Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kerala Bomb Blast: యూట్యూబ్‌లో చూసి బాంబుల తయారీ.. మొత్తం 6 చోట్ల బాంబులు పెట్టి పేలుతాయో.. లేదోనని టెస్టులు?

దేశ వ్యాప్తంగా కలకలం రేపిన కేరళ బాంబ్‌ పేళుళ్ల వ్యవహారంలో కీలక ట్విస్ట్ బయటపడింది. కేరళలో వరుస పేలుళ్లకు పాల్పడిన నిందితుడు డొమినిక్‌ మార్టిన్‌ సోమవారం (అక్టోబర్ 30) అరెస్టయిన విషయం తెలిసిందే. కొచ్చికి చెందిన డొమినిక్‌ మార్టిన్‌ తాను ఏవిధంగా బాంబులు తయారు చేశాడో పోలీసులకు వివరించాడు. మార్టిన్‌కు స్వతహాగా బాంబులు తయారు చేసే సాంకేతిక పరిజ్ఞానం ఉన్నట్లు పోలీసులు గ్రహించారు. అతను ఫోర్‌మెన్‌గా పనిచేస్తున్న సమయంలో ఇందుకు..

Kerala Bomb Blast: యూట్యూబ్‌లో చూసి బాంబుల తయారీ.. మొత్తం 6 చోట్ల బాంబులు పెట్టి పేలుతాయో.. లేదోనని టెస్టులు?
Kerala Bomb Blast
Follow us
Srilakshmi C

|

Updated on: Oct 31, 2023 | 9:45 AM

కొచ్చిన్‌, అక్టోబర్‌ 31: దేశ వ్యాప్తంగా కలకలం రేపిన కేరళ బాంబ్‌ పేళుళ్ల వ్యవహారంలో కీలక ట్విస్ట్ బయటపడింది. కేరళలో వరుస పేలుళ్లకు పాల్పడిన నిందితుడు డొమినిక్‌ మార్టిన్‌ సోమవారం (అక్టోబర్ 30) అరెస్టయిన విషయం తెలిసిందే. కొచ్చికి చెందిన డొమినిక్‌ మార్టిన్‌ తాను ఏవిధంగా బాంబులు తయారు చేశాడో పోలీసులకు వివరించాడు. మార్టిన్‌కు స్వతహాగా బాంబులు తయారు చేసే సాంకేతిక పరిజ్ఞానం ఉన్నట్లు పోలీసులు గ్రహించారు. అతను ఫోర్‌మెన్‌గా పనిచేస్తున్న సమయంలో ఇందుకు సంబంధించిన విషయపరిజ్ఞనాం సముపార్జించినట్లు తెలిపాడు. దాదాపు ఎనిమిది లీటర్ల పెట్రోలు వాడినట్లు చెప్పుకొచ్చాడు.

త్రిపుణితుర నుంచి పెట్రోల్ కొనుగోలు చేసిన డొమినిక్‌ మార్టిన్‌ ఇంటరాగేషన్‌లో మెటీరియల్స్, మందుగుండు సామగ్రిని కొనుగోలుకు సంబంధించిన సమాచారాన్ని కూడా వెల్లడించాడు. యూట్యూబ్‌ని చూసి బాంబులు తయారు చేసినట్లు పోలీసులకు తెలిపాడు. ఇలా తయారు చేసిన బాంబులను ఆదివారం ఉదయం 7 గంటలకు కన్వెన్షన్ సెంటర్‌లోని కుర్చీల కింద పెట్టాడు. ఆ సమయంలో హాలులో ముగ్గురే ఉన్నారని, పేలుడు కోసం నిందితులు దాదాపు 50 బాంబులను వినియోగించినట్లు తెలిపాడు. ప్లాస్టిక్ కవర్లలో పెట్రోల్ నింపి కన్వెన్షన్ సెంటర్‌లో మొత్తం ఆరు చోట్ల ఉంచినట్లు పేర్కొన్నాడు. వీటికి బాంబును అమర్చి రిమోట్‌ కంట్రోల్‌తో వాటిని పేల్చానన్నాడు. వాటిల్లో మూడు బాంబులు పేలాయి. ఘటనకు సంబంధించిన లైవ్ విజువల్స్‌ కూడా తాను రికార్డు చేసినట్లు నిందితుడు తెలిపాడు. తాను తయారు చేసిన బాంబులు మార్టిన్ ఎప్పుడూ ప్రయోగించలేదని, సక్రమంగా పనిచేస్తుందన్న నమ్మకంతోనే ఈ బాంబులు పెట్టినట్లు పోలీసుల ఎందుట నేరం అంగీకరించాడు. అంతా తానొక్కడినే చేసినట్లు చెప్పాడు.

కాగా కలమస్సేరిలో జెహోవా సాక్షులు ఆదివారం (అక్టోబర్‌ 29) ప్రార్థనలు నిర్వహిస్తుండగా మూడు పేలుళ్లు సంభవించాయి. ఈ పేలుడులో ఒక చిన్నారితో సహా ఇద్దరు మహిళలు మృతి చెందారు. మృతులను పుష్పన్ భార్య కుమారి (53), లియోనా పౌలోస్ (60), లిబినా (12)గా గుర్తించారు. ఈ ఘటనలో మరో 52 మంది గాయపడ్డారు. వీరిలో 18 మంది ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. బాంబు పేల్చేందుకు ఉపయోగించిన రిమోట్‌ను నిందితుడు మార్టిన్ పోలీసులకు అప్పగించాడు. పేలుడుకు సంబంధించిన వీడియోను కూడా అందజేసినట్లు పోలీసులు మీడియాకు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.