AP Inter Exam Fee: ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ పరీక్ష ఫీజు చెల్లింపునకు షెడ్యూల్ విడుదల..చివరి తేదీ ఇదే
ఇంటర్మీడియెట్ మొదటి, రెండో ఏడాది జనరల్, ఒకేషనల్ పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లింపునకు సంబంధించిన షెడ్యూల్‌ను ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియెట్ బోర్డు మంగళవారం (అక్టోబర్ 31) విడుదల చేసింది. 2024 మార్చిలో జరిగే ఇంటర్ బోర్డు పరీక్షలకు హాజరయ్యే విద్యార్ధులు తుది గడువు ముగిసేలోగా ఆయా కాలేజీల్లో పరీక్ష ఫీజు చెల్లించాలని ఇంటర్మీడియెట్ బోర్డు కార్యదర్శి సౌరబ్ గౌర్ మంగళవారం (అక్టోబర్ 31) ఓ ప్రకటనలో తెలిపారు. ఎలాంటి ఆలస్యం రుసుము లేకుండా రెగ్యులర్, ప్రైవేటు విద్యార్థులు..
అమరావతి, నవంబర్ 1: ఇంటర్మీడియెట్ మొదటి, రెండో ఏడాది జనరల్, ఒకేషనల్ పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లింపునకు సంబంధించిన షెడ్యూల్‌ను ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియెట్ బోర్డు మంగళవారం (అక్టోబర్ 31) విడుదల చేసింది. 2024 మార్చిలో జరిగే ఇంటర్ బోర్డు పరీక్షలకు హాజరయ్యే విద్యార్ధులు తుది గడువు ముగిసేలోగా ఆయా కాలేజీల్లో పరీక్ష ఫీజు చెల్లించాలని ఇంటర్మీడియెట్ బోర్డు కార్యదర్శి సౌరబ్ గౌర్ మంగళవారం (అక్టోబర్ 31) ఓ ప్రకటనలో తెలిపారు. ఎలాంటి ఆలస్యం రుసుము లేకుండా రెగ్యులర్, ప్రైవేటు విద్యార్థులు నవంబర్ 30వ తేదీ వరకు చెల్లించవచ్చని ఆయన తెలిపారు. రూ.1000 ఆలస్య రుసుంతో డిసెంబర్ 15వ తేదీ వరకు ఫీజులు చెల్లించవచ్చిన ఈ సందర్భంగా ఆయన వివరించారు.
ఇంటర్మీడియట్ పరీక్ష ఫీజు షెడ్యూల్ వివరాలివే..
- ఫస్ట్, సెకండియర్ థియరీ పరీక్షలకు రూ.550 ఫీజు చెల్లించాలి.
- ఇంటర్ సెకండ్ ఇయర్ జనరల్, ఫస్ట్, సెకండియర్ చదివే విద్యార్ధులు ఒకేషనల్ ప్రాక్టికల్స్‌కు రూ.250 చెల్లించాలి. అలాగే బ్రిడ్జి కోర్సులకు రూ.150 చెల్లించాల్సి ఉంటుంది.
- ఇంటర్మీడియెట్ ఫస్ట్, సెకండియర్ రెండేళ్లకు కలిపి థియరీ పరీక్షలకు రూ.1100 ఫీజు చెల్లించాలి. ఒకేషనల్ రెండేళ్ల ప్రాక్టికల్స్‌కు రూ.500, ఒకేషనల్ బ్రిడ్జి కోర్సుకు రూ.300 చెల్లించాలి.
- గతంలో ఇంటర్మీడియెట్ పాసై ఇంప్రూవ్‌మెంట్ రాసే విద్యార్ధులు రెండేళ్లకు కలిసి ఆర్ట్స్ విద్యార్థులైతే రూ.1240, సైన్స్ విద్యార్థులైతే రూ.1440 చెల్లించాల్సి ఉంటుంది.
తెలంగాణ ఇంటర్ 2024 పరీక్షల ఫీజు చెల్లింపు తేదీలు ఇవే
మరోవైపు తెలంగాణలో ఇంటర్మీడియట్ బోర్డు కూడా ఇంటర్ మొదటి, రెండో సంవత్సరం పరీక్షల ఫీజు చెల్లింపు తేదీలను ప్రకటించింది. నవంబర్ 14వ తేదీ వరకు పరీక్ష ఫీజు చెల్లింపునకు గడువు విధించినట్లు బోర్డు వెల్లడించింది. నిర్దేశిత ఆలస్య రుసుంతో డిసెంబరు 20వ తేదీ వరకు ఫీజు చెల్లింపులకు అవకాశం కల్పిస్తున్నట్లు బోర్డు వెల్లడించింది.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.