జక్కన్న
తిరుగులేని శక్తిగా భారత్.. ప్రపంచ సవాళ్ల నడుమ టాప్ గేర్లలో జీడీపీ
తిరుగులేని శక్తిగా భారత్.. ప్రపంచ సవాళ్ల నడుమ టాప్ గేర్లలో జీడీపీ
అనుకోకుండా వచ్చే అతిథుల కోసం అద్భతమైన స్వీట్.. నోట్లే వేస్తే ..
అనుకోకుండా వచ్చే అతిథుల కోసం అద్భతమైన స్వీట్.. నోట్లే వేస్తే ..
ఫ్రీ బిర్యానీ కోసం ఎగబడ్డ జనం.. పోలీసుల ఎంట్రీతో సీన్ రివర్స్
ఫ్రీ బిర్యానీ కోసం ఎగబడ్డ జనం.. పోలీసుల ఎంట్రీతో సీన్ రివర్స్
బెజవాడ స్టైల్ చిట్టి పునుగులు.. ఇలా చేస్తే ఏమన్నా ఉంటాయా..?
బెజవాడ స్టైల్ చిట్టి పునుగులు.. ఇలా చేస్తే ఏమన్నా ఉంటాయా..?
IAS అవ్వాలనే అమ్మాయిలకు ఫ్రీగా UPSC కోచింగ్.. కొన్ని గంటలే ఛాన్స్
IAS అవ్వాలనే అమ్మాయిలకు ఫ్రీగా UPSC కోచింగ్.. కొన్ని గంటలే ఛాన్స్
ఇది కదా మానవత్వం అంటే.. 6 కి.మీ. విద్యార్థినిని వీపుపై మోసి..
ఇది కదా మానవత్వం అంటే.. 6 కి.మీ. విద్యార్థినిని వీపుపై మోసి..
తెలంగాణలో వర్షాలపై వాతావరణశాఖ మరో అప్డేట్..
తెలంగాణలో వర్షాలపై వాతావరణశాఖ మరో అప్డేట్..
ఆషాఢం అమావాస్య రోజే అద్భుతమైనయోగం.. వీరు కోటీశ్వరులు అవ్వడం పక్కా
ఆషాఢం అమావాస్య రోజే అద్భుతమైనయోగం.. వీరు కోటీశ్వరులు అవ్వడం పక్కా