AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mukesh Ambani: ‘రూ. 200 కోట్లు ఇవ్వకపోతే డెత్ వారెంట్‌’.. ముకేశ్‌ అంబానీకి బెదిరింపు.

దీనిపై పోలీసులు విచారణ కొనసాగిస్తుండగానే మళ్లీ అదే ఈమెయిల్‌ నుంచి శుక్రవారం మరో బెదిరింపు మెయిల్ వచ్చింది. గతంలో మేము పంపిన మెయిల్‌కు స్పందించలేదు కాబట్టి, ఇప్పుడు ఆ మొత్తాన్ని రూ. 20 కోట్ల నుంచి రూ. 200 కోట్లకు పెంచుతున్నామని అగంతకులు మెయిల్ చేశారు. లేదంటే డెత్ వారెంట్‌పై సంతకం చేస్తామని ఈ మెయిల్‌లో అగంతకుడు హెచ్చరించాడు...

Mukesh Ambani: 'రూ. 200 కోట్లు ఇవ్వకపోతే డెత్ వారెంట్‌'.. ముకేశ్‌ అంబానీకి బెదిరింపు.
Mukesh Ambani
Narender Vaitla
|

Updated on: Oct 31, 2023 | 9:11 AM

Share

రిలయన్స్‌ అధినేత, ప్రపంచంలోనే అత్యంత సంపనున్నల్లో ఒకరైన ముకేశ్‌ అంబానీకి మరో బెదిరింపు మెయిల్‌ వచ్చింది. డబ్బులు ఇవ్వకపోతే హత్య చేస్తామని బెదిరింపు ఈమెయిల్ వచ్చింది. కొన్ని రోజులు క్రితం గుర్తు తెలియని వ్యక్తి నుంచి రూ. 20 కోట్లు ఇవ్వకపోతే ముకేశ్‌ అంబానీని చంపుతామంటూ ఓ మెయిల్ వచ్చింది.

దీనిపై పోలీసులు విచారణ కొనసాగిస్తుండగానే మళ్లీ అదే ఈమెయిల్‌ నుంచి శుక్రవారం మరో బెదిరింపు మెయిల్ వచ్చింది. గతంలో మేము పంపిన మెయిల్‌కు స్పందించలేదు కాబట్టి, ఇప్పుడు ఆ మొత్తాన్ని రూ. 20 కోట్ల నుంచి రూ. 200 కోట్లకు పెంచుతున్నామని అగంతకులు మెయిల్ చేశారు. లేదంటే డెత్ వారెంట్‌పై సంతకం చేస్తామని ఈ మెయిల్‌లో అగంతకుడు హెచ్చరించాడు. తమ వద్ద అత్యుత్తమ షూటర్లు ఉన్నారంటూ డబ్బులు చెల్లించకపోతే చంపేస్తామంటూ మెయిల్ చేశారు. దీంతో పోలీసులు ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు. ముకేశ్‌ అంబానీ కంపెనీ ఐడీకి ఈ మెయిల్ వచ్చింది.

ఈ సంఘటన జరిగిన వెంటనే ముకేశ్ అంబానీ సెక్యూరిటీ ఇన్‌ఛార్జ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. గుర్తు తెలియని వ్యక్తిపై సెక్షన్‌లు 387, 506(2) కింద కేసు నమోదు చేశారు. ఇదిలా ఉంటే ముకేశ్‌ అంబానీకి హత్య బెదిరింపులు రావడం ఇదే తొలిసారి కాదు, గతేడాది బిహార్‌లోని దర్భంగాకు చెందిన ఓ వ్యక్తి ముకేశ్‌ అంబానీని చంపేస్తామంటూ కాల్ చేశాడు. దీంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఆ వ్యక్తిని పట్టుకున్నారు.

ఈ వ్యక్తిని రాకేష్‌ కుమార్‌ మిశ్రాగా పోలీసులు గుర్తించారు. ముంబయిలోని సర్‌ హెచ్‌ఎన్‌ రిలయన్స్‌ ఫౌండేషన్‌ హాస్పిటల్‌ను పేల్చివేస్తానని బెదిరించాడు. ఇదిలా ఉంటే 2021లో ముకేశ్‌ అంబానీ ముంబయి నివాసం యాంటిలియా సమీపంలో 20 పేలుడు జెలటిన్ స్టిక్స్, బెదిరింపు లేఖతో కూడిన స్కార్పియో కారును గుర్తించిన విషయం తెలిసిందే. అప్పట్లో ఈ అంశం దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీసింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

నల్ల ద్రాక్షతో బంపర్‌ బెనిఫిట్స్.. రోజూ తినడం వల్ల కలిగే అద్భుతం
నల్ల ద్రాక్షతో బంపర్‌ బెనిఫిట్స్.. రోజూ తినడం వల్ల కలిగే అద్భుతం
పెళ్లైన 3 రోజుల తరువాత.. గుడ్ న్యూస్ చెప్పి షాకిచ్చింది వీడియో
పెళ్లైన 3 రోజుల తరువాత.. గుడ్ న్యూస్ చెప్పి షాకిచ్చింది వీడియో
ఎక్కడ మొదలైందో.. అక్కడే ఆగిన త్రివిక్రమ్ వీడియో
ఎక్కడ మొదలైందో.. అక్కడే ఆగిన త్రివిక్రమ్ వీడియో
మూసుకుపోయిన.. కళ్యాణ్ కళ్లను తెరిపించిన శివాజీ వీడియో
మూసుకుపోయిన.. కళ్యాణ్ కళ్లను తెరిపించిన శివాజీ వీడియో
మీకు కొంచెం కూడా కోపం రావడం లేదా? జాన్వీ కపూర్ ఎమోషనల్ పోస్ట్
మీకు కొంచెం కూడా కోపం రావడం లేదా? జాన్వీ కపూర్ ఎమోషనల్ పోస్ట్
జుట్టు రాలుతోంద‌ని తెగ‌ ఫీల‌వుతున్నారా? ఈ నూనెతో మసాజ్‌ చేసుకుంటే
జుట్టు రాలుతోంద‌ని తెగ‌ ఫీల‌వుతున్నారా? ఈ నూనెతో మసాజ్‌ చేసుకుంటే
నాగ వంశీ నుంచి దిల్ రాజు చేతికి..? వీడియో
నాగ వంశీ నుంచి దిల్ రాజు చేతికి..? వీడియో
రికార్డులు తిరగరాసిన రైతు బిడ్డ.. ఇప్పుడేం చేస్తున్నాడు?
రికార్డులు తిరగరాసిన రైతు బిడ్డ.. ఇప్పుడేం చేస్తున్నాడు?
'షూట్ నుంచి మధ్యలోనే.. ఆ స్టార్ హీరోయిన్ వల్ల నా పరువు పోయింది..'
'షూట్ నుంచి మధ్యలోనే.. ఆ స్టార్ హీరోయిన్ వల్ల నా పరువు పోయింది..'
అటు ఎన్టీఆర్.. ఇటు రామ్ చరణ్.. స్టార్ హీరోలతోనే ఛాన్సులు..
అటు ఎన్టీఆర్.. ఇటు రామ్ చరణ్.. స్టార్ హీరోలతోనే ఛాన్సులు..