Kejriwal Summoned: ఢిల్లీ లిక్కర్ కేసులో కేజ్రీవాల్‌కు నోటీసులు.. నవంబర్ 2న విచారణకు రావాలన్న ఈడీ నవంబర్ 2న విచారణకు రావాలన్న ఈడీ
Delhi Excise Policy Case: ఈడీ ఆయనకు నోటీసులు పంపి నవంబర్ 2న విచారణకు పిలిచింది. ఈ మొత్తం వ్యవహారం ఢిల్లీ కొత్త మద్యం పాలసీకి సంబంధించినది. ఇదే కేసులో కేజ్రీవాల్‌ను విచారణకు పిలిచారు. ఈ కేసులో ఏప్రిల్ 16న సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) అరవింద్ కేజ్రీవాల్‌ను తొమ్మిది గంటల పాటు విచారించింది. ఆ సమయంలో అతడికి విచారణకు నోటీసు కూడా ఇచ్చారు. ఇప్పటికే ఇదే కేసులో జైలులో ఉన్న మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్ సోమవారం తిరస్కరణకు..

ఢిల్లీ మద్యం కుంభకోణం వేడి ఎట్టకేలకు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు చుట్టుకుంది. ఈడీ ఆయనకు నోటీసులు పంపి నవంబర్ 2న విచారణకు పిలిచింది. ఈ మొత్తం వ్యవహారం ఢిల్లీ కొత్త మద్యం పాలసీకి సంబంధించినది. ఇదే కేసులో కేజ్రీవాల్‌ను విచారణకు పిలిచారు. ఈ కేసులో ఏప్రిల్ 16న సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) అరవింద్ కేజ్రీవాల్‌ను తొమ్మిది గంటల పాటు విచారించింది. ఆ సమయంలో అతడికి విచారణకు నోటీసు కూడా ఇచ్చారు. ఇప్పటికే ఇదే కేసులో జైలులో ఉన్న మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్ సోమవారం తిరస్కరణకు గురికావడం, అదే రోజు కేజ్రీవాల్‌కు నోటీసులు ఇవ్వడం యాదృచ్ఛికంగా మారింది.
కోర్టు ఏం చెప్పిందంటే..
ఇప్పుడు ఢిల్లీ ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ప్రశ్నించేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు సమన్లు పంపింది. నవంబర్ 2న (గురువారం) అతడిని విచారణకు పిలిచినట్లు అధికారులు తెలిపారు.
ఇదే కేసులో ఆప్ నేత, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు సుప్రీంకోర్టు నుంచి ఉపశమనం లభించని తరుణంలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్‌కు ఈడీ నోటీసులు పంపింది. సోమవారం (అక్టోబర్ 30) ఆయన బెయిల్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది.
మరోవైపు ఆప్, బీజేపీల మధ్య వాగ్వాదం మరింత ముదిరింది. ఈ కేసులో కేజ్రీవాల్‌ను బీజేపీ సూత్రధారి అని ఆరోపించింది. ఇదిలావుంటే, కేంద్ర ప్రభుత్వం మా పార్టీని క్లీన్ చేయాలనుకుంటుందని మంత్రి, ఆప్ నేత సౌరభ్ భరద్వాజ్ విమర్శించారు.
ఆమ్ ఆద్మీ పార్టీ ఏం చెప్పింది?
సౌరభ్ భరద్వాజ్ మాట్లాడుతూ, “కేంద్ర ప్రభుత్వ ఈడీ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు రెండు తేదీల కోసం సమన్లు పంపింది. దీన్నిబట్టి కేంద్ర ప్రభుత్వానికి ఒకే ఒక్క లక్ష్యం ఉందని స్పష్టమవుతోంది. ఆప్‌ని ఎలాగైనా నాశనం చేయాలనేది అంటూ ట్వీట్ చేశారు
2 नवंबर को ED ने शराब घोटाले के मामले में केजरीवाल को बुलाया है। शराब घोटाले के असली सूत्रधार @ArvindKejriwal का नंबर भी अब जल्द आने वाला है। एक भी भ्रष्टाचारी नहीं बचेगा, याद रखना केजरीवाल। https://t.co/CN91R45HYZ
— Virendraa Sachdeva (@Virend_Sachdeva) October 30, 2023
సిసోడియాతో పాటు సంజయ్ సింగ్ కూడా జైలులో ఉన్నారు. మద్యం పాలసీ స్కామ్‌లో ఆప్ ఎంపీ సంజయ్ సింగ్‌ను అక్టోబర్ 4న ఈడీ అరెస్ట్ చేసింది. ఢిల్లీలోని సంజయ్ సింగ్ ఇంటిపై ఉదయం 7 గంటలకు ఈడీ బృందం దాదాపు 10 గంటల పాటు దాడులు చేసింది. ఈ దాడిలో సంజయ్‌సింగ్‌ను అరెస్టు చేశారు. మరుసటి రోజు అక్టోబర్ 5 న, అతన్ని రూస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. అక్కడ నుంచి కోర్టు అతన్ని అక్టోబర్ 10 వరకు రిమాండ్‌కు పంపింది. అనంతరం ఈ రిమాండ్‌ను మళ్లీ పొడిగించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం