ONGC Scholarship 2024: యూజీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలు పొందిన విద్యార్ధులకు గుడ్‌న్యూస్.. ఓఎన్‌జీసీ స్కాలర్‌షిప్‌కు నోటిఫికేషన్ విడుదల
ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్‌లో 2023-24 విద్యా సంవత్సరానికి గానూ యూజీ, పీజీ కోర్సులకు ఉపకారవేతనాలు అందించడానికి ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ ఫౌండేషన్ (ఓఎన్‌జీసీ) నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దేశ వ్యాప్తంగా ఉన్న విద్యాసంస్థల్లో చదువుతున్న ఆర్థికంగా వెనుకబడిన జనరల్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. బ్యాచిలర్స్ ఇంజినీరింగ్ డిగ్రీ అంటే బీఈ/ బీటెక్, ఎంబీబీఎస్, ఎంబీఏ, జియాలజీ/ జియో ఫిజిక్స్ స్పెషలైజేషన్‌లో పీజీ లేదా తత్సమాన కోర్సుల్లో..
మహారాష్ట్రలోని ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్‌లో 2023-24 విద్యా సంవత్సరానికి గానూ యూజీ, పీజీ కోర్సులకు ఉపకారవేతనాలు అందించడానికి ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ ఫౌండేషన్ (ఓఎన్‌జీసీ) నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దేశ వ్యాప్తంగా ఉన్న విద్యాసంస్థల్లో చదువుతున్న ఆర్థికంగా వెనుకబడిన జనరల్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. బ్యాచిలర్స్ ఇంజినీరింగ్ డిగ్రీ అంటే బీఈ/ బీటెక్, ఎంబీబీఎస్, ఎంబీఏ, జియాలజీ/ జియో ఫిజిక్స్ స్పెషలైజేషన్‌లో పీజీ లేదా తత్సమాన కోర్సుల్లో ఏదైనా కాలేజీలో అడ్మిషన్లు పొందిన విద్యార్థులు ఎవరైనా ఈ స్కాలర్‌షిప్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
ఏ కోర్సునైనా డిగ్రీ అభ్యసిస్తున్న ప్రథమ సంవత్సరం విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఇంజినీరింగ్, ఎంబీబీఎస్ కోర్సులు చదువుతున్న విద్యార్థులు ఇంటర్‌లో కనీసం 60 శాతం మార్కులు తప్పనిసరిగా సాధించి ఉండాలి. జియాలజీ/ జియోఫిజిక్స్‌లో ఎమ్మెస్సీ లేదా ఎంబీఏ కోర్సులు చదువుతున్న విద్యార్థులైతే డిగ్రీలో కనీసం 60 శాతం మార్కులు పొంది ఉండాలి. విద్యార్ధుల తల్లిదండ్రుల వార్షిక ఆదాయం తప్పనిసరిగా రూ.2 లక్షలకు మించకుండా ఉండాలి. వయసు అక్టోబర్ 16, 2023 నాటికి 30 ఏళ్లకు మించకుండా ఉండాలి.
అయితే ఆయా విద్యాసంస్థలో విద్యార్ధులు ఫుల్‌టైమ్ కోర్సు రెగ్యులర్ విధానంలో చదువుతూ ఉండాలి. మొత్తం రెండు వేల విద్యార్ధులకు ఈ ఏడాది స్కాలర్‌షిప్‌లు కేటాయించనున్నారు. ఎంపికైన విద్యార్ధులకు ఏడాదికి రూ.48 వేల చొప్పున వారు చదువుతున్న కోర్సు పూర్తయ్యేంత వరకు స్కాలర్‌షిప్ అందిస్తారు. జనరల్‌కు 500, ఓబీసీలకు 500, ఎస్సీ, ఎస్టీలకు 1000 చొప్పున స్కాలర్‌షిప్‌లు విడి విడిగా ఇస్తున్నారు.
యూజీ, పీజీ కోర్సులకు ఓఎన్‌జీసీ స్కాలర్‌షిప్ స్కీం 2023-24 కింద ఉపకార వేతనాలకు.. ఆయా కోర్సుల్లో అభ్యర్థి సాధించిన మార్కులు (ఇంటర్ లేదా డిగ్రీలో ), ప్రస్తుతం ప్రవేశాలు పొందిన కోర్సుల ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎలాంటి రాత పరీక్షలు, ఇంటర్వ్యూలు నిర్వహించరు. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీగా నవంబర్ 30, 2023 నిర్ణయించారు. దరఖాస్తు సమయంలో ఓఎన్‌జీసీ వెబ్‌సైట్‌లో సంబంధిత వివరాలతోపాటు అవసరమైన సర్టిఫికెట్లను అప్‌లోడ్ చేయాలి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.